GG vs UPW: గుజరాత్‌కు ఆఖరి మ్యాచ్ - గెలిస్తే ప్లేఆఫ్‌కు వారియర్జ్!
GG vs UPW: విమెన్ ప్రీమియర్ లీగులో నేడు 17వ మ్యాచ్ జరుగుతోంది. బ్రౌబర్న్ వేదికగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ తలపడుతున్నాయి. మరి నేటి పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
GG vs UPW, WPL 2023:
విమెన్ ప్రీమియర్ లీగులో నేడు 17వ మ్యాచ్ జరుగుతోంది. బ్రౌబర్న్ వేదికగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ తలపడుతున్నాయి. ఇందులో గెలిచి ప్లేఆఫ్ కన్ఫామ్ చేసుకోవాలని యూపీ భావిస్తోంది. ఈ ఒక్కటైనా గెలిచి గౌరవప్రదంగా లీగ్‌ను ముగించాలని జెయింట్స్ పట్టుదలగా ఉంది. మరి నేటి పోరులో గెలిచేదెవరు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
సమతూకం కుదిరింది!
యూపీ వారియర్జ్ ఆరు మ్యాచులాడి 3 గెలిచి 3 ఓడింది. 6 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే వారు ప్లేఆఫ్‌కు మరింత చేరువ అవుతారు. ఒకవేళ ఓడినా మరో మ్యాచ్‌లో అవకాశం ఉంటుంది. లీగులోనే అత్యంత పటిష్ఠమైన స్పిన్ డిపార్ట్‌మెంట్ వీరి సొంతం. సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ త్రయం ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది. ఓపెనింగ్‌లో అలీసా హేలీ, దేవికా వైద్య ఇంకా మెరుగ్గా ఆడాలి. తాహిలా మెక్‌గ్రాత్, గ్రేస్ హ్యారిస్ మిడిలార్డర్లో క్లిక్ అయ్యారు. కిరన్ నవగిరె నిలిస్తే బీభత్సమే! అంజలి శర్వాణీ, సిమ్రన్ షేక్ బౌలింగ్ ఫర్వాలేదు. హ్యారిస్ అద్భుతమైన పేస్‌తో వికెట్లు పడగొడుతోంది. సోఫీ ఎకిల్‌స్టోన్ ఫినిషర్‌గా రెచ్చిపోతోంది. అయితే పవర్‌ప్లేలో యూపీ స్కోరింగ్ రేట్ అస్సలు బాగాలేదు. పైగా వికెట్లూ తీయడం లేదు.
ఆఖరి మ్యాచ్!
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే గుజరాత్ అద్భుతాలే చేయాలి! యూపీ వారియర్స్‌ను 100 తేడాతో ఓడించాలి. అప్పటికీ దిల్లీ చేతిలో యూపీ 112 తేడాతో ఓడిపోవాలని ప్రార్థించాలి. పైగా ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవాలి. ఇవన్నీ జరిగేవి కావు! పైగా జైత్రయాత్ర సాగిస్తున్న ముంబయిని ఓడించిన యూపీని పడగొట్టడం సులభం కాదు. పిచ్‌లు నెమ్మదించడంతో ప్రత్యర్థి స్పిన్నర్లతో వీరికి ప్రమాదమే! గుజరాత్‌లో యాష్లే గార్డ్‌నర్ ఒక్కరే స్థాయికి తగ్గట్టు ఆడుతోంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో దుమ్మురేపుతోంది. సోఫీయా డాంక్లీ, లారా వూల్‌వర్ట్ రూపంలో జెయింట్స్‌కు ఆలస్యంగా ఓపెనింగ్ పాట్నర్స్ దొరికారు. మేఘన ఇంకా ఇబ్బంది పడుతోంది. హర్లీన్ డియోల్ మాత్రమే అన్ని మ్యాచుల్లో కన్‌సిస్టెంట్‌గా బ్యాటింగ్ చేస్తోంది. హేమలత ఎప్పుడూ ఒత్తిడిలోనే వస్తోంది. కిమ్ గార్త్ పేస్ బౌలింగ్ మాత్రం అదుర్స్. ఆమెకు సరైన పేస్ బౌలింగ్ పాట్నర్ లేదు. మంచి స్పిన్నర్లే ఉన్నా వికెట్లు తీయడం లేదు. ఓవర్‌కు 9.35 ఎకానమీతో పరుగులు ఇచ్చేస్తోంది జెయింట్స్
తుది జట్లు (అంచనా)
గుజరాత్ జెయింట్స్: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్ డియోల్, యాష్లే గార్డ్‌నర్, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్, కిమ్ గార్త్, మేఘన
యూపీ వారియర్జ్: దేవికా వైద్య, అలీసా హీలీ, కిరన్ నవగిరె, గ్రేస్ హ్యారిస్, తాలియా మెక్‌గ్రాత్, సిమ్రన్ షేక్, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్, శ్వేతా షెరావత్, అంజలి శర్వాణి, రాజేశ్వరీ గైక్వాడ్
Say goodbye to Monday blues with a double dose of #TATAWPL action 🙌#CheerTheW #GGvUPW #MIvDC pic.twitter.com/9958iY49Ec
— JioCinema (@JioCinema) March 20, 2023
𝐌assive 𝐌onday 𝐌atchday 👊#GGvUPW #UPWarriorzUttarDega #WPL pic.twitter.com/AsE9gFXk2O
— UP Warriorz (@UPWarriorz) March 20, 2023