(Source: ECI/ABP News/ABP Majha)
Ashes 2023: చివరి టెస్టులో ఆసీస్‌కు షాకిచ్చిన బ్రాడ్.. ముగిసిన యాషెస్
నెలన్నర రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరిస్తున్న యాషెస్ సిరీస్‌కు అద్భుతమైన ముగింపు దక్కింది. చివరి టెస్టులో ఆసీస్‌కు ఇంగ్లాండ్ షాకిచ్చింది.
Ashes 2023: అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ పేస్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్.. తన చివరి టెస్టును ఘనంగా ముగించాడు. విజయం ముంగిట నిలిచిన ఆస్ట్రేలియాను దెబ్బకొట్టి రెండు దశాబ్దాలుగా ఇంగ్లాండ్ గడ్డ మీద ఆ జట్టును ఓడించని కంగారూలకు మరోసారి నిరీక్షణే మిగిల్చాడు. ‘ది ఓవల్’ వేదికగా నిన్న ముగిసిన ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టును ఇంగ్లాండ్ గెలుచుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 384 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి రోజు ఆసీస్ విజయానికి 249 పరుగుల అవసరమయ్యాయి. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. ఒకదశంలో 260-3గా ఉన్న ఆసీస్.. 334 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్.. 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఐదో రోజు ఆట ఉదయం సెషన్‌లో డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖవాజా (72)ల వికెట్లతో పాటు మార్నస్ లబూషేన్ (13) వికెట్లను వెంటవెంటనే కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (54), ట్రావిస్ హెడ్ (43) ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. మూడో సెషన్ ప్రారంభం వరకూ ఆసీస్ నిలకడగా ఆడటమే గాక విజయం దిశగా సాగింది.
దెబ్బకొట్టిన వోక్స్, అలీ..
లక్ష్యం దిశగా సాగుతున్న ఆసీస్‌ను క్రిస్ వోక్స్, మోయిన్ అలీ దెబ్బకొట్టారు. వోక్స్.. స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయగా ట్రావిస్ హెడ్‌ను మోయిన్ అలీ బోల్తాకొట్టించాడు. ఇదే ఊపులో అలీ.. మిచెల్ మార్ష్ (6)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. వోక్స్.. మిచెల్ స్టార్క్‌ను డకౌట్ చేశాడు. 73 ఓవర్లలో 263-3గా ఉన్న ఆసీస్.. 81 ఓవర్ ముగిసేసరికి 294-8గా చేరింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (50 బంతుల్లో 28, 1 ఫోర్, 1 సిక్స్), టాడ్ మర్ఫీ (39 బంతుల్లో 18, 3 ఫోర్లు) ఆసీస్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు కంగారూలను విజయం వైపునకు నడిపించారు.
బ్రాడ్ కేక..
తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్.. ఆసీస్‌కు ఊహించని షాకిచ్చాడు. అప్పటిదాకా ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన బ్రాడ్.. 91వ ఓవర్లో మర్ఫీని ఔట్ చేశాడు. ఇక 94వ ఓవర్లో నాలుగో బంతికి అలెక్స్ కేరీ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ జానీ బెయిర్ స్టో అందుకోవడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ సంబురాలు షురూ అయ్యాయి.
A fairytale ending for a legend of the game.
— England Cricket (@englandcricket) July 31, 2023
Broady, thank you ❤️ #EnglandCricket | #Ashes pic.twitter.com/RUC5vdKj7p
యాషెస్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులను ఆసీస్ గెలుచుకోగా మూడో టెస్టును ఇంగ్లాండ్ గెలిచింది. నాలుగో టెస్టు వర్షం కారణంగా రద్దై డ్రా గా మిగిలింది. ఐదో టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంతో సిరీస్ 2-2తో సమమైంది. సిరీస్‌ను డ్రా చేసుకున్నా ఇంగ్లాండ్.. యాషెస్‌ను కోల్పోయింది. గతేడాది ఆస్ట్రేలియా యాషెస్‌ను గెలిచిన నేపథ్యంలో ఇప్పుడూ యాషెస్ ఆ జట్టు దగ్గరే ఉండనుంది. ఇక 2001లో చివరిసారి ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను ఓడించింది. రెండు దశాబ్దాలైనా మళ్లీ కంగారూలు.. ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌పై (యాషెస్ వరకూ) టెస్టు సిరీస్‌ను గెలవలేకపోయారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial