అన్వేషించండి

IPL 2026 Champs RCB: ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న ఆర్సీబీ

జోరు మీదున్న ఆర్సీబీ ఊహించ‌న‌ట్లుగానే టైటిల్ సాధించింది. ఆతిథ్య జీటీపై సునాయా విజయం సాధించింది. ముఖ్యంగా బౌల‌ర్లు జీటిని క‌ట్ట‌డి చేయ‌డంతో ఆర్సీబీకి ఛేజింగ్ ఈజీగా మారింది. 

IPL 2026 RCB VS GT Result Updates: డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చెలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుతం చేసింది. బ్యాక్ టూ బ్యాక్ టైటిళ్ల‌తో దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న నిలిచింది. ఆదివారం అహ్మ‌దాబాద్ లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ఆతిథ్య గుజ‌రాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అంత‌కుముందు ఫైనల్లో టాస్ గెలిచి, ప్ర‌త్య‌ర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించి, త‌క్కువ స్కోరుకే ప‌రిమితం చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో జీటీ 8 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. స్పిన్ ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (37 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు )  సూపర్బ్ బ్యాటింగ్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం చేజింగ్ ను ఆర్సీబీ కాస్త ఈజీగానే ఛేజ్ చేసింది. కేవ‌లం 17.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. ముఖ్యంగా వెట‌ర‌న్ స్టార్ విరాట్ కోహ్లీ సూప‌ర్బ్ ఫిఫ్టీ (42 బంతుల్లో75 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెల‌రేగి, టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ కు రెండు వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో వ‌రుసా రెండు సీజ‌న్ల‌లో క‌ప్పు గెలిచిన చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (2009,10), ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (2019, 20) స‌ర‌స‌న ర‌జ‌త్ పాటిదార్ (2025,26) నిలిచాడు. ఇక 2025లో తొలిసారి చాంపియ‌న్ గా నిలిచిన ఆర్సీబీ.. ఈసారి కూడా నెగ్గి, రెండో టైటిల్ ను కైవసం చేసుకుంది. 

మెరుపు దాడి..
చిన్న టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ.. అద్భుత వ్యూహంతో గుజ‌రాత్ ను బోల్తా కొట్టించింది. గాయంతో బాధ ప‌డుతున్న వెంక‌టేశ్ అయ్య‌ర్ (32) బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో చెల‌రేగాడు. నాలుగు ఫోర్లు, 2 సిక్సర్ల‌తో జీటీని ముప్పు తిప్ప‌లు పెట్టాడు. మ‌రో ఎండ్ లో కోహ్లీ కూడా చెల‌రేగడంతో ఓవ‌ర్ కు ప‌ది ప‌రుగులకు పైగా ర‌న్ రేట్ తో స‌త్తా చాటింది. తొలి వికెట్ కు 62 ప‌రుగులు జోడించిన త‌ర్వాత వెంకటేశ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (1) విఫ‌ల‌మైనా, కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ (15) ధాటిగా ఆడ‌టంతో ప‌వ‌ర్ ప్లేలో 70 ప‌రుగులు సాధించింది. 

ర‌షీద్ డ‌బుల్ ట్ర‌బుల్..
సాఫీగా సాగుతున్న ఆర్సీబీ ఛేజింగ్ లో 9వ ఓవ‌ర్లో కుదుపు వ‌చ్చింది. ముందుగా ర‌షీద్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి, పాటిదార్ ఔట‌య్యాడు. ఇదే ఓవ‌ర్లో స్వీప్ షాట్ కు ప్ర‌య‌త్నించి, క్రునాల్ పాండ్యా (1) కావ‌డంతో జీటీ పున‌రాగ‌మ‌నం చేస్తోంద‌ని అంతా భావించారు. ఈ ద‌శ‌లో టిమ్ డేవిడ్ (24) తో క‌లిసి అద్భుత భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో 25 బంతుల్లోనే కోహ్లీ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మ‌ధ్య‌లో డేవిడ్ వెనుదిరిగినా, జితేశ్ శ‌ర్మ (11 నాటౌట్) తో క‌ల‌సి కోహ్లీ మ్యాచ్ ను ముగించాడు. దీంతో ఆర్సీబీని వ‌రుస‌గా రెండోసారి చాంపియ‌న్ గా నిల‌బెట్టాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tesla Hyderabad:హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
హైదరాబాద్‌లో టెస్లా! హైటెక్‌సిటీలో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ ప్రారంభం! 
AP Beach Shacks Policy 2026: ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
ఏపీలో గోవా కల్చర్ - వైజాగ్, సూర్యలంక బీచ్‌లలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు జీవో విడుదల - నిబంధనలు ఇవే!
T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై విజయంతో టాప్ ప్లేస్ కు.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి,
IND Win ODI Series VS AFg: సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
సిరీస్ టీమిండియాదే! గిల్ కెప్టెన్సీలో తొలి సిరీస్ వశం.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించిన శుభ‌మాన్, ఇషాన్.. స‌త్తాచాటిన బ్రార్, అర్ష‌దీప్
Kavya Sri Natraj: గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
గోరింటాకు సీరియల్ శ్రీవల్లి.. రిలేషన్‌షిప్, బ్రేకప్.. కావ్య శ్రీ రియల్ లైఫ్ విశేషాలు
Lionel Messi: లియోనెల్ మెస్సీని ఫుట్‌బాల్ దిగ్గజం అని ఎందుకు పిలుస్తారు? రాశిచక్రం, జన్మ సంఖ్యే కారణమా?
లియోనెల్ మెస్సీని ఫుట్‌బాల్ దిగ్గజం అని ఎందుకు పిలుస్తారు? రాశిచక్రం, జన్మ సంఖ్యే కారణమా?
TG 20 Tournament Controversy:విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
విజయ్‌ దేవరకొండ, వెంకటేష్‌కు లీగల్ నోటీసులు! టీజీ 20 టోర్నీ చుట్టూ ముదురుతున్న వివాదం!
Heart Health : రోజులో 2 నిమిషాల ఈ పని చేస్తే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
రోజులో 2 నిమిషాల ఈ పని చేస్తే గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Embed widget