అన్వేషించండి
Advertisement
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్ బై
David Warner: అంతర్జాతీయ క్రికెట్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై చెప్పేశాడు. టీ20 వరల్స్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరేలోగానే ఇంటికి చేరడంతో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది.
David Warner Retirement: అంతర్జాతీ క్రికెట్లో మరో దిగ్గజ ఆటగాడి కెరీర్ ముగిసింది. టీ 20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించిన అనంతరం... కంగారు జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ టీ20 ప్రపంచకప్ తన చివరి ఆట అని చెప్పిన విషయం తెలిసిందే. భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్ లో, వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మరోవైపు బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ గెలవడం వల్ల టీ 20 ప్రపంచకప్ సెమీస్ చేరే అవకాశం ఆస్ట్రేలియాకు లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు వార్నర్ ప్రకటించాడు.
Thanks for the memories in international cricket, David Warner 💛pic.twitter.com/qBIMiI1nLC
— CricTracker (@Cricketracker) June 25, 2024
డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. కంగారులు కంగారు పడే ఎన్నో మ్యాచ్ లలో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు డేవిడ్ భాయ్. ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి . జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను ఇచ్చాడు. టీ20 ప్రపంచక్కు వీడ్కోలు పలికినా వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అవసరం అయితే ఆడతానని వార్నర్ తెలిపాడు.
ఆటగాడిగా రిటైర్మెంట్ తీసుకున్న తరువాత భవిష్యత్‌లో కోచ్‌గా కూడా వచ్చే అవకాశముందని వార్నర్ గతంలో చెప్పాడు. క్రికెట్ నుంచి పూర్తిగా దూరమైన రోజున కోచింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తానని , తాను కోచ్‌గా రాణించగలననే నమ్మకం ఉందని అయితే ఏదేమైనా కుటుంబంతో కొంత సమయం గడిపిన తరువాతే నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడు వార్నర్.
ఒకవైపు క్రికెటర్‌గా టోర్నమెంట్స్‌తో ఎంత బిజీగా ఉన్నా వీలు దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు వార్నర్. ముఖ్యంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రిల్స్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంటారు. ఇక వార్నర్ కి తెలుగు హీరోలు అంటే మహా పిచ్చి .. అందుకే వాళ్ళ పాటలకి డాన్స్ లు వేయటం, తెలుగు సినిమాల సీన్స్ రీల్స్ కూడా చేస్తుంటాడు. ఇక పుష్ప సినిమా విషయంలో వార్నర్ చేసే హడావిడి చెప్పనవసరం లేదు . అవకాశం ఉన్న ప్రతి చోటా పుష్పగా మారిపోతాడు డేవిడ్. మైదానంలో స్టెప్స్ వేయటం, తగ్గేదేలే అన్న డైలాగ్ చెప్పటంలో అస్సలు తగ్గడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
బిజినెస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement