అన్వేషించండి

Rohit Sharma: రిటైర్‌మెంట్‌పై రోహిత్‌శర్మ సంచలన వ్యాఖ్యలు

Rohit Sharma Retirement: రిటైర్‌మెంట్‌ పై టీమిండియా సారధి రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోనని, ఇక చాలని అనిపించిన రోజు తప్పక రిటైరవుతానని తేల్చి చెప్పాడు.

Rohit Sharma reveals retirement plan: రిటైర్‌మెంట్‌ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ... టీమిండియా(England) సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు సరిపోనని, ఇక చాలని అనిపించిన రోజు వెంటనే రిటైరవుతానని తేల్చి చెప్పాడు. దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడుతూ హిట్‌మ్యాన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. తానొక రోజు నిద్ర లేవగానే.. ఇ ఆటకు సరిపోను అనిపిస్తే వెంటనే నేను దాని గురించి మాట్లాడతానని రోహిత్‌ తెలిపాడు. అందరికీ విషయం చెప్తానని కూడా వెల్లడించాడు. నిజాయతీగా చెప్పాలంటే గత రెండేళ్లలో తన ఆట ఇంకా ఉన్నత స్థాయికి చేరిందని రోహిత్‌ తెలిపాడు. ప్రస్తుతం తాను అత్యుత్తమ క్రికెట్‌ ఆడుతున్నాని రోహిత్‌ అన్నాడు. జట్టులోని ఆటగాళ్లు గణాంకాల గురించి ఆలోచించని సంస్కృతిని నెలకొల్పే ప్రయత్నం చేస్తునట్లు రోహిత్‌ తెలిపాడు. గణాంకాలను జట్టుకు దూరంగా ఉంచాలన్నది తన ఉద్దేశమని రోహిత్‌ అన్నాడు. ఒక మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాలి, సెంచరీ చేయాలి అనుకోవడం మంచిదే. కానీ దాని మీద ఎక్కువ దృష్టి ఉండకూడదు’’ అని రోహిత్‌ అన్నాడు. 

సిక్సర్ల కింగ్‌ రోహిత్‌
అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా(Team India) సారధి రోహిత్‌శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్‌ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధ‌ర్మశాల(Dharmashala) వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్‌ ఈ ఘనత సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో డ‌బ్ల్యూటీసీలో 50 సిక్సర్ల మైలురాయిని రోహిత్‌ చేరుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. అత‌డు 38 సిక్సర్లు బాదాడు. ఓవ‌రాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు. బెన్ స్టోక్స్ 78 సిక్సర్లతో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... 50 సిక్సర్లతో రోహిత్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 38 సిక్సర్లతో రిషబ్‌పంత్‌ తర్వాతి స్థానంలో.... 29 సిక్సర్లతో బెయిర్‌ స్టో నాలుగో స్థానంలో ఉన్నారు. 29 సిక్సర్లతో జైస్వాల్ అయిదు, 25 సిక్సర్లతో ట్రానిస్‌ హెడ్‌ ఆరో స్థానంలో ఉన్నారు.


హిట్‌మ్యాన్‌ రికార్డుల జోరు
ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో రోహిత్‌ శర్మ చేసిన శతకం పన్నెండోది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్‌ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్‌ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా... మార్నస్‌ లబుషేన్‌ 11, కేన్‌ విలియమ్సన్‌ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్‌ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌ తర్వాత పాక్‌ స్టార్‌ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్‌(49), సచిన్‌(45) తర్వాత స్థానంలో రోహిత్‌ నిలిచాడు.

టాప్ హెడ్ లైన్స్

IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget