అన్వేషించండి

Kantara Chapter 1 Trailer: అడవి తల్లి జానపదం ఓ అద్భుతం - 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ గూస్ బంప్స్

Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషభ్ శెట్టి అవెయిటెడ్ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది. పుంజుర్లి దేవునికి సంబంధించిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

Rishab Shetty's Kantara Chapter 1 Trailer Out: 2022లో చిన్న సినిమాగా రిలీజై సంచలన విజయం సాధించింది 'కాంతార'. పుంజుర్లి దేవుడికి సంబంధించిన చరిత్రతో పాటు జానపదం కలిపి అద్భుతంగా తెరకెక్కించారు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు.

పూర్వీకుల కథ వెనుక కథ

ఫస్ట్ పార్ట్‌లో పుంజుర్లి దేవుని అవతారంలో ఓ చోట నుంచి మాయం కాగా... అసలు అక్కడి నుంచి ఏం జరిగిందనేది... పుంజుర్లి దేవుని చరిత్ర... దాని వెనుక ఉన్న పురాణ కథనం అన్నింటినీ ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. తన తండ్రి 'పుంజుర్లి' అవతారంలో మాయమైన చోటుకు వచ్చిన కొడుకు... 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?' అన్న కొడుకు ప్రశ్నతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. గ్రామ మొత్తం తన తండ్రి కోసం వెతుకుతుండగా... 'ఇదే మన మూలం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే అదో పెద్ద దంత కథ.' అంటూ గతంలోకి తీసుకెళ్లి భారీ హైప్ క్రియేట్ చేశారు.

'కాంతార'లోకి వెళ్లొద్దు... ఎందుకంటే?

ఏళ్లి క్రితం అనగనగా ఓ రాజ్యం... ఆ రాజ్యాన్ని ఆనుకుని ఉన్న తెగ. ఆ తెగను అణచివేయాలని చూసే రాజు. ఆ తెగకు అండగా ఉండే నాయకుడు... దైవ శక్తి సహాయంతో ధర్మాన్ని ఎలా గెలిపించాడు? అనేదే మూవీ స్టోరీ అన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 'ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడడానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతూనే ఉంటాడు. అన్నీ గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్యభూమిలోనే...' అన్న డైలాగ్ వేరే లెవల్‌లో ఉంది. 

పులి కాపలాగా దైవాంశతో అడవి తెగకు దొరికిన బిడ్డ... 'బెర్మె' అంటూ ముద్దుగా పేరు పెట్టుకుని పెంచుకున్న అక్కడి ప్రజలు. చివరకు వారికి ఎలా అండగా నిలిచాడు అనేది కూడా ట్రైలర్‌లో చూపించారు. తాము పండించినది కప్పం కట్టాలంటూ హింసించే రాజుకు ఎదురు తిరిగిన 'బెర్మె' రాజును ఎలా ఎదిరించాడు? యువరాణి తెగ నాయకున్ని ఇష్టపడడంతో రాజు ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నాడు? తెగకు రాజుకు మధ్య జరిగే యుద్ధానికి, 'కాంతార'కు సంబంధం ఏంటి? అసలు పుంజుర్లి దేవుని చరిత్ర ఏంటి? గుళిగ కథ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుందనేలా ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. కొన్ని సన్నివేశాల్లో రిషబ్ లుక్, పుంజుర్లి అవతారం ఎలివేషన్ వేరే లెవల్‌లో ఉంది.

Also Read: పీఎం మోదీ బయోపిక్ - 'మా వందే' నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్... ఉన్ని ముకుందన్ బర్త్ డే స్పెషల్

అక్టోబర్ 2న రిలీజ్

రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో మూవీ తెరకెక్కించగా... ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 2న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : దీపావళి సండే స్పెషల్... ఓటీటీల్లో సినిమాల సందడి - టాప్ 10 మూవీస్ అస్సలు మిస్ కావొద్దు
దీపావళి సండే స్పెషల్... ఓటీటీల్లో సినిమాల సందడి - టాప్ 10 మూవీస్ అస్సలు మిస్ కావొద్దు
Sai Durgha Tej Kiran : కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
కాబోయే భార్యతో సాయి దుర్గా తేజ్ - క్యూట్ ఫోటో షేర్ చేసిన హీరో
Surekha Vani : 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్
'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్' - పర్సనల్ వీడియో వైరల్... సురేఖా వాణి సీరియస్
Suriya Scene Collections : ఏడాదిలో సూర్య హ్యాట్రిక్ హిట్ - సీన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఏడాదిలో సూర్య హ్యాట్రిక్ హిట్ - సీన్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget