T20 World Cup - IND W Batting Order Change: భారత బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయాల్సిందేనా..! సెమీస్ చేరాలంటే కొన్ని మార్పులు తప్పనిసరి!
సౌతాఫ్రికా చేతిలో ఇండియా ఓడిపోయిన నేపథ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలని, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పొజిషన్ మార్చాలని పలువురు సూచిస్తున్నారు.

Mithali Raj Suggests Harmanpreet Kaur Promotion To Number Four: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో సౌతాఫ్రికా చేతిలో ఇండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంపై అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు కూడా నిరాశకు లోనయ్యారు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఓటమి పాలవ్వడం తీవ్ర నిరాశ కలిగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే ఇండియా పాయింట్స్ టేబుల్ లో టాప్ పొజిషన్ కు వెళ్లేదని, కానీ ఇప్పుడు సెమీఫైనల్స్ చేరాలంటే బలమైన ఆస్ట్రేలియాను కచ్చితంగా ఓడించాల్సిన సిట్యుయేషన్ వచ్చింది. ఈ క్రమంలోనే టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయాలని, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను నంబర్ ఫోర్ పొజిషన్ కు ప్రమోట్ చేస్తే బాగుంటుందని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
జెమిమా నంబర్ ఫైవ్..
హర్మన్‌ప్రీత్ కౌర్ లాంటి సీనియర్ బ్యాటర్ నంబర్ ఫైవ్ లాంటి లేట్ పొజిషన్ లో రావడం కరెక్ట్ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. "హర్మన్‌ప్రీత్ నంబర్ ఫోర్ లో వస్తే, జెమిమా రోడ్రిగ్స్ నంబర్ ఫైవ్ లో బ్యాటింగ్ చేయాలి. జెమిమా గతంలో నంబర్ ఫైవ్ పొజిషన్ లో చాలా రన్స్ స్కోర్ చేసింది. ఆమె ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చేసరికి పిచ్ పై స్పిన్నర్లు బౌలింగ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. స్పిన్ ను ఎదుర్కోవడం జెమిమా మెయిన్ స్ట్రెంత్. స్పిన్నర్లపై తను క్రీజును వాడుకుంటూ అద్భుతమైన స్కూప్స్, స్వీప్ షాట్స్ ఆడగలదు. దీనివల్ల జెమిమాకు మంచి కాన్ఫిడెన్స్ రావడంతో పాటు ఫామ్ అందుకోవడానికి, టీమ్ మొమెంటంను పెంచడానికి హెల్ప్ అవుతుంది" అని దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది.
శ్రీ చరణి బౌలింగ్ వండర్స్..
సౌతాఫ్రికా మ్యాచ్ లో ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ను మిథాలీ రాజ్ స్పెషల్ గా అప్రిషియేట్ చేసింది. ప్రొటీస్ టీమ్ 159 రన్స్ ఛేజింగ్‌లో ఉన్నప్పుడు శ్రీ చరణి ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను 25/2 కి కట్టడి చేసి, ఇండియాను మ్యాచ్ లోకి తెచ్చింది. "శ్రీ చరణి చాలా క్విక్ లెర్నర్ . ఆమె ఇంగ్లీష్ కండిషన్స్ లోనే డెబ్యూ చేయడంతో ఇక్కడి వాతావరణంపై మంచి గ్రిప్ ఉంది. పిచ్ నుంచి పెద్దగా టర్న్ దక్కకపోయినా వికెట్లను టార్గెట్ చేస్తూ కన్సిస్టెంట్‌గా బౌలింగ్ చేసింది. పేస్, లెంగ్త్‌లలో వేరియేషన్స్ చూపిస్తూ తనకు కావాల్సిన ఫీల్డింగ్ సెట్ చేసుకుంది. సెండ్ స్పెల్ లోనూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ మెయింటైన్ చేస్తూ ప్రొటీస్ బ్యాటర్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు" అని మిథాలీ పేర్కొంది.
సెమీస్ చేరాలంటే గెలవాల్సిందే
ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 158 రన్స్ సాలిడ్ స్కోర్ చేసినప్పటికీ, ఫీల్డింగ్ లో జరిగిన పొరపాట్లు శాపంగా మారాయి. సౌతాఫ్రికా స్టార్ మరిజానే కాప్ రెండు డ్రాప్ క్యాచెస్ లక్కీ లైఫ్‌లైన్స్ ను యూజ్ చేసుకుని కేవలం 45 బంతుల్లోనే 81 రన్స్ తో అజేయంగా నిలిచి మ్యాచ్ ను లాస్ట్ ఓవర్ లో ముగించింది. ఈ ఓటమితో ఇండియా క్వాలిఫికేషన్ ఛాన్సెస్ కాస్త కాంప్లికేట్ అయ్యాయి. ప్రెజెంట్ ఇండియా గ్రూప్ స్టేజ్ లో తమ మిగిలిన రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లను కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. ఆ రెండు మ్యాచుల్లో విక్టరీ సాధిస్తేనే ఇండియా సెమీఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకోగలదు. ఇక గురువారం మాంచేస్టర్ వేదికగానే బంగ్లాతో ఇండియా తలపడనుంది.
Before You Go
IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
ట్రెండింగ్ వార్తలు



















