అన్వేషించండి

Rohit Sharma: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు, దిగ్గజాల సరసన హిట్‌మ్యాన్‌

IND vs ENG 4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

Rohit Sharma completes 4000 Test runs: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ ఈ ఘనతను సాధించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రోహిత్‌ రికార్డుల్లోకెక్కాడు. అజారుద్దీన్‌, గుండప్ప విశ్వనాథ్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, ద్రవిడ్‌ , గవాస్కర్‌, కోహ్లి, లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, గంగూలీ, పుజారా, వెంగ్‌సర్కార్‌,  రహానే, ధోని , మొహిందర్‌ అమర్‌నాథ్‌, గంభీర్‌ (4154) భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని దాటారు. వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ పదో స్థానంలో నిలిచాడు. ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్‌ అందరి కంటే వేగంగా చేరుకున్నాడు. వీరూ కేవలం 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకగా.. హిట్‌మ్యాన్‌కు 100 ఇన్నింగ్స్‌లు పట్టాయి.
 
కుంబ్లే రికార్డు బద్దలు
టీమిండియా స్పిన్‌ మాంత్రికుడు, క్రికెట్‌ జీనియస్‌ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అయిదు వికెట్లు తీసిన అశ్విన్.. సుదీర్ఘ ఫార్మాట్‌లో స్వదేశంలో 351 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో 350 వికెట్లతో తనకంటే ముందున్న అనిల్ కుంబ్లేను అశ్విన్ అధిగమించాడు. అశ్విన్, కుంబ్లే మినహా టెస్టుల్లో మరే ఇతర భారతీయ బౌలర్ స్వదేశంలో 300 వికెట్లు పడగొట్టలేదు. 265 వికెట్లతో హర్భజన్ సింగ్ మూడో స్థానంలో... 219 వికెట్లతో కపిల్‌ నాలుగో స్థానంలో.. 210 వికెట్లతో రవీంద్ర జడేజా అయిదో స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే శ్రీలంక మాజీ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తన స్వదేశంలో ఏకంగా 493 వికెట్లు తీయగా.. ఇంగ్లాండ్‌ పేసర్‌ అండర్సన్ స్వదేశంలో 434 వికెట్లు తీశాడు. మరో ఇంగ్లండ్ స్టార్ స్టువర్ట్ బ్రాడ్ స్వదేశంలో 398 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
అశ్విన్‌ రికార్డులే రికార్డులు
రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌(India), ఇంగ్లాండ్‌(England) మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌, క్రికెట్‌ జీనియస్‌, స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. 98 టెస్టుల్లోనే అశ్విన్‌ 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఈ ఘనతను ఈ చెన్నై స్పిన్‌ మాంత్రికుడు అందుకున్నాడు. అశ్విన్‌ కంటే ముందు 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కేవలం 8 మంది మాత్రమే టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్నారు. 2011లో టెస్టు అరంగేట్రం చేసిన అశ్విన్‌.. అనిల్‌ కుంబ్లే, హర్భజన్‌ల తర్వాత ఆస్థాయి స్పిన్నర్‌గా ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఈ 500 వికెట్ల ఘనతను అశ్విన్‌ ప్రత్యేకమైన వ్యక్తికి అంకితం ఇచ్చాడు. 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MEIL Director Sudha Reddy on Budget 2025 | మధ్యతరగతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలంటే.? | ABP DesamMEIL Director Sudha Reddy on Budget 2025 | నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో మహిళలను పట్టించుకుంటున్నారా..!? | ABP DesamUnion Budget 2025 PM Modi Lakshmi Japam | బడ్జెట్ కి ముందు లక్ష్మీ జపం చేసిన మోదీ..రీజన్ ఏంటో.? | ABP DesamUnion Budget 2025 Top 10 Unknown Facts | కేంద్ర బడ్జెట్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకు తెలుసా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2025: కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
కేంద్ర బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్‌ ఉంటుంది?
Union Budget 2025: 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్- రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్ - ఆరుగురు దుర్మరణం
Budget 2025 And Stock Market : బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
బడ్జెట్‎లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
WhatsApp Governance:  వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?
Union Budget 2025 : బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్​ని కేంద్ర బడ్జెట్​లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా? 
Pune T20i Result Update: నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
నాలుగో టీ20 భారత్ దే.. 3 -1తో సిరీస్ కైవసం..15 పరుగులతో ఇంగ్లాండ్ చిత్తు
Revanth Reddy: బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
బీజేపీ ఆఫీస్ అడ్రస్‌లో గద్దర్ పేరు ఉండేలా చేస్తాం - రేవంత్ కీలక ప్రకటన
Embed widget