Sahibzada Gun Firing Celebration | Asia Cup 2025 | సాహిబ్‌జాదా ఫర్హాన్ గన్ షాట్ సెలబ్రేషన్స్
ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎన్నో గొడవలు జరిగాయి. పాక్ ప్లేయర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 పరుగులు చేసాడు. కానీ అతడు చేసిన ఒక పనితో పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ మ్యాచ్‌లో ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ.. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి.. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత ఫర్హాన్.. తన బ్యాట్‌ను గన్ లాగా పట్టుకొని తుపాకీ పేల్చినట్లు ఫోజులు ఇచ్చాడు.
ఈ గన్ షాట్ సెలబ్రేషన్ చేయడంపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు భారతీయులను ఇదే విధంగా కాల్చి చంపారని పాక్ బ్యాటర్ సాహిబ్‌జాదా చేసి చూపించాడని విమర్శలు వస్తున్నాయి. ఆ దారుణ ఘటనను గుర్తు చేయడానికి ఇలా చేశాడని పాక్ బ్యాటర్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.





















