అన్వేషించండి

Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!

ఐర్లాండ్‌తో జరిగిన సెండ్ టీ20 మ్యాచ్ లో ఇండియా కేవలం ఒక్క రన్ తేడాతో ఓడిపోయి 0-2 తో సిరీస్‌ను కంప్లీట్‌గా చేజార్చుకుంది. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత టీమిండియా సిరీస్ కోల్పోవ‌డం ఇదే తొలిసారి.

Ireland Beat India By One Run In Belfast: ప్ర‌పంచ చాంపియ‌న్ భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ప‌సికూన లాంటి ఐర్లాండ్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్ కు గురైంది. వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, సిరీస్ ను చేజార్చుకుంది. వ‌రుస‌గా రెండో మ్యాచ్ లోనూ ఛేజింగ్ కు ప్ర‌య‌త్నించి, భంగ‌ప‌డి చేతులెత్తేసింది.  ఇక బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం జరిగిన సెకండ్ అండ్ లాస్ట్ టీ20 మ్యాచ్ లో ఇండియా టీమ్‌కు కోలుకోలేని షాక్ తగిలిింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో ఒక్క రన్ తేడాతో ఇండియా ఓడిపోయింది. దీంతో హిస్టారికల్ సిరీస్ ను ఐరిష్ జ‌ట్టు క్లీన్ స్వీప్ చేసింది. టీ20 వరల్డ్ కప్ విన్నర్స్ అయిన ఇండియాకు పసికూన చేతిలో ఈ రేంజ్ పరాజయం ఎదురవ్వడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకోగా, ఐర్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 రన్స్ చేసింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ హేరీ ట్రెక్ట‌ర్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (47 బంతుల్లో 53, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో అరంగేట్ర ఆట‌గాడు ప్రిన్స్ యాద‌వ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి.  ఆ తర్వాత 155 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో టీమిండియా 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 153 రన్స్ మాత్రమే చేయగలిగింది. తెలుగు స్టార్ తిల‌క్ వ‌ర్మ సూప‌ర్భ్ ఫిఫ్టీ (46 బంతుల్లో 55, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. జై మూంద్రా, మాట్ హోలార్డ్ త‌లో మూడు వికెట్ల‌తో మ‌రోసారి భార‌త బ్యాటింగ్ ను వ‌ణికించారు.

లాస్ట్ ఓవర్ డ్రామా.. ఒక్క రన్ తో చేజారిన విక్టరీ
155 రన్స్ ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియాకు బ్యాటింగ్ ఆర్డర్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం మళ్లీ శాపంగా మారింది. ఐరిష్ బౌలర్ల కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ లీగల్ గా ఇండియన్ బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టేసింది. ఓపెన‌ర్లు సంజూ శాంస‌న్, అభిషేక్ శ‌ర్మ డ‌కౌట్ల‌తో నిరాశ ప‌ర్చారు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా తెలుగు స్టార్ తిల‌క్ వ‌ర్మ ఒంట‌రి పోరాటం చేశారు. ఐరిష్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొని ఫిఫ్టీ సాధించాడు. అయ‌తే అత‌నికి మిగ‌తా బ్యాట‌ర్ల నుంచి స‌హ‌కారం ల‌భించ‌లేదు. మిడిల్ ఆర్డర్లో పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ చేయడంలో బ్యాట‌ర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. లాస్ట్ ఓవర్ లో గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ, ప్రెజర్ హ్యాండిల్ చేయలేక బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. టోటల్ గా 9 వికెట్ల నష్టానికి 153 రన్స్ వద్దే ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఒక్క రన్ దూరంలో విజయం ఆగిపోవడంతో  ఇండియా క్యాంప్ కంప్లీట్ సైలెన్స్ లోకి వెళ్ళిపోయింది.

Read Also: Ind vs Ire 2nd T20: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ డకౌట్.. టీమిండియా ఓపెనర్ల ఖాతాలోకి చెత్త రికార్డు

ప్రిన్స్ యాదవ్ అదిరిపోయే డెబ్యూ.. ఐర్లాండ్ తక్కువ స్కోరుకే కంట్రోల్
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ టీమ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఇండియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి డెబ్యూ చేసిన యంగ్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన స్పెల్ వేశాడు. తను 4 ఓవర్లలో కేవలం 22 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి ఐర్లాండ్ ను దెబ్బకొట్టాడు. అతనికి తోడుగా సీనియర్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 35 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయగా, ఆల్‌రౌండర్ శివం దూబే 25 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల సాలిడ్ పర్ఫార్మెన్స్ వల్ల ఐర్లాండ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. కాగా ఈ మ్యాచ్ లో సూర్యాంశ్ షెడ్గే కూడా ఇండియా తరఫున టీ20 డెబ్యూ ఇవ్వగా, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఈసారి కూడా బెంచ్ కే పరిమితమయ్యాడు.

గంభీర్, అయ్యర్ సేనకు భారీ షాక్.. ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెన్షన్
ఈ చారిత్రాత్మక విజయంతో ఐర్లాండ్ 2-0 తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి కొత్త హిస్టారికల్ రికార్డ్ క్రియేట్ చేసింది. వరల్ڈ ఛాంపియన్స్ ను తమ సొంత గడ్డపై క్లీన్ స్వీప్ చేయడం నెక్స్ట్ లెవెల్ అచీవ్‌మెంట్ అన‌డంలో సందేహం లేదు. ఇండియా టీమ్ బ్యాటింగ్ లో అస్సలు ప్లానింగ్ లేదని, అనవసరమైన షాట్లకు పోయి వికెట్లు గిఫ్ట్ గా ఇచ్చారు.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల కాంబినేషన్ కు ఇది ఒక పెద్ద మైండ్ బ్లాకింగ్ షాక్. బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే ఫైవ్-మ్యాచ్ టీ20 సిరీస్ కు ముందే టీమిండియా తమ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget