By: ABP Desam | Updated at : 02 Mar 2023 02:42 PM (IST)
Edited By: Ramakrishna Paladi
చెతేశ్వర్ పుజారా ( Image Source : BCCI )
IND vs AUS 3rd Test:
ఇండోర్ టెస్టుపై టీమ్‌ఇండియా పట్టు జారుతోంది! ఆసీస్‌పై పై చేయి సాధించే అవకాశాలు కనిపించడం లేదు. రెండో రోజు తేనీటి విరామానికి రెండో ఇన్నింగ్సులో ఆతిథ్య జట్టు 4 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. ఇంకా 9 పరుగుల లోటుతో ఉంది. చెతేశ్వర్ పుజారా (36; 76 బంతుల్లో 4x4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ (0) క్రీజులో ఉన్నాడు. నేథన్ లైయన్ (3/27) తన స్పిన్‌తో మాయ చేస్తున్నాడు. ఈ మ్యాచులో గెలవాలంటే హిట్‌మ్యాన్ సేన అద్భుతమే చేయాలి!
గర్జిస్తున్న లైయన్
ఆసీస్ ఆలౌటైయ్యాక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 వద్దే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (5; 15 బంతుల్లో) ఔటయ్యాడు. 4.6వ బంతికి నేథన్ లైయన్ అతడిని క్లీన్‌బౌల్డ్ చేశాడు. సాలిడ్‌గా కనిపించిన రోహిత్ శర్మ (12; 33 బంతుల్లో)నూ అతడే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (13; 26 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. కాగా జట్టు స్కోరు 54 వద్ద కింగ్‌ను కునెమన్ ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. చాలాసేపు డిఫెన్స్ ఆడిన రవీంద్ర జడేజా (7; 36 బంతుల్లో)ను లైయన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.
An absorbing first session on Day 2 of the 3rd Test.
— BCCI (@BCCI) March 2, 2023
India 13/0 & 109, trail Australia (197) by 75 runs at Lunch.
Scorecard - https://t.co/t0IGbs2qyj #INDvAUS @mastercardindia pic.twitter.com/aRxFsrvMcc
పొద్దున యాష్, ఉమేశ్ పోరాటం
రెండో రోజు, గురువారం ఉదయం తొలిసెషన్లో టీమ్‌ఇండియా బౌలర్లు దుమ్మురేపారు. స్పిన్‌తో రవిచంద్రన్ అశ్విన్, రివర్స్ స్వింగ్‌తో ఉమేశ్ యాదవ్ కేవలం అరగంటలో 6 వికెట్లు పడగొట్టారు. 186/4తో గురువారం ఆట ఆరంభించిన ఆసీస్‌ను 76.3 ఓవర్లకు 197 స్కోరుకు ఆలౌట్ చేశారు. 88 పరుగుల ఆధిక్యానికి పరిమితం చేశారు. 19 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట మొదలు పెట్టిన పీటర్ హ్యాండ్స్ కాంబ్ (19), కామెరాన్ గ్రీన్ (21) ఎక్కువ బంతులే ఆడినా స్కోర్ చేయలేకపోయారు. జట్టు స్కోరు 186 వద్ద హాండ్స్‌కాంబ్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. టాసప్ అయిన బంతిని కాంబ్ ముందుకొచ్చి ఆడాడు. బ్యాటుకు తగిలిన బంతిని షార్ట్‌లెగ్‌లోని శ్రేయస్ అయ్యర్ చక్కగా ఒడిసిపట్టాడు. కీలక ఆటగాడు ఔటవ్వడంతో వికెట్ల పతనం మొదలైంది. మరో రెండు పరుగులకే కామెరాన్ గ్రీన్‌ను ఉమేశ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత అలెక్స్ కేరీ (3), మిచెల్ స్టార్క్ (1), నేథన్ లైయన్ (4), టార్ మర్ఫీ (0) ఔటయ్యేందుకు ఎంతో సమయం పట్టలేదు.
Tea on Day 2 of the 3rd Test#TeamIndia 79/4, trail Australia by 9 runs. @cheteshwar1 going strong on 36*.
— BCCI (@BCCI) March 2, 2023
Scorecard - https://t.co/t0IGbs2qyj #INDvAUS @mastercardindia pic.twitter.com/1ULkKWid5F
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్ 'కెర్' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్ టాపర్!
RCB-W vs MI-W, 1 Innings Highlight: ముంబయి టార్గెట్ జస్ట్ 126 - ఆఖరి మ్యాచులో ఆర్‌సీబీ గెలుస్తుందా?
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి