అన్వేషించండి

SivaKarthik: ఎవరీ శివకార్తీక్? 'జోష్' to 'శంబాల' వయా 'అఖండ'... తెలుగులో వంద సినిమాలు చేసిన నటుడి గురించి తెలుసా?

Shambala Movie OTT: 'శంబాల'తో ఆది సాయికుమార్ హిట్ అందుకున్నారు. నటుడు శివకార్తీక్ సైతం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓటీటీలో విడుదలైన తర్వాత తనకు మరింత గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శంబాల సినిమా విజయం, ఓటీటీలో ట్రెండ్ అవుతోంది.
  • నటుడిగా తొలి అడుగు 'జోష్', హీరోగా 'లజ్జా'తో ప్రయత్నం.
  • 'భైరవగీత' తర్వాత 'అఖండ'లో బోయపాటి అవకాశం.
  • విలక్షణ పాత్రల కోసం 'శంబాల'లో నెగెటివ్ షేడ్స్ రోల్.

కథానాయకుడిగా విజయం కోసం ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఆకలి తీర్చిన సినిమా 'శంబాల'. థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి వసూళ్లు, ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరోసారి ట్రెండ్ అవుతోంది. ఆ సినిమాతో నటుడిగా గుర్తింపు పొందిన మరొకరు శివకార్తీక్. దాంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్ గురించి శివకార్తీక్ చెప్పిన విశేషాలు...
 
నటుడిగా 'జోష్'తో మొదటి అడుగు
మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న రైతు. గుంటూరు జిల్లాలోని వరగాని మా సొంతూరు. మాకు ఎటువంటి సినీ నేపథ్యం లేదు. నేను ఒంటరిగా చిత్రసీమలోకి వచ్చా. 'జోష్' నా మొదటి సినిమా. అందులో నటించేందుకు వేల మంది ఆడిషన్స్ ఇస్తే.... సెలెక్ట్ అయిన వారిలో నేనొకడిని. ఆ తర్వాత 'భీమిలి కబడ్డీ జట్టు', 'పిల్లా జమీందార్' తదితర సినిమాలు చేశా.

'లజ్జ'తో హీరోగా అడుగు వేసిన శివకార్తీక్
నేను కారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్న సమయంలో హీరోగా చేసే అవకాశం వచ్చింది. 'లజ్జా' చేశా. దాని కోసం రెండున్నరేళ్లు కష్టపడినా... అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా వల్ల అటు హీరోగా, ఇటు కారెక్టర్ ఆర్టిస్టుగా గ్యాప్ వచ్చింది. అప్పుడు చాలా కష్టాలు పడ్డా. ఆ టైంలో బాబీ గారు 'పంతం' చూసి నా నటనను మెచ్చుకున్నారు. దాంతో మరింత పైస్థాయికి వెళ్లాలని కసిగా కష్టపడ్డాను.

'అఖండ'లో అవకాశం ఎలా వచ్చిందంటే?
బాబీ గారి మాటలతో కష్టపడుతున్న నాకు... రామ్ గోపాల్ వర్మ గారి 'భైరవగీత'లో ఓ మంచి పవర్ ఫుల్ రోల్‌ చేసే ఛాన్స్ వచ్చింది. దాని వల్ల బోయపాటి గారి దృష్టిలో పడ్డాను. నా నటనను ఆయన మెచ్చుకున్నారు. ఆ తర్వాత 'అఖండ'లో అవకాశం ఇచ్చారు. 'ఉగ్రం', 'తండేల్' సినిమాల్లో మంచి పాత్రలు చేసే అవకాశాలు వచ్చాయి. దర్శకులు, హీరోల సహకారం వల్ల నా నటనకు మంచి పేరొచ్చింది.

Also Readఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్

'శంబాల' దర్శకుడికి రుణపడి ఉంటాను
ఎప్పుడూ సింపతీ పాత్రలు చేయకూడదని, విలక్షణ పాత్రల్లో కనిపించాలని నేను ప్రయత్నిస్తున్న సమయంలో మనీష్ అని కో దర్శకుడి ద్వారా యుగంధర్ ముని గారి దగ్గరకు వద్దకు నేను వెళ్లా. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత 'శంబాల'లో పొగరుతో పాటు నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ పాత్రలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. 'శంబాల'లో అవకాశం ఇచ్చిన దర్శకుడు యుగంధర్ మునికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. ఆది సాయికుమార్ గారు 'శంబాల' కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన డెడికేషన్ చూసి మాలో కసి పెరిగింది. మేమంతా 100 శాతం ఎఫర్ట్స్ పెట్టారు.

'శివ పుత్రుడు' లాంటి సినిమా చేయాలని కోరిక!
ఇప్పుడు నటుడిగా నేను సంతృప్తికరంగా ఉన్నా. చియాన్ విక్రమ్ గారు చేసిన 'శివ పుత్రుడు' లాంటి డిఫరెంట్ రోల్స్ చేయాలన్నది నా కోరిక. అది నా డ్రీమ్. ఇప్పుడు 'హైందవ', 'వృషకర్మ' సినిమాలు చేస్తున్నాను. అవి ఈ ఏడాది విడుదల అవుతాయి. తెలుగులో వంద సినిమాలు చేశా. ఇప్పుడు కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది. మరింత మంచి సినిమాలు, క్యారెక్టర్లు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది

Also Readఎవరీ నిరంజన్ రెడ్డి? 'మనీ' అసిస్టెంట్ డైరెక్టర్ to 'ఆచార్య' నిర్మాత, రాజ్యసభ ఎంపీ వరకు... ఊహకు అందని ఎదుగుదల

టాప్ హెడ్ లైన్స్

Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget