అన్వేషించండి

ENG vs SL : ఎవరి ఆశలు నిలిచేనో- శ్రీలంకతో ఇంగ్లాండ్‌ అమీతుమీ

ODI World Cup 2023: భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌.. చావోరేవో తేల్చే మ్యాచ్‌కు సిద్ధమైంది.

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌.. చావోరేవో తేల్చే మ్యాచ్‌కు సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌లో ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్న ఇంగ్లండ్‌.. శ్రీలంక రేపు(గురువారం) తలపడనున్నాయి. సెమీస్‌ ఆశలు ఇంకా సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు గెలుపు తప్పనిసరి. మరోసారి ప్రపంచకప్‌ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని ప్రారంభంలో అంచనా వేసిన బ్రిటీష్‌ జట్టు.. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌లో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉంది. శ్రీలంక కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇప్పటివరకూ శ్రీలంక నాలుగు మ్యాచ్‌లు అడి ఒక విజయం, మూడు పరాజయాలతో రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా అన్నే మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లాండ్‌ రెండే పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. లంక కంటే తక్కువ రన్‌రేట్‌తో బ్రిటీష్‌ జట్టు తొమ్మిదో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాపై ఘోర  ఓటమితో బంగ్లాదేశ్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని... ఆత్మవిశ్వాసం పోగు చేసుకుని ముందుకు సాగాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. 
 
 చెన్నై చెపాక్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన బౌన్స్‌ బ్యాక్‌ అవ్వాలని ఇంగ్లండ్‌, లంక పట్టుదలగా ఉన్నాయి. అయితే సెమీస్‌ చేరే ఏ అవకాశాన్ని వదులుకోవద్దని బ్రిటీష్‌ జట్టు పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌, శ్రీలంక సెమీస్‌ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచుల్లో తప్పక గెలవాల్సి ఉంది. అలా అయితేనే 12 పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో కఠినమైన ప్రత్యర్థులను ఇరు జట్లు ఎదుర్కోవాల్సి ఉంది. కానీ ఒకసారి ఫామ్‌ అందుకుంటే ఇంగ్లండ్‌ను ఆపడం కష్టమని మాజీలు విశ్లేషిస్తున్నారు. వరస పరాజయాలతో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు ఈ విజయం అత్యవసరం. జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ నుంచి బ్రిటీష్‌ జట్టు భారీ స్కోరు ఆశిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్‌ బట్లర్ ఇప్పటివరకూ బ్యాట్‌తో రాణించలేదు. గాయం నుంచి కోలుకున్న స్టోక్స్‌ మరోసారి ఫామ్‌ను అందిపుచ్చుకుంటే ఇంగ్లండ్‌కు తిరుగుండదు. కానీ బ్రిటీష్‌ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నారు. క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ కూడా అంచనాల మేర రాణిస్తే లంకపై గెలుపు బ్రిటీష్‌ జట్టుకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ చెపాక్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన లంక స్పిన్‌ను ఇంగ్లండ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. 
 
శ్రీలంక పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. సెమీస్‌ చేరాలంటే లంక అన్ని మ్యాచులు గెలవాల్సిందే. భారత్, న్యూజిలాండ్‌లతో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో లంక సెమీస్‌ చేరడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. కానీ ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవద్దని లంక క్రికెటర్లు భావిస్తున్నారు. కుశాల్ మెండిస్స, సదీర సమరవిక్రమ, దిల్షాన్ మధుశంకపై లంక ఆశలు పెట్టుకుంది. కుశాల్‌ మెండీస్‌ ఈ ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాపై 42 బంతుల్లో 76, పాకిస్తాన్‌పై 65 బంతుల్లో సెంచరీ చేశాడు. వీళ్లు రాణిస్తే ఇంగ్లండ్‌పై గెలుపు పెద్ద కష్టం కాదని శ్రీలంక భావిస్తోంది. మతీషా పతిరానా స్థానంలో ఏంజెలో మాథ్యూస్‌ జట్టులో చేరనున్నాడు. దునిత్ వెల్లలగే కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 
 
ఇంగ్లండ్ జట్టు: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్‌) హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్/మార్క్ వుడ్
 
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుశాల్ మెండిస్ (కెప్టెన్) సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దుషన్ హేమంత/దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహాన తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక

టాప్ హెడ్ లైన్స్

Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget