అన్వేషించండి

Rohit & Hardik Cleared Fitness: ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు ఇద్దరు సూపర్ స్టార్స్ రీఎంట్రీ.. కానీ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయి కంబ్యాక్ ఇవ్వగా, గాయం వల్ల విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రోహిత్, హార్దిక్ ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గి, వన్డే సిరీస్‌కు సిద్ధం.
  • కోహ్లీ గాయంతో సిరీస్ నుండి తప్పుకోగా, జైస్వాల్‌కి అవకాశం.
  • ధర్మశాల, లక్నో, చెన్నైలో జూన్ 13 నుంచి వన్డే సిరీస్.
  • శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది.

Rohit And Hardik Cleared Fitness Test Ahead Of Afghanistan ODI Series: ఇండియా క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒకేసారి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా జట్టులోకి తిరిగి రానున్నారు. బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) నిర్వహించిన ఫిట్‌నెస్ అసెస్‌మెంట్‌లో వీరిద్దరూ సక్సెస్‌ఫుల్‌గా పాస్ అయినట్లు ఏఎన్ఐ (ANI) వర్గాలు తెలిపాయి. ఐపిఎల్ 2026 సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో, హార్దిక్ బ్యాక్ స్పాజమ్స్ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావడంతో త్వరలోనే వీరు నేషనల్ స్క్వాడ్‌తో కలవనున్నారు.

Read Also: Ben Stokes  News: నైట్‌క్లబ్ రచ్చతో చిక్కుల్లో ఇంగ్లాండ్ కెప్టెన్, సడన్‌గా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నాడా!

కోహ్లీ అవుట్, జైస్వాల్‌కి ఛాన్స్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజూరీ కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి కంప్లీట్‌గా రూల్ అవుట్ అయ్యాడు. ఐపిఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ డిఫెండ్ చేసుకున్న టైంలో కోహ్లీకి ఈ గాయమైంది. కోహ్లీ రికవరీ టైమ్‌లైన్‌పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అప్‌డేట్ ఇచ్చాడు. గాయం జరిగి ఇంకా వారం కూడా కాలేదని, ఫిజియోలు పరిశీలిస్తున్నారని చెప్పాడు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ నాటికి కోహ్లీ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ, అది కచ్చితమైన సమాధానం కాదని అగార్కర్ స్పష్టం చేశాడు. కోహ్లీ ప్లేస్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.

Read Also: Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్

సిరీస్ షెడ్యూల్, వెన్యూ వివరాలు
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 13 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. మొదటి వన్డే జూన్ 13న ధర్మశాలలో జరుగుతుంది. రెండో వన్డే జూన్ 17న లక్నోలో, చివరి వన్డే మ్యాచ్ జూన్ 20న చెన్నైలో నిర్వహించనున్నారు. శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నాడు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఈ వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.

Frequently Asked Questions

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తిరిగి వస్తున్నారా?

అవును, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా BCCI CoE నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయ్యారు. వారు ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు తిరిగి వస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడా?

లేదు, విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.

ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?

ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూన్ 13న ధర్మశాలలో ప్రారంభమవుతుంది. మిగిలిన మ్యాచ్‌లు లక్నో, చెన్నైలలో జరుగుతాయి.

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ ఎవరు?

ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చూసుకోనున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
IND vs AUS Test Series Schedule: 5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
5 టెస్టులు ఆడేందుకు భారత్‌కు రానున్న ఆస్ట్రేలియా టీమ్.. పూర్తి షెడ్యూల్ వివరాలు
BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget