అన్వేషించండి

IPL 2026 Most Sixes Given Bowlers: ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్-5 బౌలర్ల వివరాలు.

ఐపీఎల్ 2026 సీజన్ బ్యాటర్ల విధ్వంసంతో రికార్డుల రాత మార్చింది. ఈ నేపథ్యంలో ఒకే సీజన్ లో భారీగా సిక్సర్లు సమర్పించుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్న టాప్-5 బౌలర్ల లిస్ట్ ను ప‌రిశీలిద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2026 IPL సీజన్ లో బౌలర్లు భారీగా సిక్సర్లు సమర్పించుకున్నారు.
  • మహమ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, అన్షుల్ కంబోజ్ జాబితాలో ఉన్నారు.
  • రబడా 40 సిక్సర్లతో ఒకే సీజన్ లో చెత్త రికార్డ్ నెలకొల్పాడు.

IPL 2026 Most Sixes Conceded By Bowlers:   దాదాపు రెండున్నర నెలలపాటు సాగిన ఐపీఎల్ చాలా మందికి మాజాను పంచింది. అనేక రికార్డులను కొల్లగొడుతూ, ఈ సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ సీజన్ లో ఎంతో మంది ప్రతిభావంతులు తమకు లభించిన అవకాశాలను గ్రాబ్ చేసుకున్నారు. మరికొంతమంది మాత్రం కొన్ని విషయాల్లో జట్టుకు భారంగా మారిపోయారు.  ఇక కొంతమంది బౌలర్లు మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు సమర్పించుకున్నారు. అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న  అన్‌వాంటెడ్ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్న మహ్మద్ సిరాజ్ 2022 సీజన్ లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ 31 సిక్సర్లు ఇచ్చాడు. ఆ సీజన్ లో 15 మ్యాచ్ లలో కేవలం 9 వికెట్లే పడగొట్టి 10.07 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆ సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడంతోపాటు, సిక్సర్లను కూడా ఇచ్చాడు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.  ఇక గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 2025 సీజన్ లో 33 సిక్సర్లు స‌మ‌ర్పించుకుని, ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ సీజన్ లో 15 మ్యాచ్ లాడిన రషీద్ కేవలం 9 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు.

Read Aslo: IPL 2026 Full List Of Awards: ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే.. వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట- పూర్తి జాబితా ఇదే

కంబోజ్ ఊదరగొట్టినా తప్పని బాదుడు..
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఐపీఎల్ 2026 సీజన్ లో సీఎస్‌కే తరఫున అత్యధికంగా 21 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే 10.52 ఎకానమీతో పరుగులు ఇస్తూనే ఏకంగా 34 సిక్సర్లు సమర్పించుకుని ఈ జాబితాలో మూడో స్థానం లో నిలిచాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ 2026 సీజన్ లో 21 వికెట్లతో ఇంప్రూవ్ అయినప్పటికీ, బ్యాటర్లు అతని బౌలింగ్ లో ఏకంగా 36 సిక్సర్లు బాదారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్ లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన రెండో బౌలర్ గా రషీద్ నిలిచాడు.

Read Aslo: IPL 2026 Champs RCB: ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న ఆర్సీబీ

పర్పుల్ క్యాప్ తో పాటు చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబడా ఐపీఎల్ 2026 సీజన్ లో 29 వికెట్ల తో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో రెండోసారి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన రబడా, అదే టైమ్ లో ఒక అన్‌వాంటెడ్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్ లో బ్యాటర్లు అతని లైన్ అండ్ లెంగ్త్ ను టార్గెట్ చేస్తూ ఏకంగా 40 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా రబడా టాప్ ప్లేస్ లో నిలిచాడు. బ్యాటర్ల డామినేషన్ లో బౌలర్లు ఎలా నలిగిపోయారో ఈ గణాంకాలు స్పష్టం చేశాయి.

Frequently Asked Questions

IPL 2026 లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ ఎవరు?

IPL 2026 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబడా 40 సిక్సర్లు ఇచ్చి ఈ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

IPL 2026 లో రషీద్ ఖాన్ ఎన్ని సిక్సర్లు ఇచ్చాడు?

గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 2026 సీజన్ లో 36 సిక్సర్లు సమర్పించుకుని, ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్ లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన రెండో బౌలర్ గా నిలిచాడు.

అన్షుల్ కంబోజ్ IPL 2026 లో ఎన్ని సిక్సర్లు ఇచ్చాడు?

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్ 2026 సీజన్ లో 34 సిక్సర్లు ఇచ్చి మూడో స్థానంలో నిలిచాడు.

IPL 2022 లో మహ్మద్ సిరాజ్ ఎన్ని సిక్సర్లు ఇచ్చాడు?

2022 సీజన్ లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ మహ్మద్ సిరాజ్ 31 సిక్సర్లు ఇచ్చాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget