By: ABP Desam | Updated at : 20 Nov 2023 05:01 PM (IST)
Edited By: Jyotsna
అతిగా మాట్లాడి ట్రోల్ అవుతున్న బజ్జీ ( Image Source : Twitter )
India vs Australia World Cup Final 2023: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా హిందీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ(Anushka Sharma), కేఎల్ రాహుల్ అర్థాంగి అతియా శెట్టి(Athiya Shetti) లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఉత్సాహంగా ఎక్కువ మాట్లాడి చివరికి విమర్శల పాలయ్యాడు.
వరుస విజయాలతో వన్డే ప్రపంచకప్ ఫైనల్(World cup Final)కు చేరుకున్న భారత జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Austrelia) చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు బాధలో మునిగిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇండియన్ క్రికెటర్ల భార్యలు కూడా మ్యాచ్‌ను వీక్షించారు. వీరిలో విరాట్ కోహ్లీ భార్య, నటి.. అనుష్క శర్మతో పాటు, కేఎల్ రాహుల్ సతీమణి అతియా షెట్టీకూడా ఉన్నారు. అనుష్క శర్మ, అతియా శెట్టిలు స్టాండ్స్‌లో పక్కపక్కనే కూర్చున్నారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడూ కెమెరాలు ఈ ఇద్దరిని పలుమార్లు ఫోకస్ చేశాయి. ఇక్కడ మ్యాచ్ జరుగుతుండగా అక్కడ ఇద్దరూ కూడా ఏదో విషయమై సీరియస్‌గా చర్చించుకుంటున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్ లకు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ హిందీ వ్యాఖ్యాతగా వ్యహరించాడు. అయితే అనుష్క, అతియా షెట్టీ మాట్లాడుకుంటున్న విషయంపై బజ్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు క్రికెట్ గురించి పెద్దగా ఏమీ తెలిసి ఉండదు. బహుశా సినిమాల గురించి మాట్లాడకుంటూ ఉండి ఉంటారని వ్యాఖ్యానించాడు. ఇంకేముంది బజ్జీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. పురుషాధిక్యాన్ని చూపిస్తున్నాయని పలువురు నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే భజ్జీ.. అనుష్కశర్మ, అతియా శెట్టిలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి మాటలు మీ నుంచి ఊహించలేదని కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఎంతగా మరచిపోదాం అనుకున్నా మనసుని ముక్కలు చేసిన క్షణాలు అవి.. కోట్ల మంది హృదయాలు ముక్కలయ్యాయి. కోటీ మంది ఆశలు గల్లంతయ్యాయి. ఫైనల్ వరకు అప్రతిహాత విజయాలతో దూసుకొచ్చిన టీమిండియాకు ఫైనల్లో ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆశలను.. ఆనందాలను.. అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ సేనను ఫైనల్లో మట్టికరిపించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్‌లో టీమిండియాను తక్కువ పరుగులకే అవుట్ చేసిన ఆస్ట్రేలియా ఆ తర్వాత సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. టీంఇండియా నిర్ణీత 50 ఓవర్ లలో 240 పరుగులు చేయగా ఆస్ట్రేలియా మరో 42 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
IND Vs AUS 5th T20: నేడే నామమాత్రపు మ్యాచ్, మార్పులతో బరిలోకి భారత్
IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!
WPL 2024 auction: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం ఎప్పుడంటే , అందుబాటులో 165 మంది క్రికెటర్లు
BAN vs NZ: చారిత్రాత్మక విజయంతో బంగ్లాదేశ్ కొత్త చరిత్ర
IPL 2024: వేలానికి 1166 మంది ఆటగాళ్లు దరఖాస్తు , ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ ధర?
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>