అన్వేషించండి

Match Fixing: భారత్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడ్డా, రెచ్చగొట్టి తప్పులు చేయించారు - కివీస్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

Lou Vincent: న్యూజిలాండ్ డాషింగ్ బ్యాటర్ విన్సెంట్.. భారత్‌లో ఫిక్సింగ్‌కి పాల్పడిన విధానంపై మాట్లాడాడు. ఫిక్సింగ్ కారణంగా 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు తను దూరమయ్యాడు.

ICL Fixing: మ్యాచ్ ఫిక్సింగ్ వివిధ రూపాల్లో జడలు విప్పుతూనే ఉంది. ఎంతో క్రేజ్ ఉన్న అబుధాబి టీ10 లీగ్‌లోనూ ఫిక్సింగ్ భూతం జాడలు కనిపించాయి. అయితే తాజాగా మాజీ క్రికెటర్ ఒకరు భారత్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు వివరించాడు. న్యూజిలాండ్ మాజీ బ్యాటర్‌లూ విన్సెంట్.. భారత్‌లో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)లో ఆడినప్పుడు తాను ఫిక్సింగ్ ప్రపంచంలో చిక్కుకున్నానని వెల్లడించాడు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు లీగ్ దశలోనే వెనుదిరగడంతో అప్పుడు టీ20 ఫార్మాట్లో ఐసీఎల్ అనధికారికంగా ఊపిరి పోసుకుంది. జీ గ్రూప్ యజమాని సుభాష్ ఈ లీగ్‌ను ప్రారంభించారు. 2007-09 వరకు ఈ లీగ్ జరిగి ఆ తర్వాత కనుమరుగైపోయింది. ఈ లీగ్ స్థానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్ పురుడు పోసుకుంది. అయితే తను ఐసీఎల్లో ఆడుతున్నప్పుడు ఫిక్సింగ్ వలలో చిక్కుకుపోయాయని విన్సెంట్ తెలిపాడు. కివీస్ తరపున తాను 23 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు. 

కుంగుబాటులో ఉన్నప్పుడు..
నిజానికి ఆ సమయంలో తాను మానసికంగా పరిణితితో వ్యవహరించలేకపోయానని విన్సెంట్ తెలిపాడు. ప్రొఫెషనల్ కెరీర్ కొనసాగించేంత మెంటల్ ఎబిలీటీ స్థిరంగా ఆ సమయంలో లేదని వివరించాడు. ఆ సమయంలో తాను 28 ఏళ్ల వాడినని, తీవ్ర మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఐసీఎల్‌లో పాల్గొనడానికి భారత్ వెళ్లినట్లు తెలిపాడు. అక్కడే ఫిక్సింగ్ ప్రపంచంలో చిక్కుకున్నానని, నిజానికి ఆ సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ టీమ్‌తో జత కట్టినందుకు హాయిగా అనిపించిందని అంగీకరించాడు. తమ రహస్యం ఎవరికీ తెలిసేది కాదని భావించినట్లు పేర్కొన్నాడు. ఆ సమయంలో అన్ని విధాలుగా ఆ టీమ్ అండగా నిలిచిందని, వెన్నంటే ఉంటామని మద్ధతు పలుకుతూ, తనతో చాలా తప్పులు చేయించే టీమ్ అని ఆలస్యంగా అర్థమైందని వివరించాడు. నిజానికి ఫిక్సింగ్ గ్యాంగులన్నీ అలాగే ఉంటాయని, వాటి నుంచి బయటకు రావడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నాడు. ఫ్యామిలీ మెంబర్ల విషయాలు వెల్లడిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఒక్కసారి వాళ్ల చేతికి చిక్కినట్లయితే తోలుబొమ్మల్లా ఆడాల్సిందేనని వివరించాడు. వాళ్ల వెనకాల పెద్ద పెద్ద వాళ్ల జోక్యం ఉండేదని గుర్తు చేసుకున్నాడు. వాళ్ల కబంధ హస్తాల నుంచి బయట పడాలంటే ఫిక్సింగ్ చేసినట్లు ఒప్పుకోవడం ఒక్కటే మార్గమని విన్సెంట్ వివరించాడు. 

Also Read: 2024 FlashBack: వన్డేల్లో పీడకలగా మారిన ఈ ఏడాది.. ఒక్క మ్యాచ్ లోనూ గెలుపొందని భారత్

జీవిత కాల నిషేధం..
2014లో విన్సెంట్ ఫిక్సింగ్ విషయం వెలుగులోకి రావడంతో అతనిపై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) జీవితకాల నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత విన్సెంట్ అభ్యర్థనపై దాన్ని దేశవాళీ క్రికెట్ నుంచి మినహాయింపునిచ్చింది. చిన్నప్పటి నుంచి కుటుంబ సమస్యల కారణంగా ఒంటరిగానే పెరిగిన విన్సెంట్.. గుర్తింపు, ప్రేమ కోసం పరితపించాడు. కానీ, ఊహించనిది దక్కడంతో కుంగుబాటుకు గురయ్యాడు. ఆ సమయంలో ఫిక్సింగ్ వలలో చిక్కినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై టెస్టు సెంచరీతో కెరీర్ ప్రారంభించిన విన్సెంట్.. ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలకాల్సి వచ్చింది. 

Also Read: Smriti Mandhana World Record: స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. ఇప్పటివరకు ఏ మహిళా బ్యాటర్‌కు సాధ్యం కానీ ఘనత సొంతం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Swiggy One BLCK: స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
స్విగ్గీ కొత్త ప్రీమియం ప్లాన్‌ - అపరిమిత ఫ్రీ డెలివెరీలు, డిస్కౌంట్‌లు, OTT ఆఫర్లు!
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Embed widget