SL Vs BAN, Innings Highlights: 37 పరుగుల తేడాలో ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా - శ్రీలంక ముందు ఈజీ టార్గెట్!
ఆసియా కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 164 పరుగులకే ఆలౌట్ అయింది.
SL Vs BAN Innings Highlights: ఆసియా కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా టైగర్స్ 42.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో (89: 122 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జట్టు స్కోరులో సగానికి పైగా పరుగులు నజ్ముల్ ఒక్కడే సాధించాడు. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరానా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక విజయానికి 300 బంతుల్లో 165 పరుగులు చేస్తే సరిపోతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వారికి ప్రారంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (16: 23 బంతుల్లో, మూడు ఫోర్లు), తన్జీద్ హుస్సేన్ (0: 2 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. రెండో ఓవర్లోనే తన్జీద్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి ఐపీఎల్ స్టార్ మతీష పతిరానా శ్రీలంకకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో మహ్మద్ నయీమ్ కూడా అవుటయ్యాడు. దీంతో 25 పరుగులకే బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది.
టూ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (5: 11 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అప్పటికి స్కోరు 36 పరుగులు మాత్రమే. ఆ తర్వాత నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్ (20: 41 బంతుల్లో) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు.
అక్కడ నుంచి బంగ్లాదేశ్ వికెట్ల పతనం ప్రారంభం అయింది. ఒకానొక దశలు 127/4తో ఓ మోస్తరు స్కోరు సాధిస్తారనుకున్న బంగ్లా... బ్యాటర్లు విఫలం కావడంతో 164 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 37 పరుగుల తేడాలోనే ఆఖరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. శ్రీలంక బౌలర్లలో మతీష పతిరానా అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహీష్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి. ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలాగే, దసున్ షనక తలో వికెట్ దక్కించుకున్నారు.
బంగ్లాదేశ్ తుది జట్టు
మహ్మద్ నయీమ్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్
శ్రీలంక తుది జట్టు
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీశ పతిరానా
Asia Cup 2023: Bangladesh Vs Sri Lanka 🏏
— Bangladesh Cricket (@BCBtigers) August 31, 2023
Sri Lanka Need 165 Runs to Win#BCB | #AsiaCup | #BANvSL pic.twitter.com/IvL8NZrOpq
Asia Cup 2023: Bangladesh Vs Sri Lanka
— Bangladesh Cricket (@BCBtigers) August 31, 2023
Moments of Bangladesh's Innings#BCB | #Cricket | #AsiaCup pic.twitter.com/ug5LSLtuXw
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial