అన్వేషించండి

Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

IPLను ఆవహించిన ఆకాశం.. విరాట్.. ! ఇన్ని సీజన్లలో... ఇంత ప్రామిసింగ్‌గా.. ఇంత అప్‌డేటేడ్‌గా.. ఇప్పటికీ ఉన్నాడంటే.. అది విరాట్‌ తత్వం.. అతని IPL కేరీర్ నుంచి మనం నేర్చుకోవలసిన 10 లైఫ్‌ లెస్సన్స్ ఇవే..!

Life Lessons From Virat Kohli's IPL Career: 19 సీజన్లు.. వందల మ్యాచ్‌లు.. వేల పరుగులు.. లక్షల ప్రేక్షకులు... వేల కోట్ల రూపాయలు అన్నింటిలోనూ కనిపించిన ఒకే ఒక్కడు.. The One And ONLY VIRAT KOHLI...

ఇండియన్ క్రికెట్ ముఖచిత్రాన్ని.. ఆ మాటకొస్తే వరల్డ్ క్రికెట్ రూపురేఖలనే మార్చిన లీగ్ IPL.. అలాంటి లీగ్‌లో మెరుపు బ్యాట్స్‌మెన్‌లు.. అదరగొట్టే బౌలర్లు.. మెరికల్లాంటి ఫీల్డర్లు.. ఇలా ఎందరో ఉన్నారు. పొట్టి క్రికెట్‌కు సోకులద్దినవాళ్లు.. స్టేడియంలను ఉర్రూతలూగించినవాళ్లు.. ఈ మధ్య వచ్చిన బుడతలు ఇలా ఎన్ని మెరుపులున్నా.. IPLను ఆవహించిన ఆకాశం.. విరాట్.. ఇన్ని సీజన్లలో... ఇంత ప్రామిసింగ్‌గా.. ఇంత అప్‌డేటేడ్‌గా..  ఇప్పటికీ ఉన్నాడంటే.. అది విరాట్‌ తత్వం.. మనందరం తెలుసుకోవలసిన సత్యం.. పాటించాల్సిన మార్గం..! విరాట్ IPL కెరీర్‌ నుంచి మనం నేర్చుకోవలసిన 10 లైఫ్‌ లెస్సన్స్ ఇవే..!

2008లో ఒక అన్‌క్యాప్డ్ యువకుడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి అడుగుపెట్టిన నాటి నుండి, నేడు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన లెజెండ్‌గా ఎదిగే వరకు కోహ్లీ సాగించిన ప్రయాణం అత్యద్భుతం.. అందులోని కీలక మలుపులు ఇవే

1.షార్ట్‌కట్‌లు ఉన్నా.. లాయల్టీనే మిన్న!

నేటి ఐపీఎల్ యుగంలో భారీ వేలం పాటలు, కోట్ల ఆఫర్ల కోసం ఆటగాళ్లు జట్లు మారుతుంటారు. కానీ, కోహ్లీ మాత్రం మొదటి నుండి ఒకే ఒక ఫ్రాంచైజీ RCBకి అంకితమయ్యాడు. ఇండియన్ క్రికెట్‌లో స్టార్ స్టేటస్ ఉన్న ఆ ఆటగాడు.. ఒక్క IPL ట్రోఫీ కోసం 18ఏళ్లు ఎదురుచూశాడు. అంతకాలం ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ను భరించాడు. ఫ్రాంచైజీ నుంచి కోహ్లీకి బాగానే వస్తుందనుకోవచ్చు. ఆ మాత్రం తాను ఎక్కడికి వెళ్లినా వస్తుంది. 19 ఏళ్లపాటు ఒక ఫ్రాంచైజీని అంటిపెట్టుకుని ఉండటం బహుశా ఏ క్రీడలోనూ లేదనుకుంటా.. 

జీవిత పాఠం: తక్షణ లాభాల కోసం దారులు వెతకడం కంటే, నమ్మిన సిద్ధాంతానికి, మనుషులకు కట్టుబడి ఉండటం వల్ల వచ్చే గౌరవం, కీర్తి వెలకట్టలేనివి.

2. ఫామ్ టెంపరరీ.. శ్రమే శాశ్వతం!

2022 సీజన్ గుర్తుందా? కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత ఘోరమైన ఫామ్‌ను ఎదుర్కొన్నాడు. వరుసగా గోల్డెన్ డకౌట్లు అవుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తన కెరీర్‌లో 9 సార్లు 500 పరుగులు దాటిన కోహ్లీ .. ఆ సీజన్‌లో 300 చేయడానికి ఇబ్బందులు పడ్డాడు.  కానీ అతను తన శ్రమను నమ్ముకున్నాడు. నెట్స్‌లో మరింత కష్టపడ్డాడు. ఫలితంగానే 2024లో అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

జీవిత పాఠం: జీవితంలో ఎదురుదెబ్బలు సహజం.మీ కఠోర శ్రమ మాత్రమే మిమ్మల్ని మళ్లీ విజయ తీరాలకు చేరుస్తుంది.

3. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం 

2016 ఐపీఎల్ సీజన్.. క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం. ఒక క్యాలెండర్ ఇయర్‌లో క్రికెటర్లు చేసే పరుగులను కోహ్లీ.. ఓ క్యాలెండర్ మంత్‌లో చేసేశాడు. ఆ సీజన్‌లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేసి, 4 సెంచరీలు బాదాడు. అదీ కూడా చేతి వేళ్లకు తీవ్రమైన గాయమై, కుట్లు పడినా లెక్కచేయకుండా ఆడాడు.

జీవిత పాఠం: మన పరిమితులను మనమే నిర్ణయించుకోకూడదు. సంకల్ప బలం ఉంటే అడ్డంకులు ఆపలేవు.

4. పదవంటే పొజిషన్ కాదు.. రెస్పాన్సిబిలిటీ 

2021 సీజన్ తర్వాత కోహ్లీ ఆర్‌సీబీ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు. కానీ జట్టులో అతని దూకుడు, జూనియర్ ఆటగాళ్లకు అతను ఇచ్చే సలహాలు, మైదానంలో అతని వ్యూహాలు ఎక్కడా తగ్గలేదు.

జీవిత పాఠం: ఇతరులను నడిపించడానికి నీకు హోదా, పదవి లాంటివి అక్కర్లేదు. నిజమైన నాయకుడు ఎప్పుడూ తన ప్రవర్తనతోనే గైడ్ చేస్తాడు.

5. పరిస్థితులకు తగ్గట్లు మారడం  Adoptability:

ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ వచ్చి, జట్లు 250+ పరుగులంటే లెక్కే లేనట్లుగా చేసేస్తున్నారు. పిల్ల ప్లేయర్లంతా ఇష్టమొచ్చినట్లు ఆడేస్తుండటంతో కోహ్లీ క్లాస్‌ గేమ్.. అవుట్‌ ఆఫ్‌ ద గేమ్ అయిపోయింది. తన స్ట్రైక్‌ రేట్ చాలా తక్కువ అంటూ విమర్శలు వచ్చాయి. 2022 తర్వాత అది బాగా ఎక్కువైంది. ఇక కోహ్లీ పని అయిపోయిందన్నారు. అప్పుడు తనలోని అసలైన ప్లేయర్‌ను నిద్రలేపాడు. వయసు పెరుగుతున్న కొద్దీ Shine అయ్యాడు. చివరి నాలుగు సీజన్లలో కోహ్లీ 600 పరుగులు దాటాడు. ఈ ఏడాది తన కెరీర్‌లోని హయ్యస్ట్‌ స్ట్రైక్‌రేట్ ఇచ్చాడు. ఇంకో విషయం తెలుసా.. కోహ్లీ ఎక్కడా తన స్టైల్‌ మార్చుకోలేదు. వేగాన్ని మాత్రమే మార్చాడు. ట్రెడిషనల్‌ క్రికెటింగ్ షాట్లతో ఆ రేంజ్ చూపించడం వేరేవాళ్లకి సాధ్యం కాదు. విరాట్ కోహ్లీకి మాత్రమే 

జీవిత పాఠం: ప్రపంచం వేగంగా మారుతోంది. కాలంతో పాటు మన నైపుణ్యాలను (Skills) అప్‌డేట్ చేసుకోకపోతే వెనకబడిపోతాం.

6. ఆవేశాన్ని ఆయుధంగా మలుచుకో..

కోహ్లీ మైదానంలో చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. వికెట్ పడితే తీవ్రంగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇవన్నీ మనం చూశాం. కానీ ఎప్పుడైనా తన బిహేవియర్‌తో కోహ్లీకి ఫైన్ పడినట్లు చూశారా.. ? లేదు. ఎందుకంటే ఆ బౌండరీ ఏంటో తనకు క్లియర్‌గా తెలుసు. కోహ్లీ ఆ ఆవేశాన్ని తన ఆటను మెరుగుపరుచుకోవడానికే వాడాడు తప్ప, ఎక్కడా లైన్ దాటలేదు.

జీవిత పాఠం: మీలోని ఎమోషన్స్ లేదా కోపాన్ని  మీ లక్ష్య సాధన కోసం ఇంధనంగా (Fuel) మార్చుకోండి.

 7. చేసే పనిలో... ఆనందాన్ని వెతుక్కో

RCB వికెట్ తీసినప్పుడు.. ఎప్పుడైనా చూశారా.. జట్టులో జూనియర్ ప్లేయర్ల కంటే ఎక్కువ కేరింతలు కొట్టేది కోహ్లీ. చాలా బలంగా సెలబ్రేట్ చేస్తాడు. తీవ్రంగా రియాక్టవుతాడు. చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అది అనుకుంటే రావు. అది అతని నైజం. ఆటపట్ల అమితమైన ప్రేమ ఉన్న వాళ్లే అలా చేయగలరు. ఆటను కోహ్లీ అంతగా ఆస్వాదిస్తాడు కాబట్టే ఆటలో అంతగా అంతగా రాణిస్తాడు. 
                                                                                                                                                                                                                                                                                                                            జీవిత పాఠం: చేసే పనిని ఆస్వాదించు... ఫలితం అదే వస్తుంది. 

8. ఫిట్‌నెస్- నో కాంప్రమైజ్ బ్రో.. 

IPL అంటే ప్రతి బాల్‌ను బౌండరీ బయటకు కొట్టడమే అనుకునే నేరేషన్‌ లో కూడా Wagon Wheel లో బౌండరీ లోపల గీతలను ఎక్కువుగా గీయగల నేర్పరి కోహ్లీ. ౩7 ఏళ్ల వయసులో వికెట్ల మధ్య అతని వేగం.. చిరుతపులిలా చేసే డైవింగ్‌లు చూస్తే అర్థమవుతుంది.. అతని ఫిట్‌నెస్‌ కేవలం ఆటకోసమే కాదు అది అతని జీవన గమనంలో ఓ భాగం. 

జీవిత పాఠం: మానసిక బలానికి శారీరక దృఢత్వమే పునాది. నువ్వు ఏ గేమ్‌లో ఉండాలన్నా.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.  

9. విమర్శలను స్వీకరించు..

కెప్టెన్సీ లోపాలు, ట్రోఫీ గెలవకపోవడం, స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం.. ఇలా కోహ్లీపై నిత్యం ఎక్కడో ఒకచోట విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ అతను ఎప్పుడూ ప్రెస్ మీట్లలో గొడవపడలేదు, కేవలం తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.

జీవిత పాఠం: మనం ఎదిగే కొద్దీ విమర్శలు రావడం సహజం. వాటన్నిటికీ మాటలతో సమాధానం చెప్పనక్కర్లేదు, మన విజయాలే మాట్లాడాలి.

10. గ్రేట్ కమ్‌బ్యాక్ ( అద్భుత పునరాగమనం)- నిన్ను నువ్వు నమ్ము

కమ్‌బ్యాక్‌ను ప్రతి ఒక్కరూ నమ్మాలి... 2024 సీజన్ ఫస్ట్ హాఫ్‌లో  ఆర్‌సీబీ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కేవలం 1% మాత్రమే ఉంది. కానీ కోహ్లీ జట్టులో నమ్మకాన్ని నింపాడు. వరుసగా 6 మ్యాచ్‌లు గెలిపించి అద్భుతం చేశాడు. టీమ్ ప్లేఆఫ్‌కు వెళ్లింది. 

జీవిత పాఠం: మన టైమ్‌ మారుతుందని నమ్మకం కలిగి ఉండాలి.  నమ్మకం ఒక్కటే కాదు.. మన పోరాటంతో అంతా మార్చేయొచ్చు.ఆటైనా, జీవితమైనా ఆఖరి బాల్‌ వరకూ పోరాడాల్సిందే. 


IPLలో ఎంతమంది స్టార్లు లేరు..?కోహ్లీ గురించే ఎందుకు చెప్పాలి అంటారా..?  .  9వేల పరుగులు..  9 సెంచరీలు...  48 హాఫ్ సెంచరీలు చేసిన మరో ఆటగాడిని చూపించండి.  డౌట్ ఉన్న వాళ్లు ఒక్కసారి ఈ ఫోటో చూడండి.


Virat Kohli IPL Career: ఇది విరాట్ తత్వం.. నిన్ను నువ్వు తెలుసుకునే సత్యం.. విరాట్ IPL కెరీర్‌ నుంచి నేర్చుకోదగ్గ జీవిత పాఠాలు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
AFG vs IND T20 Series: ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
ఇండియాలో ఆఫ్ఘనిస్తాన్ హోస్ట్ చేసే టి20 సిరీస్.. ఢిల్లీ వేదికగా పోరు!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget