Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?
ఇదే తన చివరి ప్రపంచ కప్ అవుతుందని భారత ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.
Ravichandran Ashwin On ODI World Cup 2023: రెండు నెలల క్రితం వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ పేరు అస్సలు లేదు. ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పుడు కూడా అశ్విన్ అందులో భాగం కాలేదు. దీని తర్వాత అక్షర్ పటేల్‌కు గాయం అయిన కారణంగా అశ్విన్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జట్టులో చేరాడు.
అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ప్రపంచ కప్ జట్టులో కూడా భాగం అయ్యాడు. రెండు, మూడు నెలల క్రితం కూడా కనీసం దీని గురించి ఆలోచించలేదని అశ్విన్ చెప్పాడు. దీంతో పాటు ఇదే తన చివరి ప్రపంచకప్ కావచ్చని కూడా రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.
రవిచంద్రన్ అశ్విన్ ప్రపంచ కప్ జట్టులో తన ఎంపిక గురించి స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడాడు. తాను ప్రపంచ కప్ ఆడతానని అస్సలు అనుకోలేదన్నాడు. గత నాలుగైదేళ్లుగా ఆటను ఆస్వాదిస్తూనే ఉన్నానని తెలిపాడు. ఈ టోర్నీలో కూడా అదే ఆలోచనతో మైదానంలోకి దిగుతానని పేర్కొన్నాడు. టోర్నమెంట్ తర్వాత జట్టులో చోటు దక్కుతుందో లేదో అని చెప్పలేను కానీ ఇది నా చివరి వన్డే ప్రపంచకప్ అని మాత్రం చెప్పగలనని క్లారిటీ ఇచ్చాడు.
2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ షెడ్యూల్ గురించి చెప్పాలంటే అక్టోబర్ 8వ తేదీన చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. దీని తర్వాత అక్టోబరు 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14వ తేదీన అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో, 19న పుణే మైదానంలో బంగ్లాదేశ్‌తో టీం ఇండియా తలపడనుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial