అన్వేషించండి

KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్

ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ గురువారం ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.
  • ఏడు టెస్టుల్లో 221 పరుగులు, 21 క్యాచ్‌లు పట్టుకున్నారు.
  • కోహ్లీ, రోహిత్, ద్రవిడ్ లకు కెరీర్ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.
  • భవిష్యత్తులో క్రికెట్ మార్గదర్శకుడిగా ఉండాలని భరత్ ఆకాంక్షించారు.

KS Bharat Announces Retirement From  Cricket:  ఇండియా క్రికెట్ లో ఒక ముగింపు పడింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన డెసిషన్ ను షేర్ చేస్తూ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం తన లైఫ్ లోనే బిగ్గెస్ట్ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ జర్నీ ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, టెస్ట్ మ్యాచ్ లలో దేశం తరఫున ఆడటం ప్రతి క్షణం గర్వంగా అనిపించిందని ఎమోషనల్ అయ్యాడు. గత రెండు దశాబ్దాలుగా తన ఫ్యామిలీ మొత్తం ఒకే కల కోసం బతికిందని, తనను ఎంతో డిసిప్లిన్ గా పెంచిన పేరెంట్స్, సిస్టర్ కు స్పెషల్ థాంక్స్ చెప్పాడు.

Read Also: RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!

టెస్ట్ కెరీర్ లో ఏడు మ్యాచ్ లు.. 

భరత్ ఇండియా తరఫున మొత్తం 7 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 20.09 యావరేజ్ తో 221 రన్స్ చేశాడు. అతడి బెస్ట్ స్కోరు 44 రన్స్. ఒక వికెట్ కీపర్ గా టెస్టుల్లో 21 క్యాచ్ లు అందుకోవడంతో పాటు ఒక స్టంపింగ్ కూడా చేశాడు. తన కెరీర్ లో సపోర్ట్ చేసినందుకు బీసీసీఐ, కోచ్ లు, మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. తన చిన్నతనం నుంచి ఎంతగానో ఎంకరేజ్ చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వీడీసీఏ (VDCA) ఆఫీస్ బేరర్లను గుర్తు చేసుకున్నాడు. అలాగే తనకు ఎల్లప్పుడూ బెస్ట్ పిచ్ లు, గ్రౌండ్ కండిషన్స్ అందించిన గ్రౌండ్ స్టాఫ్ కు, తోటి ప్లేయర్లకు థాంక్స్ చెప్పాడు.

Read Also: Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

ఐపీఎల్ లో కోహ్లీ ఇచ్చిన ఛాన్స్.. 

తన కెరీర్ లో ఐపీఎల్ డెబ్యూ కెప్టెన్ విరాట్ కోహ్లీ రోల్ ను భరత్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే అవకాశం ఇచ్చి తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి హెల్ప్ చేసినందుకు కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సీజన్ లో 8 మ్యాచుల్లో 191 రన్స్ చేశాడు. తన టెస్ట్ డెబ్యూ కెప్టెన్ రోహిత్ శర్మ లీడర్ షిప్ ను ప్రశంసిస్తూ ఆ మూమెంట్ ప్రైస్ లెస్ అని అన్నాడు. ఇండియా ఏ టీమ్ నుంచి సీనియర్ టీమ్ వరకు గైడెన్స్ ఇచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్ సపోర్ట్ ను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు.

యంగ్ ప్లేయర్లకు అదిరిపోయే టిప్స్.. 

తన చిన్ననాటి కోచ్ జె కృష్ణారావుకు కూడా భరత్ థాంక్స్ చెప్పాడు. గ్రౌండ్ లో నేషనల్ యాంథమ్ విన్నప్పుడు కలిగిన ఫీలింగ్ లైఫ్ లాంగ్ గుర్తుంటుందని అన్నాడు. యంగ్ ప్లేయర్స్ పెద్ద కలలు కనాలని, క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడితే కలలు నిజమవుతాయని అడ్వైజ్ ఇచ్చాడు. బీసీసీఐ, టెస్ట్ క్రికెట్ తో జర్నీ ఎండ్ అయినా గేమ్ తో తన రిలేషన్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేశాడు. ఫ్యూచర్ లో నెక్స్ట్ జనరేషన్ క్రికెటర్లకు గైడ్ గా, మెంటర్ గా, కోచ్ గా ఉంటూ క్రికెట్ కు తన వంతు కాంట్రిబ్యూషన్ అందిస్తానని భరత్ తన పోస్ట్ లో ముగించాడు.

Frequently Asked Questions

కేఎస్ భరత్ దేని నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు?

ఆంధ్రప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

కేఎస్ భరత్ టెస్ట్ కెరీర్ గణాంకాలు ఏమిటి?

భరత్ మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 20.09 సగటుతో 221 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ గా 21 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ చేశాడు.

తన ఐపీఎల్ కెరీర్ డెబ్యూ కోసం కేఎస్ భరత్ ఎవరికి కృతజ్ఞతలు తెలిపారు?

తన ఐపీఎల్ డెబ్యూకు అవకాశం ఇచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి భరత్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2021లో RCB తరపున ఆడి తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి కోహ్లీ హెల్ప్ చేశారని పేర్కొన్నారు.

యువ క్రికెటర్లకు కేఎస్ భరత్ ఇచ్చిన సలహా ఏమిటి?

యువ ప్లేయర్స్ పెద్ద కలలు కనాలని, క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడితే కలలు నిజమవుతాయని భరత్ అడ్వైజ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఆటతో తన రిలేషన్ కంటిన్యూ అవుతుందని తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget