అన్వేషించండి

Ranji Trophy 2024: చెలరేగుతున్న రియాన్‌ పరాగ్‌ - రెండు మ్యాచుల్లో రెండు శతకాలు

Riyan Parag: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్‌లో వరుసగా రెండో సెంచరీతో చేసి సత్తా చాటాడు.

Ranji Trophy 2024: దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2024 (Ranji Trophy 2024) సీజన్‌లో అస్సాం కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (Riyan Parag)  పరుగుల వరద పారిస్తున్నాడు. సీజన్‌లో వరుసగా రెండో సెంచరీతో చేసి సత్తా చాటాడు. ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేసిన రియాన్‌.. కేరళతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మరో బాధ్యతాయుతమైన శతకం బాదాడు. రియాన్‌ చేసిన ఈ రెండు శతకాలు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడివే కావడంతో రియాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. చత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాలో ఆన్‌ ఆడే సమయంలో శతక్కొట్టిన రియాన్‌.. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో సెంచరీతో ఆదుకున్నాడు. 

మ్యాచ్‌ సాగిందిలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. సచిన్‌ బేబి 131 పరుగులతో చెలరేగగా... కున్నుమ్మల్‌ 83, కృష్ణ ప్రసాద్‌ 80 పరుగులతో రాణించారు. అస్సాం బౌలర్లలో ముక్తర్‌ హుసేన్‌, రాహుల్‌ సింగ్‌ చెరో 3 వికెట్లు, సిద్దార్థ్‌ శర్మ 2, ఆకాశ్‌సేన్‌ గుప్తా ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అస్సాం 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ (116) బాధ్యతాయుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రియాన్‌ మినహా మిగిలిన బ్యాటర్లందరూ విఫలం కావడంతో 212 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి అస్సాం కష్టాల్లో పడింది. ఇప్పటికీ  కేరళ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు అస్సాం 207 పరుగులు వెనుపడి ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌తో మ్యాచ్‌లో విధ్వంసం
చత్తీస్‌ఘడ్‌(Chattisgarh) తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం (Assam) సారధి రియాన్‌ పరాగ్‌(Riyan Parag) విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో రియాన్‌ అరుదైన ఘనత సాధించాడు. చత్తీస్‌ఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అస్సాం సారధి రియాన్‌ పరాగ్‌ కేవలం 56 బంతుల్లోనే సెంచరీ చేసి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో వేగవంతమైన శతకం చేసిన భారత ఆటగాళ్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. పరాగ్‌ 87 బంతుల్లోనే 11 బౌండరీలు, 12 భారీ సిక్సర్ల సాయంతో 155 పరుగులు చేశాడు. అయితే 56 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా పరాగ్‌.. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ సరసన చేరాడు. 1985-86 సీజన్‌లో రిచర్డ్స్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడు పరాగ్‌.. రిచర్డ్స్‌ రికార్డును సమం చేశాడు. భారత్‌లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడుతూ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాళ్లలో పరాగ్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో శక్తి సింగ్‌ 45 బంతులలో, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ 48 బంతుల్లో.. యూసుఫ్‌ పఠాన్‌ 51, ఆర్‌కె బోరా 56 బంతుల్లోనే శతకం శతకాలు సాధించి పరాగ్‌ కంటే ముందున్నారు.

పరాగ్‌ రాణించినా పరాజయమే
పరాగ్‌ రాణించినా ఛత్తీస్‌గఢ్‌ చేతిలో అస్సాం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగులు చేసింది. అస్సాం ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్‌ కాగా రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసింది. 87 పరుగుల లక్ష్యాన్ని ఛత్తీస్‌గఢ్‌ వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget