By: ABP Desam | Updated at : 04 Feb 2023 05:03 PM (IST)
Edited By: nagavarapu
బోర్డర్- గావస్కర్ సిరీస్
IND vs AUS Test: భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సమయం ఆసన్నమైంది. మరో 5 రోజుల్లో ఫిబ్రవరి 9 నుంచి నాగ్ పూర్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు ఆ దిశగా సన్నద్ధాలు మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియా జట్టు 5 రోజుల క్యాంప్ లో పాల్గొంటుంది. భారత స్పిన్నర్లను ఎదుర్కొనే దిశగా సాధన చేస్తోంది. మరోవైపు భారత్ సొంతగడ్డపై సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ హోరాహోరీగా సాగనుంది.
ఇరు జట్లకు కీలకం
బోర్డర్- గావస్కర్ సిరీస్ భారత్- ఆస్ట్రేలియా జట్లకు చాలా కీలకం. ఈ సిరీస్ విజయాన్ని బట్టి ఇరు జట్ల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సిరీస్ ఫలితం డబ్ల్యూటీసీ ఫైనలిస్టులను నిర్ణయిస్తుంది. డబ్ల్యూటీసీ లో ఇంకా 2 సిరీసులు మాత్రమే ఉన్నాయి. ఆ రెండు సిరీస్ ల ఫలితాలు కూడా ఫైనలిస్టులను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ రెండో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియాకు సులభమే
ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులభమే. భారత్ తో జరిగే సిరీస్ ను గెలుచుకోకపోయినా ఆసీస్ ఫైనల్ కు వెళ్లే అవకాశం ఉంది. 0-4 తో ఓడిపోయినప్పటికీ మిగతా రెండు సిరీస్ లు ఫలితాల ప్రకారం ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. అయితే భారత్ కు ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయడం అంత తేలిక కాదు. అలాగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఒకటి, రెండు మ్యాచ్ లు గెలిచినా మిగతా ఫలితాలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కాబట్టి ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఖాయమే.
భారత్ ఎలా
భారత జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-0 లేదా 3-1తో ఓడిస్తే మిగతా సమీకరణాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంటుంది. అలాగ్ సిరీస్ ను కోల్పోయినా కూడా భారత్ కు అవకాశం ఉంది. అయితే అది ఈ సీజన్ లో మిగిలిన రెండు టెస్టు సిరీస్ లపై ఆధారపడి ఉంటుంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఈ సీజన్ లో భారత్- ఆస్ట్రేలియా సిరీస్ కాకుండా ఇంకో రెండు సిరీస్ లు ఉన్నాయి. న్యూజిలాండ్- శ్రీలంక, దక్షిణాఫ్రికా- వెస్టిండీస్. ఈ జట్ల మధ్య 2 మ్యాచ్ లు టెస్ట్ సిరీస్ జరగాల్సి ఉంది. భారత్, ఆస్ట్రేలియాతో 1-3, 2-1 తేడాతో బోర్డర్- గావస్కర్ సిరీస్ కోల్పోయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. అయితే అందుకు శ్రీలంకతో జరిగే సిరీస్ ను న్యూజిలాండ్ 2-0తో గెలుచుకోవాలి. అలాగే వెస్టిండీస్ తో జరిగే సిరీస్ లో దక్షిణాఫ్రికా ఓడిపోవాలి.
కాబట్టి మిగతా టెస్ట్ సిరీస్ ల ఫలితాలతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలంటే భారత్- ఆస్ట్రేలియాకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గెలవడం చాలా ముఖ్యం.
Both India and Australia have one foot in the World Test Championship final as they prepare to face-off in an important series 👊#INDvAUS | #WTC23https://t.co/cWnbdKJhfw
— ICC (@ICC) February 2, 2023
IPL 2023: గుజరాత్ మ్యాచ్‌లో చెన్నై తుదిజట్టు ఇదే - ఎవరికి అవకాశం రావచ్చు?
IPL 2023: ఐపీఎల్ 2023 సీజన్‌ను ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడచ్చు? - టీవీలో ఏ ఛానెల్లో వస్తుంది?
Abhishek Porel: పంత్ ప్లేస్‌లో పోరెల్‌ను తీసుకున్న ఢిల్లీ - అసలు ఎవరు ఇతను?
IPL Commentators List: గేల్, డివిలియర్స్, రైనా - ఈసారి కామెంటేటర్లు మామూలుగా లేరుగా - లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్!
Liam Livingstone: పంజాబ్‌కు భారీ షాక్ - మొదటి మ్యాచ్‌కు లివింగ్‌స్టోన్ దూరం - ఎప్పుడు రావచ్చు!
ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!