By: ABP Desam | Updated at : 07 Aug 2023 07:21 PM (IST)
2023 ఆసియా కప్ షెడ్యూలు విడుదల అయింది. ( Image Source : Twitter )
Asia Cup Schedule & Timing: ఆసియా కప్ 2023 షెడ్యూల్ విడుదల అయింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆగస్టు 30వ తేదీన పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. ఇక టీమిండియా మాత్రం పాకిస్తాన్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు తన రెండో లీగ్ దశలో నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 4వ తేదీన భారత్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఏమిటి?
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన జరుగుతుంది. నిజానికి గతసారి ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా, ఈసారి 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత సూపర్-4 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6, 9, 10, 12, 14 మరియు 15 తేదీల్లో జరుగుతాయి.
ఆసియా కప్ మ్యాచ్‌లను ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
2023 ఆసియా కప్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో క్రికెట్ అభిమానులు ఆసియా కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించగలరు. ఇది కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. అలాగే భారత మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని డీడీ స్పోర్ట్స్‌లో కూడా ఎంజాయ్ చేయవచ్చు.
ఆసియా కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. ఈ విధంగా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు భారతీయ అభిమానులు డీడీ స్పోర్ట్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.
ఆసియా కప్ తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు ప్రపంచకప్‌లో తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో అక్టోబర్ 14వ తేదీన భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ మ్యాచ్‌ను అక్టోబర్ 15వ తేదీన షెడ్యూల్ చేశారు. కానీ నవరాత్రి వేడుకల కోసం ఒక రోజు ముందుకు ప్రీ పోన్ చేసినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.
Asia Cup schedule & timing by Star Sports.
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
Save your dates for epic clashes...!!!! pic.twitter.com/5Zl1wH90tB
IT'S TIME to watch the Asian Giants unite in the #AsiaCup2023! 🤩
— Star Sports (@StarSportsIndia) August 7, 2023
Set your ⏰
Mark your 📅
Prepare yourself for top-notch cricket! 👏
Tune-in to #INDvPAK in #AsiaCupOnstar
September 2, 3:00 PM onwards | Star Sports Network#Cricket pic.twitter.com/umWYqRk9ga
Seek the finest Asian spectacle! 🕵️♂️
— Star Sports (@StarSportsIndia) August 7, 2023
Cast your vote, and we'll bring you the best of #AsiaCup experience! On Friday, Aug 11
| SS1 H, SS2 & SS3 | 11:00 am. #AsiaCupOnStar
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
IND vs AUS 3rd ODI: రోహిత్ మెరుపు సిక్సర్లు! కోహ్లీ హాఫ్ సెంచరీ - టార్గెట్ దిశగా టీమ్ఇండియా!
IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్ఇండియా టార్గెట్ 353
IND vs AUS 3rd ODI: ఇదేందయ్యా.. ఈ కొట్టుడేందయ్యా! 25 ఓవర్లకే ఆసీస్ 188/1
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
/body>