అన్వేషించండి

Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్‌ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు

India Pacer Mukesh Kumar: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్‌ ఓ ఇంటివాడయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 మూడో మ్యాచ్‌లో యువ పేసర్‌ ముకేష్‌ కుమార్‌ బదులు ఆవేశ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు.

టీమిండియాలో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా పెళ్లీ పీటలు ఎక్కుతున్నారు. ఇటీవలే కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ  పెళ్లి చేసుకోగా.... వెంకటేష్‌ అయ్యర్‌  నిశ్చితార్థం జరిగింది. తాజాగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్‌ ఓ ఇంటివాడయ్యాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ 20 మూడో మ్యాచ్‌లో యువ పేసర్‌ ముకేష్‌ కుమార్‌ కనపడలేదు. అతడి స్థానంలో ఆవేశ్‌ ఖాన్‌ జట్టులోకి వచ్చాడు. అయితే ముకేశ్‌కు గాయం అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ అవేమీ కాదని తేలిపోయింది. ముకేశ్‌ కుమార్‌ పెళ్లి కొడుకయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఆడని అతడు గోరఖ్‌పుర్‌లో తన వివాహ వేడుక కోసం బీసీసీఐ అనుమతి తీసుకుని వెళ్లాడు. భార్య దివ్యా సింగ్‌తో కలిసి ముకేశ్‌ నృత్యం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తిరుగుతోంది.

డిసెంబర్‌ 1న రాయ్‌పుర్‌లో జరిగే నాలుగో టీ20 కల్లా ఈ పేసర్‌ జట్టులో చేరనున్నాడు. పెళ్లి కార‌ణంగా అత‌డు మూడో మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. ఈ విష‌యాన్ని టీమిండియా సార‌థి సూర్యకుమార్ యాద‌వ్‌తో పాటు బీసీసీఐ కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. టాస్ సంద‌ర్భంగా సూర్య మాట్లాడుతూ తమ తుది జ‌ట్టులో ఒక మార్పు జ‌రిగిందని, ముకేష్ స్థానంలో అవేశ్ ఆడుతున్నాడని తెలిపాడు. ముకేశ్ పెళ్లి నేడు జరగనుందని.. అత‌డికి శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నామని అన్నాడు. 


రాయ్‌పూర్‌లో జ‌రుగ‌బోయే నాలుగో మ్యాచ్‌కు ముందే ముకేష్‌ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ కూడా ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఏడాది జులైలో వెస్టిండీస్ ప‌ర్యట‌న‌తో ముకేశ్‌ కుమారు జట్టులోకి వచ్చాడు. అదే పర్యటనలో వ‌న్డేలు, టీ20ల‌లో కూడా అరంగేట్రం చేశాడు. ఇప్పటివ‌ర‌కు ఒక టెస్టు, మూడు వ‌న్డేలు, నాలుగు టీ20లు ఆడాడు. విండీస్ సిరీస్‌తో పాటు ఆసీస్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో కూడా ఆడుతున్నాడు. 


 ఇటీవలే తన ప్రేయసి స్వాతి ఆస్థాన(Swati Asthana )ను నవదీప్ సైనీ వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమ లోకంలో విహరించిన వీరిద్దరూ అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నవదీప్ సైని వెల్లడించాడు. తన వివాహం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన నవదీప్ సైని.. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించిన తమకు మీ ప్రేమ, ఆశీర్వాదం కావాలంటూ అభిమానులను కోరాడు. నీతో ప్రతిరోజు ప్రేమ‌తో నిండిందేనని. ఈరోజుతో మ‌నం ఆ ప్రేమ‌ను శాశ్వతం చేస్తున్నామని ఇన్‌ స్టా పోస్ట్‌లో సైనీ స్వాతిపై తన ప్రేమను వ్యక్తం చేశాడు.


ఇంట్లో పెద్దవాళ్లు పెళ్లికి అంగీకారం తెలపడంతో నవదీప్ సైనీ-స్వాతి ఆస్థాన వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌లోని దేబారి ఆనందం రిస్టార్స్‌లో ఘనంగా జరిగింది. పంజాబీ ఆచారాల ప్రకారం.. ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవదీప్ సైని పెళ్లాడిన స్వాతి అస్థానా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ అయిన స్వాతి ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్ స్టైల్ అంశాలపై వీడియోలు చేస్తుంటారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రోజువారీ కార్యకలాపాలు, ట్రావెలింగ్ మీద వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. స్వాతి అస్తానా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు 80 వేలమంది వరకూ ఫాలోవర్లు ఉన్నారు. నవదీప్ సైనీ-స్వాతి దంపతులకు భారత క్రికెటర్లు మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్పీ సింగ్‌, రాహుల్‌ తెవాటియా సోషల్‌ మీడియాలో సైనీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget