అన్వేషించండి

Ashes Series 2023: బెయిర్ స్టో ఔటో కాదో మీ కోచ్ ను అడగండి - ఇలాంటివి చేయడంలో ఆయన ఎక్స్పర్ట్!

Johnny Bairstow Run Out: లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఔట్ అయిన తీరు వివాదాస్పదమవుతోంది. ఇంగ్లాండ్ అభిమానులు ‘ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం‘ అని గొంతు చించుకుంటున్నారు.

Ashes Series 2023: యాషెస్  రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచినదానికంటే ఇంగ్లాండ్ వికెట్ కీపర్  బ్యాటర్ జానీ బెయిర్ స్టో  రనౌట్ అయిన  తీరు వివాదాస్పదమైంది. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ విసిరిన త్రో తో బెయిర్ స్టో  ఔట్ అవడం.. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని.. లేదు అది  క్రికెట్ లో  నిబంధన ప్రకారమే చేశామని ఇంగ్లాండ్, ఆసీస్ మాజీలు,  అభిమానులు  గొంతు చించుకుంటున్నారు.  అయితే ఇంగ్లాండ్   అభిమానులు దీనిని ఔట్ అంటారో లేదో తెలుసుకోవాలంటే ఆ జట్టు (టెస్టు) హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ను అడిగితే అసలు విషయాలు తెలుస్తాయని  ట్విటర్ లో  ఆసీస్ అభిమానులు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కు సూచిస్తున్నారు. 

మెక్ కల్లమ్ కూడా  ఇలా చేసినోడే.. 

బెయిర్ స్టో  రనౌట్ తర్వాత   ట్విటర్ లో..  ఏడాదికి పైగా  ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు హెడ్ కోచ్ గా ఉంటూ టెస్టు క్రికెట్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్న  బ్రెండన్ మెక్ కల్లమ్ (న్యూజిలాండ్) ట్రెండ్ అయ్యాడు.   మెక్ కల్లమ్ కు ఈ తరహా ఔట్ చేయడానికి సంబంధమేంటి..? అనుకుంటున్నారా..? సంబంధం ఉంది.  ఒక్కసారి కాదు. గతంలో పలుమార్లు ఈ ‘బజ్’ (మెక్ కల్లమ్ ముద్దుపేరు) బాబు  ఇలాంటి  ‘క్రీడా స్ఫూర్తి’కి విరుద్ధమైన పనులు చేసినోడే.. ఇందుకు సంబంధించి   సాక్ష్యాలు కూడా బలంగా ఉన్నాయి. 

 

న్యూజిలాండ్ తరఫున ఆడినప్పుడు బ్రెండన్ వికెట్ కీపర్ గా కూడా సేవలందించాడు. ఇమే మెక్ కల్లమ్.. గతంలో శ్రీలంక, జింబాబ్వేతో పాటు ఇంగ్లాండ్  ప్రత్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా రనౌట్స్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన  ఓ మ్యాచ్ లో  పాల్ కాలింగ్వుడ్ ను అచ్చం  నిన్న కేరీ.. బెయిర్ స్టో ను ఔట్ చేసినట్టే చేశాడు.  శ్రీలంకతో మ్యాచ్ లో కుమార సంగక్కర కూడా బ్రెండన్ కు బలైనవాడే.. లంకతో మ్యాచ్ లో సంగక్కర సెంచరీ  చేసిన తర్వాత పరుగు పూర్తి చేసిన ముత్తయ్య మురళీధరన్  అతడికి శుభాకాంక్షలు చెప్పడానికి ముందకు వెళ్లాడు.  క్రీజు వదిలిన  ముత్తయ్యను  బ్రెండన్  రనౌట్ చేశాడు.  

జింబాబ్వే మీద కూడా.. 

సరే ఇంగ్లాండ్, శ్రీలంక అంటే కొంత పెద్ద జట్లు  అనుకుందాం. కానీ పసికూన జింబాబ్వే మీద కూడా  ఈ ‘క్రీడా స్ఫూర్తి’ హెడ్ కోచ్ ఇలాగే చేశాడు. 20‌05లో  జింబాబ్వే - న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టులో జింబాబ్వే  బ్యాటర్.. మహ్వైర్  సెంచరీ పూర్తి చేశాడు. అవతలి ఎండ్ లో ఎంపోవు.. పరుగును  పూర్తి చేసి సెంచరీ చేసిన సహచరుడికి కృతజ్ఞతలు చెప్పడానికని ముందుకు వచ్చాడు.  కానీ అప్పటికీ బంతిని అందుకున్న  మెక్ కల్లమ్.. ఎంపోవును రనౌట్ చేశాడు. 

 

‘గేమ్ స్పిరిట్’ అని లెక్చర్లు ఇచ్చే ముందు ఇంగ్లాండ్ ముందు ఆ  జట్టు  ఇతర జట్లతో వ్యవహరిస్తున్న తీరును, ఆ జట్టు హెడ్ కోచ్ గతంలో చేసిన వీడియోలను చూసి మాట్లాడితే మంచిదని   నెటిజన్లు ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు.

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget