Shubman Gill Records: ఒక టెస్టులో ఏకంగా 10 రికార్డులు బద్ధలుకొట్టిన భారత కెప్టెన్ శుభమన్ గిల్
Ind vs Eng 2nd Test | టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలిపి 430 పరుగులు చేసి ఏకంగా 10 రికార్డులు బద్దలు కొట్టాడు.

Shubman gill broke 10 records against england: టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి టెస్ట్‌లో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రెండో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. గిల్ ఎడ్జ్ బాస్టన్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులకు ఔటయ్యాడు. సిరీస్ లో రెండో టెస్టులోనే గిల్ మొత్తం 430 పరుగులు చేశాడు. అదే సమయంలో భారత కెప్టెన్ గిల్ 10 పెద్ద రికార్డులు బద్దలు కొట్టాడు. భారత జట్టు ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌ని 336 పరుగుల తేడాతో గెలిచింది.
రెండో టెస్ట్‌లో గిల్ 10 పెద్ద రికార్డులు బద్దలు కొట్టాడు
1- ఒక టెస్ట్‌లో అత్యధిక పరుగులు- ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి గిల్ 430 పరుగులు చేశాడు. ఒక టెస్ట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్‌పై 344 పరుగులు చేసిన రికార్డును అధిగమించాడు.
2- ఒక మ్యాచ్‌లో 250, 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్- గిల్ ఎడ్జ్ బాస్టన్ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 161 రన్స్ చేశాడు. ఒకే టెస్ట్‌లో 250, 150 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.
3- రెండు ఇన్నింగ్స్‌లలో 150 కంటే ఎక్కువ స్కోరు- బర్మింగ్ హామ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో గిల్ కంటే ముందు అలెన్ బోర్డర్ మాత్రమే ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 150 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. బోర్డర్ 1980లో పాకిస్తాన్‌పై 150, 153 రన్స్ చేశాడు.
4- కెప్టెన్‌గా అత్యధిక స్కోరు- భారత కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ అత్యధిక స్కోరు సాధించాడు. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. గిల్ 269 పరుగులు చేశాడు. అదే సమయంలో కోహ్లీ 2019లో దక్షిణాఫ్రికాపై 254 రన్స్ సాధించాడు.
5- ఇంగ్లండ్‌లో కెప్టెన్‌గా 2 ఇన్నింగ్స్‌లలో సెంచరీలు- ఇంగ్లండ్‌లో జరిగిన ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కెప్టెన్‌గా సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా గిల్ నిలిచాడు. అతడి కంటే ముందు ఏ ఇతర భారతీయ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు.
6- తొలి సిరీస్‌లో భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లీ మరో రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు గిల్. భారత కెప్టెన్ ఈ సిరీస్ లో ఇప్పటివరకు 585 పరుగులు చేశాడు. అదే సమయంలో కోహ్లీ 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన 4 ఇన్నింగ్స్‌లలో 449 పరుగులు చేశాడు.
7- ఇంగ్లండ్‌లో భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు- గిల్ చేసిన 269 పరుగులు ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు. గవాస్కర్ 1979లో ఓవల్‌లో 221 పరుగుల రికార్డును గిల్ బద్ధలుకొట్టాడు.
8- SENA దేశాలలో ఆసియా టెస్ట్ కెప్టెన్ అత్యధిక స్కోరు- SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలలో ఆసియా టెస్ట్ కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు 269. శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షన్ రికార్డును బద్దలు కొట్టాడు. దిల్షాన్ 2011లో లార్డ్స్ టెస్టులో 193 పరుగులు చేశాడు.
9- ఆసియా బయట అత్యధిక స్కోరు- ఆసియా వెలుపల భారతీయ బ్యాటర్ అత్యధిక స్కోరు తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. సచిన్ 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 241 పరుగులు చేశాడు. తాజాగా గిల్ 269 పరుగులు చేశాడు.
10- ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్‌లో డబుల్ సెంచరీ- ఎడ్జ్ బాస్టన్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బారత బ్యాటర్ గిల్. ఒకే టెస్టులో విదేశాల్లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడు, కెప్టెన్ గానూ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.





















