అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

SA vs IND: తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న ప్రొటీస్‌, డీన్‌ ఎల్గర్‌ అద్భుత శతకం

India vs South Africa: సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్‌ ఎల్గర్‌ అద్భుత పోరాటంతో ప్రొటీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

సెంచూరియన్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. డీన్‌ ఎల్గర్‌ అద్భుత పోరాటంతో ప్రొటీస్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన డీన్‌ ఎల్గర్‌ భారీ శతకం సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో  రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

అంతుకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 37 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ అద్భుత శతకం చేసి భారత్ కు గౌరవమైన స్కోర్ అందించాడు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ ఒక్కో పరుగూ జోడిస్తూ.. టీమిండియాకు మంచి స్కోరు అందించాడు. 164 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయిన తర్వాత బుమ్రా, సిరాజ్ లతో కలిసి రాహుల్ స్కోరును 245 పరుగుల వరకూ తీసుకెళ్ళాడు. కోహ్లి 38, శ్రేయస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు.
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన రాహుల్..

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ చేశాడు. ఈ దెబ్బకి బుధవారం సెంచూరియన్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. రెండో రోజు ఉదయం 70 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగించిన రాహుల్..  137 బంతుల్లో 101 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. తన 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేఎల్ 66వ ఓవర్‌లో గెరాల్డ్ కుట్జీపై మిడ్-వికెట్ వైపు సిక్సర్ కొట్టాడు. రాహుల్ కేవలం 80 బంతుల్లో సిక్సర్ కొట్టి యాభైని పూర్తి చేశాడు. తొలి రోజు 70 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్.. రెండో రోజు 101 పరుగులు పూర్తి చేసిన చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ 245 పరుగుల వద్ద ఆగిపోయింది. సెంచూరియన్‌లో రాహుల్‌కి ఇది వరుసగా రెండో సెంచరీ. భారత్ గత చివరి సిరీస్‌లో మూడంకెల మార్కును చేరుకున్నాడు. దీంతో ఒకే వేదికలో అధిక సెంచరీలు చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆదిలోనే షాక్‌ తగిలింది. 5 పరుగులు చేసిన మార్‌క్రమ్‌ను సిరాజ్‌ అవుట్‌ చేసి ప్రొటీస్‌ను దెబ్బతీశాడు. దీంతో 11 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత జోర్జీ... డీన్‌ ఎల్గర్‌ ప్రొటీస్‌  స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 90కిపైగా పరుగులు జోడించారు. 28 పరుగులు చేసిన జోర్జీని బుమ్రా అవుట్‌ చేశాడు. అనంతరం కాసేపటికే పీటర్సన్‌ను కూడా బుమ్రా అవుట్‌ చేశాడు. దీంతో 113 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. కానీ బెండిగామ్‌తో జతకలిసిన డీన్‌ ఎల్గర్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

బెండిగామ్‌- డీన్‌ ఎల్గర్‌ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 56 పరుగులు చేసిన బెండిగామ్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో 244 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా.... పటిష్టస్థితిలో కనిపించింది. కానీ తర్వాత అయిదు పరుగులకే బుమ్రా మరో వికెట్‌ తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా డీన్‌ ఎల్గర్‌ మాత్రం సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. 23 ఫోర్లతో 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ప్రొటీస్‌ 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. సఫారీ జట్టు ఇప్పటికే 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజూ భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాటర్లను ఎంత త్వరగా అవుట్‌ చేస్తారన్న దానిపైనే భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Maharashtra Exit Poll 2024: మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
మహారాష్ట్రలో అధికారం వారిదే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆ కూటమిదే హవా, ఎవరికి ఎన్ని సీట్లు రానున్నాయి!
AAA Rangoli Contest: ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
ముగ్గేయండి.. పాతిక లక్షలు పట్టేయండి. ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ బంపర్ ఆఫర్
Kurnool News: కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
కర్నూలులో హృదయ విదారక ఘటన - బాలునికి రంగు పూసి ఎండలో భిక్షాటన చేయించారు, నెటిజన్ ట్వీట్‌కు స్పందించిన మంత్రి లోకేశ్
Jharkhand Exit Poll 2024: జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపెవరిది? ఎన్డీయేకు కాంగ్రెస్ కూటమి షాకిస్తుందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Jagan On Balakrishna: షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారు - జగన్ సంచలన ఆరోపణలు
Embed widget