అన్వేషించండి

NZ-W vs SL-W: లెక్క మరిచిపోయిన అంపైర్లు - వన్డేలలో 11 ఓవర్లు బౌలింగ్ చేసిన కివీస్ బౌలర్

వన్డే క్రికెట్ లో ఒక బౌలర్ ఇన్నింగ్స్ లో పది ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి. కానీ అంపైర్ల మతిమరుపుతో ఓ బౌలర్ 11 ఓవర్లు బౌలింగ్ చేసింది.

NZ-W vs SL-W: క్రికెట్ లో మ్యాచ్ ను సజావుగా సాగేలా చూసేది  అంపైర్లే.. గేమ్ వాళ్ల నియంత్రణలోనే ఉంటుంది.  కొన్నికొన్నిసార్లు వాళ్లు చేసే  చిన్న  తప్పిదాలు ఓ జట్టుకు   భారీ నష్టాన్నే చేకూర్చుతాయి.   ఇటీవల శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య  జరిగిన  మహిళల వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఇలాంటి బ్లండర్ ఒకటి చర్చనీయాంశమైంది. కివీస్ బౌలర్  ఎడెన్ కార్సెన్.. వన్డేలలో పరిమితికి మించి  11 ఓవర్లు వేసింది.   50‌ ఓవర్ల ఫార్మాట్ వచ్చాక ఒక బౌలర్ 10 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయాలి. 

అంపైర్లు మరిచిపోయి..  

శ్రీలంక పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్..  గాలె వేదికగా జరిగిన రెండో వన్డేలో అంపైర్లు, కివీస్ కెప్టెన్ ఈ తప్పిదం చేశారు. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక ఇన్నింగ్స్ లో  పది ఓవర్లు పూర్తి చేసుకున్న   ఆఫ్ స్పిన్నర్ ఎడెన్ కార్సెన్.. 11 ఓవర్ కూడా వేసింది. లంక ఇన్నింగ్స్ లో 45వ ఓవర్ లోనే  కార్సెన్ పది ఓవర్ల కోటా పూర్తయింది.  పది ఓవర్లలో ఆమె  46  పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీసింది.  

కానీ   కివీస్  కెప్టెన్ సోఫీ డెవిన్ మరిచిపోయి  కార్సెన్ కు 47వ ఓవర్లో కూడా  వేయాలని బంతినిచ్చింది.  అంపైర్లు కూడా కార్సెన్ పది ఓవర్లు ముగిశాయన్న విషయం మరిచిపోయారు.  థర్డ్ అంపైర్లు,  స్టాట్స్ వేసే వాళ్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. దీంతో ఆమె 11వ ఓవర్ వేసింది.  తనకు ఎక్స్ట్రాగా దక్కిన ఓవర్ లో కార్సెన్.. మరో పరుగు ఇచ్చింది.  తీరా  ఓవర్ ముగిశాక ఆమె 11 ఓవర్లు  వేసింది అని స్క్రీన్స్ పై కనబడటంతో  ఇందుకు సంబంధించిన ఫోటోలు  నెట్టింట వైరల్ గా మారాయి.  

 

1993 తర్వాత.. 

ఐసీసీ..  వన్డేలలో 55 ఓవర్ల ఫార్మాట్ లో ఛేంజెస్ చేసి  1995లో దానిని 50‌ ఓవర్లకు కుదించింది.  55 ఓవర్ల ఫార్మాట్ ఉన్నప్పుడు వన్డేలలో ఒక బౌలర్ 11 ఓవర్లు వేయడానికి ఆస్కారం ఉండేది. కివీస్ తరఫున (మహిళా క్రికెట్ లో)  వన్డేలలో  11 ఓవర్లు వేసిన  బౌలర్ (1993 తర్వాత)  కార్సనే కావడం గమనార్హం.  

ఆ నలుగురు కూడా.. 

కార్సన్ కంటే ముందు  అంపైర్లు, స్టాట్స్ డిపార్ట్మెంట్ లో  తప్పుల కారణంగా 1995 తర్వాత కూడా నలుగురు బౌలర్లు వన్డేలలో 10 ప్లస్ ఓవర్లు   బౌలింగ్ చేశారు. వారిలో నీతూ డేవిడ్ (ఇండియా - 20‌‌04), గాయత్రి కరియవసమ్ (శ్రీలంక - 1998), పూర్ణిమ (ఇండియా- 1995), మహ్మద్ రఫిక్ (బంగ్లాదేశ్ - 1995) లు ఈ జాబితాలో ఉన్నారు. 

ఇక న్యూజిలాండ్ - శ్రీలంక మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. గాలెలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది.  కెప్టెన్ సోఫీ డెవిన్ (137),  మెలి కెర్ (108) లు సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం శ్రీలంక.. 48.4 ఓవర్లలో  218 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 111 పరుగుల తేడాతో గెలుపొందింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget