అన్వేషించండి
Advertisement
India vs Bangladesh 2nd Test: కాన్పూర్‌లో గత రికార్డులన్నీ మనవే , అత్యధిక పరుగులు చేసింద ఎవరంటే?
IND vs BAN: తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి ఊపుమీదున్న భారత జట్టు , కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది.
Green Park Stadium, Kanpur Test Records: బంగ్లాదేశ్(BAN)లో రెండో టెస్టుకు టీమిండియా(IND) సిద్ధమైంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి ఊపు మీదున్న భారత జట్టు... రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. కాన్పూర్(Kanpur)లోని గ్రీన్ పార్క్ స్టేడియం(Green Park Stadium) లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డే ఉంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో భారత్ 23 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ 23 మ్యాచ్‌ల్లో 7 టెస్టుల్లో విజయం సాధించగా, 13 టెస్టులు డ్రాగా ముగిశాయి. 3 మ్యాచుల్లో టీమిండియా ఓడిపోయింది.
కాన్పూర్‌లో భారీ స్కోరు
1986లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 676/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ టెస్ట్‌లో గ్రీన్ పార్క్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ పేరిటే రికార్డు ఉంది. ఆ మ్యాచులో సునీల్ గవాస్కర్ 176, మహ్మద్ అజారుద్దీన్ 199, కెప్టెన్ కపిల్ దేవ్ 163 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచులో శ్రీలంక కూడా ధీటుగా ప్రతిస్పందించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాన్పూర్‌లో వ్యక్తిగత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ మాత్రం మన భారత క్రికెటర్ కాదు. వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఫౌద్ బచ్చస్ పేరుపై.. టెస్ట్ క్రికెట్‌లో గ్రీన్ పార్క్ స్టేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు ఉంది. 1979లో భారత్‌తో జరిగిన మ్యాచులో ఈ విండీస్ బ్యాటర్ 250 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 644/7 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ బచ్చస్ ద్విశతకంతో 452/8 పరుగులు చేసింది. ఈ మ్యాచు కూడా పేలవమైన డ్రాగా ముగిసింది.
Also Read: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు
కాన్పూర్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ జసుభాయ్ పటేల్ పేరుపై... కాన్పూర్‌లో టెస్టుల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఉన్నాయి. కాన్పూర్‌లో పటేల్ 69 పరుగులకు తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. 1959లో జరిగిన ఆ మ్యాచ్‌లో జసుభాయ్ పటేల్ బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే పరిమితమైంది. పటేల్ బౌలింగ్‌తో భారత్ 119 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
కాన్పూర్‌లో అత్యధిక పరుగులు
కాన్పూర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుండప్ప విశ్వనాథ్ నిలిచారు. విశ్వనాథ్ ఏడు మ్యాచ్‌ల్లో 86.22 సగటుతో 776 పరుగులు చేశాడు, ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇదే స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కపిల్ దేవ్ రికార్డు సృష్టించాడు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఏడు టెస్టు మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. కపిల్ అత్యుత్తమ గణాంకాలు 6/63.
అత్యధిక పరుగుల భాగస్వామ్యం:
కాన్పూర్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం గౌతమ్ గంభీర్ -వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. 2009లో శ్రీలంకతో జరిగిన టెస్టులో భారత ఓపెనర్లు 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గంభీర్ 167 పరుగులు, సెహ్వాగ్ 131 పరుగులు చేశారు. ఈ మ్యాచులో భారత్ 144 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాన్పూర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ నిలిచాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో అజారుద్దీన్ మూడు సెంచరీలు చేశాడు. 181 సగటుతో అజారుద్దీన్ అత్యధిక సెంచరీలు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
టెక్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement