Asia Cup Final: ఆసియా కప్ ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ మంత్రి- వైవిధ్యంగా సంబరాలు చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు
పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ఆసియా కప్ ట్రోఫీని స్వీకరించడానికి టీమిండియా నిరాకరించింది. దీంతో ట్రోఫీతో మంత్రి పారిపోయాడు. కప్ భారత్‌కు ఇవ్వకపోయినా ప్రత్యేకమైన వేడుక చేసుకున్నారు ఆటగాళ్లు.

Asia Cup Final: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఆసియా కప్ ఆడిన భారతదేశం, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్తాన్ అంతర్గత మంత్రి కూడా అయిన మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించింది. భారత వైమానిక జెట్లను కాల్చివేసినట్లు తన దేశం చేసిన వాదనను ప్రస్తావిస్తూ, ఇటీవల ఆయన రెచ్చగొట్టే ట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా ఉగ్రవాద భావజాలంతో భారతీయ పౌరులను పొట్టన పెట్టుకున్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి వారితో కరచాలనం, ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించింది. ఏ ఇతర అధికారి నుంచైనా ట్రోఫీని స్వీకరించడానికి మెన్ ఇన్ బ్లూ సిద్ధంగా ఉందని స్పష్టంగా చెప్పింది. కానీ నఖ్వీ మాత్రం స్పందించలేదు. దీని ఫలితంగా విజేత జట్టుకు కప్ ఇవ్వలేదు.
పాకిస్తాన్ తన కపట బుద్ధి చూపించుకున్నా సరే భారత జట్టు వేడుకలకు వెనుకాడలేదు. 'ఊహాత్మక ట్రోఫీ'తో సెలబ్రేషన్స్ చేసుకుంది. ఆన్‌లైన్ ఎమోజీలను వాడుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది.

రోహిత్ శర్మ ఐకానిక్ ట్రోఫీ వాక్‌ను అనుకరించిన సూర్యకుమార్ యాదవ్
2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ విజయాన్ని రోహిత్ శర్మ ఆసక్తికరంగా జరుపుకున్నాడు, 2022లో ఫిఫా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సీ ట్రోఫీ వాక్‌ను గుర్తుకు తెచ్చింది.
ఆసియా కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఆ సెలబ్రేషన్ శైలిని అనుకరించాడు. పాకిస్తాన్ మంత్రి కప్ ఇవ్వకుండా వెళ్లిపోయినా ఊహాత్మక కప్‌తో ఆ వాక్‌ను గుర్తు చేశాడు.
Suryakumar Yadav recreates Rohit Sharma’s iconic 2024 T20 World Cup celebration after Asia Cup win.🇮🇳🔥 #INDvPAK pic.twitter.com/Y8rJzgNvEX
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 28, 2025
చేతిలో ట్రోఫీ లేకపోవడం విజేత జట్టు మానసిక స్థితిని దెబ్బతీసినట్లు కనిపించడం లేదు. అన్నింటికంటే, ఒక ప్రధాన పోటీ ఫైనల్‌లో ఒకరి ప్రధాన ప్రత్యర్థిపై ఉత్కంఠభరితమైన విజయం తర్వాత ఇలాంటిది చాలా చిన్నది అయిపోతుందని. అదే టీమిండియా ఆటగాళ్లలో కూడా కనిపించాం. చిరకాల ప్రత్యర్థినిపై ఉత్కంట పోరులో గెలిచిన ఆత్మవిశ్వాసం, ఆనందం వారిలో కనిపించింది. కప్ చేతులో లేదనే భావన ఏ మాత్రం లేదు.
ప్రజెంటేషన్ వేదికపై ఇలా చేసిన టీమిండియా ఆటగాళ్లు తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎమోజీలతో సెలబ్రేషన్స్‌చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా తన టీ20 వరల్డ్‌కప్‌లో ఇచ్చిన స్టిల్‌ను మరోసారి ఇచ్చి దాని పక్కనే కప్ ఎమోజీ పోస్టు చేశాడు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.

మిత్రులు అభిషేశర్మ, శుభ్‌మన్ గిల్ కూడా ఎమోజీ కప్‌తో సెలబ్రేషన్స్‌చేసుకున్నారు. ఫొటోను ఇన్‌స్టాలో పోస్టు చేశారు. దానికి విన్నర్ అని క్యాప్షన్ పెట్టారు.

ఆసియా కప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగి ఇండియాకు విజయాన్నే కాదు ట్రోఫీని అందించిన తిలక్ వర్మ కూడా సూర్యకుమార్‌తో కలిసి ఎమోజీకప్‌తో ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

2025 ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై భారతదేశం వరుసగా మూడవ విజయం సాధించింది. ఒకటి ఫైనల్‌లో అయింతే రెండు టోర్నమెంట్ గ్రూప్, మరొకటి సూపర్ 4 దశల్లో వచ్చాయి. మెన్ ఇన్ బ్లూ మూడు మ్యాచ్‌లను ఛేజింగ్‌లో గెలిచింది.




















