అన్వేషించండి
Advertisement
India vs South Africa: తొలి మ్యాచ్ వర్షార్పణం , ఒక్క బంతి పడకుండానే రద్దు
India vs South Africa 1st T20I : భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అసలు టాస్ కూడా వేయలేదు.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అసలు టాస్ కూడా వేయలేదు. ఆదివారం రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా.. అంతకంటే ముందు నుంచే భారీ వర్షం ఆరంభమైంది. దీంతో కనీసం టాస్ వేయడానికి కూడా వాతావరణం సహకరించలేదు. వర్షం తగ్గితే ఓవర్లు కుదించైనా ఆటను నిర్వహించాలని అధికారులు భావించినా.. వరుణుడు ఏమాత్రం కరుణించలేదు. ఏకధాటిగా కురిసిన వర్షంతో మైదానం పూర్తి చిత్తడిగా మారింది. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికాకు కూడా మెగా టోర్నీకి ముందు ఉన్న ఆరు మ్యాచ్‌ల్లో ఇదొకటి. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.25కి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మంగళవారం రెండో మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. చివరి మ్యాచ్ గురువారం జరగనుంది. దక్షిణాసియా జనాభా అధికంగా ఉండే డర్బన్‌లో ఈ మ్యాచ్ కోసం నెల ముందుగానే టిక్కెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. అయినా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
టీ20 ప్రపంచకప్ కన్నా ముందు మాకు చాలా తక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయని తమకు తెలుసని... అయితే ఐపీఎల్‌లో మేం 14 మ్యాచ్‌లు ఆడొచ్చని మ్యాచ్ రద్దయిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. డర్బన్‌లో ఆట జరగకపోవడం రెండు జట్లతో పాటు అభిమానులకూ తీవ్ర అసంతృప్తి కలిగించింది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ రద్దు కావడంతో డిసెంబర్ 12న రెండో మ్యాచ్ గ్కెబెర్హాలో జరుగుతుంది. డిసెంబర్ 14న జోహన్నెస్ బర్గ్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. టీ20 సిరీస్ తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్.
టీమిండియా టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
టీమిండియా వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement