Rahul Dravid : ప్రస్ట్రేషన్‌లో కారు అద్దాలు పగలగొట్టిన రాహుల్ ద్రవిడ్- ఆశ్చర్యపోయిన తల్లి
టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుతో ఉన్నాడు.
Rahul Dravid : భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గతంలో పలు యాడ్స్ చేసినా రెండేండ్ల క్రితం చేసిన ‘క్రెడ్’ యాడ్ బాగా పాపులర్ అయింది. ‘ఇందిరానగర్ కా గూండా’ అంటూ ద్రవిడ్ సందడి చేశాడు. ఈ యాడ్‌లో ఫుల్ ఫ్రస్ట్రేషన్ మోడ్‌లో ఉండే ద్రవిడ్.. తన చుట్టు పక్కల ఉన్న కార్ల అద్దాలను పగలగొడుతుంటాడు. అయితే ద్రవిడ్ చేసిన ఈ యాడ్‌లో అద్దాలను పగలగొట్టడాన్ని చూసి ఆయన తల్లి ఆశ్చర్యపోయిందట.. అసలు అలా చేసింది నువ్వేనా..? అని ఇప్పటికీ అడుగుతుందని ద్రవిడ్ అన్నాడు.
ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఆ యాడ్ చేసిన తర్వాత చాలా మంది నన్ను చూసే విధానం పూర్తిగా మారింది. నేను ఎప్పుడు ఎలా భగ్గుమంటానో అని భయపడుతుంటారు. కానీ ఆ యాడ్‌కు మాత్రం చాలా మంచి స్పందన వచ్చింది. చాలా మంది దానిని పాజిటివ్‌గానే తీసుకున్నారు. అలా వస్తుందని నేను కూడా ఊహించలేదు.. యాడ్ చూసినవాళ్లంతా పాజిటివ్ గానే స్పందించినా మా అమ్మ మాత్రం ఇప్పటికీ నమ్మదు. నేను అంత ఆవేశంతో ఊగిపోతూ కారు అద్దాలను పగలగొడతానంటే ఇప్పటికీ నమ్మడం లేదు. ఆ యాడ్ చూసినప్పుడల్లా.. ‘నిజంగా నువ్వు అలా ఆలోచిస్తున్నావా..?’ అని అడుగుతుంది..’’ అని తెలిపాడు.
Never seen this side of Rahul bhai 🤯🤣 pic.twitter.com/4W93p0Gk7m
— Virat Kohli (@imVkohli) April 9, 2021
ముంబైలో చుట్టూ ప్రజల ముందు ఆ యాడ్ చేయడం తనకు చాలా ఇబ్బందిగా ఉందని, తన లైఫ్‌లో అంత ఇబ్బందిపడి తీసిన యాడ్ ఇదేనని ‘ది వాల్’ చెప్పాడు. ‘నేను చేసిన యాడ్స్ అన్నింటిలోకెల్లా దీనికి చాలా ఇబ్బందిపడ్డా. ఆ యాడ్‌ను ముంబై వీధుల్లో చిత్రీకరించారు. పేరుకు ఇది యాడ్ అయినా చుట్టుపక్కల జనం, యాక్టర్లు, ఇతరులు చాలా మంది నా చుట్టే ఉన్నారు. వాళ్లందరి మధ్య అలా అరుస్తూ, గోల చేస్తూ నడిరోడ్డులో నిల్చుని అరవడం నాకే చాలా ఇబ్బందికరంగా అనిపించింది.. చూసేవాళ్లకు కూడా అది ఇబ్బందే..’ అంటూ వివరించాడు.
Rahul Dravid said, "my mother is still not really convinced about that Indiranagar Ka Gunda Ad. I think she still believes that I shouldn't have been smashing the glass. It's probably one of the most embarrassing things I have done (smiles)". pic.twitter.com/gJn78zNm4C
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2023
ఇక నేటి నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగబోయే తొలి టెస్టుతో భారత జట్టు కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ (2023-2025) ను ప్రారంభించనుంది. తొలి టెస్టుతో పాటు వెస్టిండీస్‌తో జరుగబోయే మ్యాచ్‌లు అన్నీ టెలివిజన్‌లో చూడాలనుకునేవారికి దూరదర్శన్ గుడ్ న్యూస్ చెప్పింది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లను ఉచితంగానే వీక్షించొచ్చు. హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, తెలుగు, కన్నడ, తమిళ్‌లో లైవ్ ప్రసారాలు చూడొచ్చు. తెలుగులో చూసేవాళ్లు డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి ఛానెల్స్‌లో మ్యాచ్‌లను ఫ్రీగా చూసేయొచ్చు. టీవీల ద్వారా కాకుండా మొబైల్స్‌లో ఈ మ్యాచ్‌లను చూడాలనుకునేవారు జియో మొబైల్ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. ఫ్యాన్ కోడ్ (వెస్టిండీస్ అధికారిక ప్రసారదారు) యాప్, వెబ్‌సైట్‌లో కూడా వీటిని వీక్షించొచ్చు. కానీ ఫ్యాన్‌కోడ్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial