అన్వేషించండి
Advertisement
IND vs SA : కొత్త చరిత్ర సృష్టించిన రాహుల్, 14 ఏళ్ల ధోనీ రికార్డు బద్దలు
KL Rahul : టీమిండియా కెప్టెన్ కె.ఎల్. రాహుల్, ధోని రికార్డును బద్దలు కొట్టాడు. 14 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.
సఫారీ గడ్డపై టీమిండియా(Team India) చరిత్ర సృష్టించింది. 2018 తర్వాత దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై వన్డే సిరీస్ గెలిచి రికార్డు సృష్టించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో ఘన విజయంతో భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్... సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ వర్మ కూడా అర్ధ శతకంతో సత్తా చాటడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన రాహుల్
అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 78 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించి... వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ కె.ఎల్. రాహుల్... మాజీ కెప్టెన్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.
వెయ్యి పరుగులు కొట్టిన భారత్ వికెట్ కీపర్
మూడో వన్డే మ్యాచ్‌లో 21 పరుగులు చేసి ఔట్ అయిన రాహుల్... ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ 2023లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో దాదాపు 14 ఏళ్ల తర్వాత వన్డే ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. అంతకుముందు ధోనీ పేరిట ఈ రికార్డు ఉంది. వన్డేల్లో ఒక ఏడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి ఇండియన్ వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు సృష్టించాడు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఫీట్ సాధించిన వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.
ఆదిలో తడబాటు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. సాయి సుదర్శన్-రజత్ పాటిదార్ ఓపెనర్లుగా బరిలోకి దిగి టీమిండియాకు పర్వాలేదనిపించే ఆరంభం ఇచ్చారు. ఉన్నంతవరకూ రజత్ ధాటిగా బ్యాటింగ్ చేసిన రజత్ పాటిదార్ 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. తొలి రెండు వన్డేల్లో అర్ధ శతకాలతో చెలరేగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 10 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో 49 పరుగుల వద్ద టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ కె.ఎల్. రాహుల్‌తో కలిసి సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కె.ఎల్. రాహుల్ 35 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
గేర్ మార్చిన సంజూ, తిలక్
రాహుల్ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌వర్మతో కలిసి సంజు శాంసన్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. తొలి రెండు మ్యాచుల్లో నిరాశ పరిచిన సంజు శాంసన్ కీలకమైన ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. సంజు శాంసన్.. సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. నాలుగో వికెట్‌కు శాంసన్-తిలక్ వర్మ ఇద్దరూ 116 పరుగులు జోడించారు. ఆ తర్వాత 77 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. తిలక్ వర్మను మహరాజ్ అవుట్ చేశాడు. తిలక్ వర్మ అవుటైనా సంజు శాంసన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 110 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సులతో సెంచరీ సాధించాడు. అనంతరం 114 బంతుల్లో 108 పరుగులు చేసి సంజు శాంసన్ అవుటయ్యాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రింక్స్ మూడు, బర్గర్ 2, విలియమ్స్ ఒక వికెట్ తీశారు. అనంతరం 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion