Shubman Gill Double Century: శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ - రెండో టెస్టులో డబుల్ సెంచరీ - ఎన్ని రికార్డులు క్రాష్ అయ్యాయంటే ?
Birmingham test : ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభమన్ గిల్ చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ ఆడారు. నిర్మాణాత్మకంగా ఆడి డబుల్ సెంచరీ పూర్తి చేసి.. అనేక రికార్డులు బద్దలు కొట్టారు.

Shubman gill: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేశారు. ఎడ్జ్‌బాస్టన్‌లో తన మొదటి టెస్ట్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను అనేక రికార్డులను నెలకొల్పాడు. శుభమన్ గిల్ 311 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశారు. 21 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో ఈ స్కోరును సాధించాడు. సంయమనంతో కూడిన ఇన్నింగ్స్‌తో భారత స్కోరు పెంచుకుంటూ వెళ్లారు.
గిల్ ఇంగ్లాండ్‌లో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన మొదటి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు, ఇది ఒక అరుదైన రికార్డు. వరుసగా ఇంగ్లాండ్‌పై ధర్మశాల (2024), హెడింగ్లీ, ఎడ్జ్‌బాస్టన్ (2025)లో సెంచరీలు సాధించాడు. ఇది ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు టెస్ట్‌లలో సెంచరీలు సాధించిన ఐదవ సందర్భంగా నమోదైంది. ఇంతకు ముందు మొహమ్మద్ అజహరుద్దీన్, దిలీప్ వెంగ్సర్కర్, రాహుల్ ద్రవిడ్ ఈ ఫీట్ సాధించారు.
Maiden DOUBLE-CENTURY for Shubman Gill in Test Cricket! 💯💯
— BCCI (@BCCI) July 3, 2025
What a knock from the #TeamIndia Captain! 🫡🫡
Updates ▶️ https://t.co/Oxhg97g4BF#ENGvIND | @ShubmanGill pic.twitter.com/JLxhmh0Xcs
ఈ డబుల్ సెంచరీతో, గిల్ 25 ఏళ్లలోపు ఏడు టెస్ట్ సెంచరీలతో వీరేంద్ర సెహ్వాగ్ , రవి శాస్త్రీలతో పాటు రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (19 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నారు. గిల్ తన కెప్టెన్సీలో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో (హెడింగ్లీ ,ఎడ్జ్‌బాస్టన్) సెంచరీలు సాధించాడు, విజయ్ హజారే (1951–52) , మొహమ్మద్ అజహరుద్దీన్ (1990) తర్వాత ఇంగ్లాండ్‌పై వరుస టెస్ట్ సెంచరీలు సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా నిలిచారు. గిల్ ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ సెంచరీ (డబుల్ సెంచరీ) సాధించిన రెండవ భారత కెప్టెన్‌గా నమోదయ్యాడు, ఇంతకు ముందు విరాట్ కోహ్లీ 2018లో ఈ ఫీట్ సాధించాడు.
A double for Gill.👌👌👌
— Ashwin 🇮🇳 (@ashwinravi99) July 3, 2025
Fabulous start to his leadership stint, this would do him a world of good moving forward.
It’s time for India to bat all day now. #INDvsENG pic.twitter.com/mRbJhYhzWl
శుభమన్ గిల్ ఇప్పటికే వన్డేల్లో డబుల్ సెంచరీ చేశారు. 2023లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజీలాండ్‌పై జరిగిన మొదటి ODI మ్యాచ్‌లో 208 పరుగులు (149 బంతులు, 19 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశారు. పురుషుల ODI క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిపింది. ఈ రికార్డు గతంలో ఇషాన్ కిషన్ (24 సంవత్సరాల 145 రోజులు, 2022లో బంగ్లాదేశ్‌పై 210) పేరిట ఉంది.
Yes, Shubman Gill… you didn’t just lead — you ruled.
— Punjab Cricket Association (@pcacricket) July 3, 2025
From the heart of Punjab to the soul of Indian cricket,
You’ve shown the world what royalty on the pitch looks like.
Not just a captain — a force, a fire, a future written in gold.
Crowns aren’t worn — they’re earned… and… pic.twitter.com/O9ojvVC74d




















