అన్వేషించండి

Metro Rail In Vijayawada and Visakhapatnam: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు టెండ‌ర్ల‌కు ఆహ్వానం, జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం

Visakhapatnam Metro Rail Project: విజయవాడ, విశాఖపట్నంలలో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మెట్రో రైల్ టెండ‌ర్ల‌లో పాల్గొనేందుకు జాయింట్ వెంచ‌ర్స్ కు అవ‌కాశం కల్పించారు.

Vijayawada Metro Rail Project: అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ టెండర్లలో భాగస్వామ్యం కోసం జాయింట్ వెంచర్స్ (JV) కు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్ కు హాజరైన కాంట్రాక్ట్ సంస్థ‌ల నుంచి వ‌చ్చిన విన‌తితో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వీటిలో గరిష్టంగా 3 కంపెనీలు కలసి టెండర్‌ను వేయడానికి అనుమతించనున్నారు.  ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్పీ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయాలు, ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తాయి. విశాఖ మెట్రో టెండ‌ర్ల‌కు అక్టోబ‌ర్ 10, విజ‌య‌వాడ మెట్రో టెండ‌ర్ల‌కు అక్టోబ‌ర్ 14 వ తేదీ తుది గ‌డువు విధించారు.

పనుల విభజన, తగ్గనున్న వ్యయం
ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం చిన్న చిన్న ప్యాకేజీలుగా విశాఖ, విజయవాడ మెట్రో రైలు పనులను విభజించడం వల్ల ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరుగుతుంది. అందువల్ల, జాయింట్ వెంచర్స్ విధానానికి అవకాశం ఇచ్చారు. ఈ మెట్రో ప్రాజెక్టులను రికార్డు టైమ్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా, పనులను పెద్ద ప్యాకేజీలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో టెండర్ల వివరాలు
మెట్రో ఫేజ్-1లో విశాఖపట్నంలో 46.23 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్లు మెట్రో సివిల్ పనులకు అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు ఆహ్వానించారు. విశాఖపట్నం మెట్రో టెండర్ల దాఖలుకు అక్టోబర్ 10వ తేదీ, విజయవాడ టెండర్లకు అక్టోబర్ 14వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జాయింట్ వెంచర్ నిర్ణయాలతో ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపడుతున్న ప్రాజెక్టులు

విజయవాడ, విశాఖల్లో మెట్రోలకు ఏపీ ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నాయి. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లకు ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు ఆహ్వానించింది. ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులను జాయింట్ వెంచర్స్ కు అవకాశం కల్పించింది. విశాఖ మెట్రోకు ఏపీ ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు, సీఆర్డీఏ నుంచి విజయవాడ మెట్రోకు రూ. 3,497 కోట్లు ఇస్తారు. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ నుంచి నిధులు కేటాయిస్తారు.   

విజయవాడ మెట్రో రైలు పొడవు  మొత్తం 66.15 కి.మీ, ఇందులో ఫేజ్-1  ప్రాజెక్టు 38.40 కిలోమీటర్లు, రెండు కారిడార్లుగా నిర్మించనున్నారు. గన్నవరం నుంచి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు 25.95 కి.మీ ఒక కారిడార్, నెహ్రూ బస్ స్టేషన్ నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ రెండో కారిడార్ గా నిర్మించనున్నారు. ఫేజ్-1లో మొత్తం 34 స్టేషన్లు, అన్నీ ఎలివేటెడ్‌గా ఉండనున్నాయి. విజయవాడలో 66 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో రైలు ప్రాజెక్టు చేపడుతున్నారు.    

విశాఖపట్నం మెట్రో రైలు పొడవు 76.90 కిలోమీటర్లు.  ఫేజ్-1 ప్రాజెక్టు 46.23 కిలోమీటర్లు. మొత్తం 3 కారిడార్లు ఉంటుంది.  స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 29 స్టేషన్లు, 34.40 కి.మీ మొదటి కారిడార్,  గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 6 స్టేషన్లు 08 కి.మీ. రెండో కారిడార్. తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేర్ వరకు 7 స్టేషన్లు 6.75 కి.మీ, మూడో కారిడార్ గా చేపడతారు. మొత్తం 99.75 ఎకరాల భూమి కావాలి. దీని ఖర్చు రూ.882 కోట్లుగా అంచనా. విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో రైలు నిర్మించనున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
మూలా నక్షత్రం రోజు అతి తక్కువ సమయంలో ఉచిత దర్శనం, విజయవాడ దుర్గమ్మ భక్తులకు ముఖ్య సూచనలు!
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
మూలా నక్షత్రం రోజు కనకదుర్గమ్మ దర్శనం అందరికీ ఉచితం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు!
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget