India Pakistan Match | పాక్ కెప్టెన్‌కు చేయి ఇవ్వని సూర్య
ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం జరుగుతుంది. ఆసియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత మనవాళ్లు అందరు నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిపొయ్యారు. అలాగే మ్యాచ్ రెఫరీపై కూడా పాకిస్తాన్ టీమ్ ఐసీసీకి కంప్లెయింట్ చేసింది.
అయితే సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి మ్యాచ్ జరిగింది. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీకు మరోసారి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్ళిపొయ్యాడు. సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇది మరోసారి వివాదానికి దారి తీసింది.
అయితే ఈ వివాదంపై చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది సూర్యకుమార్ యాదవ్ ను సపోర్ట్ చేస్తున్నారు. మరొకొందరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని విమర్శిస్తున్నారు.
ఈ ‘నో-హ్యాండ్‌షేక్’ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.





















