అన్వేషించండి

Mohammed Shami: టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్! , సఫారీ సవాల్‌కు షమీ దూరం

Mohammed Shami: భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.

సఫారీ గడ్డపై మూడో టీ 20లో గెలిచి సిరీస్‌ను సమం చేసిన టీమిండియాకు.. టెస్ట్‌ సిరీస్‌కు ముందు భారీ షాక్‌ తగిలే అవకాశం ఉంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటిన స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టెస్ట్‌ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. చీల‌మండ‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న ష‌మీ... ప్రస్తుతం గాయానికి చికిత్స తీసుకుంటున్నాడు. షమీ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేద‌ని  తెలుస్తోంది. అదే నిజమైతే ద‌క్షిణాప్రికాతో టెస్ట్‌ సిరీస్‌కు షమీ దూరం కానున్నాడు. రెండు టెస్టు మ్యాచ్ సిరీస్ కోసం ఎంపికైన భార‌త ఆట‌గాళ్లు నేడు ద‌క్షిణాఫ్రికా వెళ్లనున్నారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మతో పాటు సీనియ‌ర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, జ‌స్‌ప్రీత్ బుమ్రా, ర‌విచంద్రన్ అశ్విన్‌, న‌వ‌దీప్ సైనీ, హ‌ర్షిత్ రాణాలు నేడు ద‌క్షిణాఫ్రికాకు బ‌య‌లుదేర‌నున్నారు. వీరితో షమీ వెళ్లటం లేదు. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో భాగంగా ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుతో భార‌త్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలుపొంద‌డం భార‌త్‌కు చాలా కీలకం.

అయితే.. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డపై భార‌త జ‌ట్టు ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. ఈ సారి అయిన అంద‌ని ద్రాక్షగా ఉన్న సిరీస్‌ను సొంతం చేసుకోవాల‌ని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ష‌మీ సిరీస్‌కు దూరం అయితే నిజంగానే టీమ్ఇండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. సఫారీ గడ్డపై తొలి టెస్టు డిసెంబర్ 26 నుంచి 30 వరకు సెంచూరియన్ వేదికగా, రెండో టెస్టు జవనరి 3 నుంచి 7 వరకు కేప్‌టౌన్ వేదికగా జ‌ర‌గ‌నుంది.
 భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో షమీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో షమీ 7/57 గణాంకాలు నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరఫున ఏడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనతతో షమీ తన పేరిట సరికొత్త రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఆశిష్ నెహ్రా 2003 వరల్డ్‌కప్‌లో ఆరు వికెట్లు తీసి, వరల్డ్‌కప్‌లోని సింగిల్ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర నెలకొల్పాడు. ఇప్పుడు షమీ ఏడు వికెట్లు పడగొట్టి.. ఆ చరిత్రను తిరగరాశాడు. న్యూజిలాండ్‌పై సెమీఫైనల్లో ఏడు వికెట్ల హాల్‌తో.. వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు అయిదు వికెట్లు సాధించిన బౌలర్‌గానూ షమీ మరో రికార్డ్‌ని నెలకొల్పాడు.

మరోవైపు భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అర్జున అవార్డు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన షమీ పేరును అర్జున అవార్డు కోసం బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ ప్రత్యేక అభ్యర్థన చేసిందని క్రీడా వర్గాలు తెలిపాయి. క్రీడా మంత్రిత్వ శాఖకు మొదటగా పంపిన జాబితాలో మహ్మద్ షమి పేరు లేదు. అలాగే, ‘‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ అవార్డుకు పురుషుల బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్ శెట్టి పేర్లను సిఫారసు చేశారు. ఈ ఏడాది సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడి ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో నెంబర్ వన్‌ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది.

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget