Yuzvendra Chahal: క్రికెటర్‌తో బ్రేకప్... అన్ ఫాలో చేయడంతో పాటు హింట్ కూడా - స్మృతి రూటులో?
RJ Mahvash Instagram Post: స్మృతి మంధాన బ్రేకప్ వార్తల్లో ఉండగా... మరొక క్రికెటర్ బ్రేకప్ న్యూస్ వచ్చింది. యుజ్వేంద్రని అన్ ఫాలో చేసిన ఆర్జే మహ్వాష్... సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

బాలీవుడ్ సెలబ్రిటీలకు క్రికెటర్లు ప్రేమలో పడటం కామన్. కొన్ని పెళ్లి వరకు వెళితే మరికొన్ని బ్రేకప్ వంటి వాటికి దారి తీస్తాయి. పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయినది మాత్రం స్మృతి మంధాన - పలాష్ ముచ్చల్ వ్యవహారమే. అది ఇంకా వార్తల్లో ఉండగా... మరొక క్రికెటర్ - బాలీవుడ్ బ్యూటీ బ్రేకప్ న్యూస్ వార్తల్లోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆర్జే మహ్వాష్ (RJ Mahvash) వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)తో ఆమె కనిపించేది. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇద్దరూ తమ సంబంధం గురించి నోరు విప్పలేదు. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే... ఇప్పుడు చాహల్, మహ్వాష్ మధ్య గొడవలు వచ్చినట్టు అర్థం అవుతోంది. అసలు విషయం ఏమిటంటే... ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశారు. దాంతో మరోసారి వార్తల్లో నిలిచారు. చాహల్‌ను అన్ ఫాలో చేసిన తర్వాత మహ్వాష్ ఒక పోస్ట్ షేర్ చేసింది. అది వైరల్ అయ్యింది. ఆమె పోస్ట్ వెంటనే అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శుక్రవారం ఒక వీడియో షేర్ చేసింది. అందులో తన కారులో కూర్చుని ఆమె జుట్టు సరిచేసుకుంటున్నట్లు కనిపించింది. ఇది చాలా సాధారణమైన క్లిప్, కానీ మహ్వాష్ రాసిన క్యాప్షన్ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
మహ్వాష్ పోస్ట్ వైరల్... అసలు విషయం ఏమిటి?
మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేయడంతో పాటు ''మీరు 90 శాతం నన్ను నా జుట్టు సరిచేసుకుంటున్న సమయంలో చూస్తారు. మిగతా సమయంలో నేను జీవితాన్ని సరిచేసుకుంటాను'' అని రాశారు. మహ్వాష్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసింది. దానితో పాటు మరో సందేశం ఉంది. ''మీకు కొంత శాంతిని పంపుతున్నాను'' అని పేర్కొంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించి ఉంటారని నెటిజనులు భావిస్తున్నారు.

ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడానికి గల కారణాన్ని అటు యుజ్వేంద్ర ఛాహల్, ఇటు ఆర్జే మహ్వాష్... ఇద్దరూ వెల్లడించలేదు. అయితే మహ్వాష్ పోస్ట్ చేసిన సమయం, చాహల్‌ను అన్ ఫాలో చేయడాన్ని పలువురు కనెక్ట్ చేస్తున్నారు. ధనశ్రీ వర్మతో చాహల్ 2025లో విడాకులు తీసుకున్నప్పటి నుండి... మహ్వాష్, ఆయన పేరు వార్తల్లో నిలిచింది. పదే పదే జంటగా కనిపించడం వల్ల వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్, డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. అయితే ఇద్దరూ తాము కేవలం మంచి స్నేహితులమని, అంతకు మించి ఏమీ లేదని వాళ్లిద్దరూ పదే పదే చెప్పారు.
Also Read: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ట్రెండింగ్ వార్తలు


















