అన్వేషించండి
Advertisement
Weather Today: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు- 23 బంగాళాఖాతంలో అల్పపీడనం
Lates Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో వాతావరణంతో చాలా మార్పులు జరుగుతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
Andhra Pradesh And Telangana Weather Todays: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఇన్నాళ్లు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డ జనం ఇప్పుడు చలికి వణికిపోతున్నారు. తెలంగాణలో చలి తీవ్ర మరింత ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఉదయాన్నే పొగమంచు ఇబ్బంది పెడుతోంది. వాహనాలు నడిపేవాళ్లు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు
తెలంగాణలో వాతావరణం (Telangana Weather)
తెలంగాణలో వాతావరణం వారం రోజుల పాటు డ్రైగానే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్నప్పటికీ తెలంగాణకు ఎలాంటి వర్ష సూచనలు లేవని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పడిపోతని చెబుతున్నారు. ఈ విషయంలో పిల్లలు, వృద్ధులు, గుండెజబ్బులు ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
వివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 | ఆదిలాబాద్ | 29.8 | 12.7 | 80 |
2 | భద్రాచలం | 31 | 19 | 91 |
3 | హకీంపేట | 28.7 | 15 | 57 |
4 |
దుండిగల్
|
29.9 | 14.4 | 64 |
5 |
హన్మకొండ
|
30.0 | 15.5 | 89 |
6 |
హైదరాబాద్
|
30.2 | 15.8 | 63 |
7 |
ఖమ్మం
|
32.5 | 21.0 | 81 |
8 |
మహబూబ్‌నగర్
|
30.4 | 18.9 | 67 |
9 |
మెదక్
|
31 | 12. | 72 |
10 |
నల్గొండ
|
31 | 20 | 79 |
11 |
నిజామాబాద్
|
32 | 15 | 79 |
12 |
రామగుండం
|
29.8 | 15.9 | 91 |
13 |
పటాన్‌చెరు
|
29.2 | 12.4 | 95 |
14 |
రాజేంద్రనగర్
|
30 | 13.5 | 81 |
15 |
హయత్‌నగర్
|
29.6 | 15.6 | 90 |
తెలంగాణ వ్యాప్తంగా ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోబోతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమ్రం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ణఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదు కావచ్చని తెలిపారు. అందుకే ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వెల్లడించారు. మిగతా జిల్లాలను గ్రీన్ అలర్ట్‌లో ఉంచారు.
హైదరాబాద్‌లో వాతావరణం (Hyderabad Weather)
హైదరాబాద్‌లో వాతావరణం కూల్‌గా ఉంటుందని అధికారులు చెప్పారు. ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం వేళల్లో పొగమంచు ఉంటుందని వివరించారు. గరిష్ట ఉష్ణోగ్రత 29డిగ్రీలుగా నమోదు అయితే... కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదు అవుతుందన్నారు. ఉపరితల గాలులు తూర్పు లేదా ఈశాన్య దిశలో గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీలుగా నమోదు అయింది.
ఆంధ్రప్రదేశ‌్‌లో వాతావరణం (Andhra Pradesh Weather)
దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలు మీదుగా నవంబర్ 21న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళా ఖాతం మీదుగా పయనిస్తోంది. ఇది బలపడి నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
అల్పపీడనంగా మారిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. తర్వాత రెండు రోజులకు మరింత బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో జరుగుతున్న మార్పులు కారణంగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో తేలికపాటివర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత- 32 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత-21 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 |
కళింగపట్నం
|
29.7 | 17 | 73 |
2 |
విశాఖపట్నం
|
31.4 | 21.8 | 61 |
3 |
తుని
|
32.6 | 20 | 67 |
4 |
కాకినాడ
|
30.7 | 22 | 74 |
5 |
నర్సాపురం
|
31.2 | 19.8 | 65 |
6 |
మచిలీపట్నం
|
32.6 | 21.7 | 80 |
7 |
నందిగామ
|
31 | 17.4 | 80 |
8 |
గన్నవరం
|
30.4 | 21.2 | 65 |
9 |
అమరావతి
|
31.2 | 20.4 | 74 |
10 |
జంగమేశ్వరపురం
|
31 | 21.5 | 86 |
11 |
బాపట్ల
|
30.8 | 21.2 | 90 |
12 |
ఒంగోలు
|
30.7 | 22 | 79 |
13 |
కావలి
|
30.2 | 24.1 | 85 |
14 |
నెల్లూరు
|
30.9 | 24.4 | 85 |
15 |
నంద్యాల
|
32 | 20.4 | 86 |
16 |
కర్నూలు
|
32 | 20.4 | 84 |
17 |
కడప
|
30.8 | 21.8 | 88 |
18 |
అనంతపురం
|
30.8 | 20.6 | 87 |
19 |
ఆరోగ్యవరం
|
27.5 | 20 | 91 |
20 |
తిరుపతి
|
30.9 | 23.3 | 85 |
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యోదయం - 6.14 గంటలకు
ఆంధ్రప్రదేశ్‌లో సూర్యాస్తమయం- 17.33 గంటలకు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రోదయం -21.56 గంటలకు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రాస్తమయం- 10.33 గంటలకు
Also Read: స్కిల్ కేసులో కొత్త సంచలనం - డీజీపీకి పీవీ రమేష్ లేఖ - ఫేక్ కేసులో ఎవరెవరు ఇరుక్కుంటారు ?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఎలక్షన్
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement