By: ABP Desam | Updated at : 09 Jun 2023 11:34 AM (IST)
శుభ్‌మన్ గిల్ ( Image Source : ICC Twitter )
WTC Final 2023:
ఓవల్ టెస్టులో ఇబ్బంది పడుతున్న టీమ్‌ఇండియాకు సునిల్ గావస్కర్ అండగా నిలిచాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో గెలిచేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పాడు. మొదట ఫాల్ ఆన్ స్కోరు దాటేసేలా టార్గెట్ పెట్టుకోవాలని సూచించాడు. ఆఖరి రోజు రవీంద్ర జడేజా తన ప్రతాపం చూపిస్తాడని వెల్లడించాడు.
ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే (29 బ్యాటింగ్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. కనీసం ఫాలో అప్ తప్పించుకోవాలన్నా 119 పరుగులు చేయాలి.
'టీమ్‌ఇండియాకు ఇప్పుడు భారీ భాగస్వామ్యం అవసరం. 2001లో రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఏం చేశారో ఆస్ట్రేలియాకు తెలుసు. జస్టిన్ లాంగర్‌కు దాన్ని గుర్తు చేస్తున్నందుకు సారీ! వాళ్లరూ రెండు రోజులు బ్యాటింగ్ చేశారు. ఆపై ఆసీస్‌ను బ్యాటింగుకు దించి ఆఖరి రోజు ఆలౌట్ చేశారు. ఆ తర్వాత సిరీసులో ఆఖరి టెస్టు గెలిచారు. అందుకే టీమ్‌ఇండియాతో ఆసీస్ ఫాలో ఆన్ ఆడిస్తుందని అనుకోను. ఎందుకంటే వారలా చేస్తే భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంది. వాళ్లకు ఆ సామర్థ్యం ఉంది. హిట్‌మ్యాన్ కొన్ని పొరపాట్లు చేసిందంతే' అని సునిల్ గావస్కర్ అన్నాడు.
'కొన్ని డెలివరీలను ఆడే క్రమంలో టీమ్‌ఇండియా బ్యాటర్లు బౌల్డ్ అయ్యారు. ఈడెన్ గార్డెన్‌లో మాదిరిగా వారు పరుగులు చేయగలరు. ఇక ఆఖరి రోజు బంతి తిరిగడం మొదలు పెడితే రవీంద్ర జడేజా మ్యాజిక్ చేస్తాడు. అందుకే భారత్ మొదటి లక్ష్యం 269 పరుగుల మైలురాయిని దాటేయడం. అలాగే సాధ్యమైనంతగా ఆధిక్యాన్ని తగ్గించాలి' అని సన్నీ మీడియాకు చెప్పాడు.
ఆసీస్ తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ట్రావిస్ హెడ్ 174 బంతుల్లోనే 25 బౌండరీలు ఒక సిక్సర్ సాయంతో 163 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 268 బంతులు ఆడి 19 బౌండరీలు కొట్టి 121 పరుగులు చేశాడు. వీరికి తోడుగా అలెక్స్ కేరీ 69 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. కానీ టీమ్‌ఇండియాలో రోహిత్ శర్మ (15), శుభ్‌మన్ గిల్ (13), చెతేశ్వర్ పుజారా (14), విరాట్ కోహ్లీ (14) వెంటవెంటనే ఔటయ్యారు.
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేశ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్
స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్, ముకేశ్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టాయినిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నేథన్ లైయన్, టాడ్ మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్షా
A match-winner with the ball, bat and in the field 🏏
— ICC (@ICC) June 9, 2023
The No.1 Test all-rounder does not take his opportunities for granted, especially at a #WTC23 Final 👊https://t.co/hJJMzzwLjB
ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్
ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు
ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!
Asian Games 2023: ఆరాధ్య దేవతను చూడటానికి 1200 కిలోమీటర్ల ప్రయాణం - స్మృతి మంధానకు చైనాలో ఫాలోయింగ్
భారత్, ఆస్ట్రేలియా మూడో మ్యాచ్ పరిస్థితి ఏంటి? - వర్షం ఆటంకం కలిగిస్తుందా?
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
/body>