అన్వేషించండి
Advertisement
Sunil Gavaskar: వచ్చేశాడు మరో ధోనీ, జురెల్‌పై ప్రశంసల జల్లు
Dhruv Jurel: టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
Gavaskar Highly Praises Dhruv Jurel: రాంచీ(Ranchi) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్(Dhruv Jurel) అద్భుత పోరాటంతో టీమిండియావిజయం దిశగా పయనిస్తోంది. ఒంటరి పోరాటం చేసిన ధ్రువ్ జురెల్.. టెయిలండర్లతో కలిసి అద్భుతమే చేశాడు. ధ్రువ్ జురెల్ పోరాటంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యమే లభించింది. టీమిండియా అసలు 200 పరుగుల మార్క్ అయినా దాటుతుందా అన్న దశ నుంచి.. 300 పరుగుల మార్క్ దాటిందంటే అది కేవలం ధ్రువ్ ఒంటరి పోరాటం వల్లే ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభంచిన టీమిండియా... 307 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. జురెల్ 90 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ 131 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి జురెల్‌కు మంచి సహకారం అందించాడు. అనంతరం ఇంగ్లాండ్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా... ఇప్పటికే 40 పరుగులు చేసి విజయం దిశగా సాగుతోంది.
జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్‌ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్ జురెల్ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్ అన్నాడు.
మ్యాచ్ ఇలా...
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా.. విజయం దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేయగా.. క్రీజులో జైస్వాల్ 14*, రోహిత్ 24* ఉన్నారు.
145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 పరుగులే ఆలౌట్ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ వికెట్ల పతనం వేగంగా సాగింది. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు. కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్ తీశారు. అన్ని వికెట్లు స్పిన్నర్లకే పడటం విశేషం. ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్రాలే 60, బెయిర్ స్టో 30, మినహా అందరూ విఫలమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత్ విజయానికి 192 పరుగులు చేయాలి. రత స్పిన్నర్లు అదరగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్ యాదవ్ (4/22), రవీంద్ర జడేజా (1/56) వికెట్లు తీశారు. జాక్ క్రాలే (60) హాఫ్ సెంచరీ సాధించగా.. జానీ బెయిర్ స్టో (30), బెన్ ఫోక్స్ (17) కాస్త ఫర్వాలేదనిపించారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion