అన్వేషించండి

RCB Postpone Title Celebrations: ఆర్‌సీబీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కప్ గెలిచినా బెంగళూరుకు రాని విన్నర్స్ -  అసలు మ్యాటర్ ఇదే..!

ఐపీఎల్ 2026 లో నెగ్గి, వరుసగా రెండోసారి ఛాంపియన్ గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కప్ గెలిచిన వెంటనే బెంగళూరులో సంబరాలు చేసుకోవడం లేదని ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • RCB వరుసగా రెండోసారి IPL ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది.
  • ఆటగాళ్లు, సిబ్బంది బెంగళూరుకు రాకుండా నేరుగా ఇళ్లకు వెళ్తున్నారు.
  • డేటా అనలిటిక్స్, నిపుణుల అంచనాలతో జట్టు విజయవంతమైంది.
  • కెప్టెన్ రజత్ పాటిదార్ పేస్ బౌలింగ్ పై అద్భుత ప్రదర్శన చేశాడు.

RCB Postpone Title Celebrations In Bengaluru: ఐపీఎల్ లో వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ కు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అహ్మదాబాద్ లో టైటిల్ గెలిచిన తర్వాత టీమ్ మొత్తం సెలబ్రేషన్స్ కోసం బెంగళూరు సిటీకి రావడం లేదు. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ అంతా అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్ గా తమ సొంత ఇళ్లకు, హాలిడే ట్రిప్స్ కు వెళ్తున్నట్లు ఆర్‌సీబీ డైరెక్టర్ మో బోబాట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించాడు. తను యూకే వెళ్తున్నానని, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ హాలిడే ప్లాన్ చేసుకున్నాడని, కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా ఇంటికి వెళ్తున్నాడని తెలిపాడు. అందువల్ల బెంగళూరు ఫ్యాన్స్ తో కలిసి సక్సెస్ ఎంజాయ్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని అతడు స్పష్టం చేశాడు.

Read Also: IPL 2026 Flop Playing XI: ఐపీఎల్ 2026 ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ : రిషభ్ పంత్ కెప్టెన్.. సూర్య, హార్దిక్ ,  బుమ్రాలకు చోటు.. నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్

అండర్‌అచీవర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్ 

ఒకప్పుడు స్టార్ ప్లేయర్స్ ఉన్నా కప్ గెలవలేక ‘అండర్‌అచీవర్స్’ గా ముద్రపడిన ఆర్‌సీబీ, 2025 నుంచి కంప్లీట్ గా మారిపోయింది. ఐపీఎల్ హిస్టరీ లో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సడన్ చేంజ్ వెనుక ఎలాంటి క్రేజీ సైనింగ్స్ లేవు, కేవలం డేటా, ఎవిడెన్స్ ఆధారంగా తీసుకున్న డెసిషన్స్ మాత్రమే ఉన్నాయి. లీడ్ అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ అందించిన డేటా అనలిటిక్స్ ఈ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి. కేవలం నంబర్స్ మాత్రమే కాకుండా నిపుణుల అంచనాలు, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ల గట్ ఫీలింగ్, టాక్టికల్ మైండ్ ను బ్యాలెన్స్ చేస్తూ టీమ్ ను నడిపినట్లు మో బోబాట్ వివరించాడు.

Read Also: IPL 2026 Most Sixes Given Bowlers: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.

డేటా మ్యాజిక్ తో పేస్ బౌలింగ్ ను ఉతికేసిన కెప్టెన్ రజత్ 

ఈ సీజన్ లో ఆర్‌సీబీ సక్సెస్ కు కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాటింగ్ లో తెచ్చిన బిగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఒక మెయిన్ రీజన్. గతంలో కేవలం స్పిన్ బాషర్ గా గుర్తింపు తెచ్చుకున్న పాటిదార్, ఈ ఏడాది పేస్ బౌలింగ్ పై సూప‌ర్బ్ అటాక్ చేశాడు. 2025 లో పేసర్లపై కేవలం 190 రన్స్ చేసిన రజత్, 2026 లో ఏకంగా 62.8 యావరేజ్, 189 స్ట్రైక్ రేట్ తో 377 రన్స్ బాదాడు. ఇందులో 28 సిక్సర్లు ఉన్నాయి. అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ ఇచ్చిన వీడియోలు, బౌలర్ల హ్యాండ్ మూవ్‌మెంట్స్ అనాలసిస్ తనకు ఎంతగానో హెల్ప్ అయ్యాయని, ఆ క్రెడిట్ అంతా ఫ్రెడ్డీకే ఇస్తున్నానని పాటిదార్ స్పష్టం చేశాడు.

రషీద్, నరైన్ ల‌పై క‌న్ను..

రషీద్ ఖాన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి డేంజరస్ స్పిన్నర్లు చేతి నుంచి బాల్ ను ఎలా రిలీజ్ చేస్తున్నారో రీడ్ చేయడంలో తనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని పాటిదార్ చెప్పాడు. ఆ టైమ్ లో తాను ఫ్రెడ్డీ వైల్డ్ కు కాల్ చేసి హెల్ప్ అడిగానని, అతడు బౌలర్ల వేరియేషన్స్ ను క్లియర్ గా ఎక్స్ ప్లేన్ చేశాడని తెలిపాడు. ఈ విధంగా హ్యూమన్ జడ్జ్‌మెంట్, మెషిన్ డేటా రెండింటినీ పర్ఫెక్ట్ గా వాడుకోవడం వల్లే ఆర్‌సీబీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడగలిగింది.

Frequently Asked Questions

RCB ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరులో సంబరాలు ఎందుకు వాయిదా పడ్డాయి?

ప్లేయర్స్ మరియు సపోర్ట్ స్టాఫ్ అహ్మదాబాద్ నుండి నేరుగా వారి ఇళ్లకు లేదా హాలిడే ట్రిప్స్ కు వెళ్తున్నారు. అందువల్ల, బెంగళూరు అభిమానులతో కలిసి విజయాన్ని జరుపుకోవడానికి కొంత సమయం పడుతుంది.

RCB అండర్‌అచీవర్స్ నుండి ఛాంపియన్స్‌గా ఎలా మారింది?

RCB 2025 నుండి డేటా మరియు సాక్ష్యాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలతో పూర్తిగా మారింది. లీడ్ అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ అందించిన డేటా అనలిటిక్స్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

కెప్టెన్ రజత్ పాటిదార్‌కు పేస్ బౌలింగ్‌పై మెరుగుదలలో ఎవరు సహాయం చేశారు?

అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ అందించిన వీడియోలు మరియు బౌలర్ల హ్యాండ్ మూవ్‌మెంట్స్ విశ్లేషణ రజత్‌కు ఎంతగానో సహాయపడింది. రజత్ ఈ ఘనత అంతా ఫ్రెడ్డీకే ఇస్తున్నాడు.

ప్రమాదకర స్పిన్నర్లను ఎదుర్కోవడంలో రజత్‌కు ఎవరు సహాయం చేశారు?

రషీద్ ఖాన్, సునీల్ నరైన్ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌ను అర్థం చేసుకోవడంలో ఫ్రెడ్డీ వైల్డ్, రజత్‌కు సహాయం చేశాడు. వారి వేరియేషన్స్‌ను స్పష్టంగా వివరించాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
EPFO Latest News: 20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
20 రోజులైనా PF క్లెయిమ్ అమౌంట్ రాకపోతే ఏం చేయాలి ? ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్
Embed widget