అన్వేషించండి

APL 2022: మొదలైన ఆంధ్రా ప్రీమియర్ లీగ్ - మొదటి విజయం గోదావరిదే!

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ బుధవారం ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్‌పై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ (వి.జయదేవన్) పద్ధతిలో విజేతను నిర్ణయించారు.

మొదట బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. కేవీ శశికాంత్ (55: 47 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టైటాన్స్‌ను శశికాంత్, నితీష్ కుమార్ రెడ్డి (25: 32 బంతుల్లో, ఒక ఫోర్) ఆదుకున్నారు. వీరు ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే అవసరం అయినంత వేగంగా ఆడలేకపోయారు. దీంతో గోదావరి టైటాన్స్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది. కోస్టల్ రైడర్స్ బౌలర్లలో చీపురుపల్లి స్టీఫెన్, హరిశంకర్ రెడ్డి, మాదా దీపక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

అనంతరం కోస్టల్ రైడర్స్ ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో వీజేడీ పద్ధతిలో విజేతను నిర్ణయించారు. ఏడు ఓవర్లకు చేయాల్సిన పరుగుల కంటే కోస్టల్ రైడర్స్ రెండు పరుగులు తక్కువ చేశారు. దీంతో విజయం గోదావరి టైటాన్స్‌ను వరించింది.

ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, వైజాగ్ వారియర్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Andhra Premier League - Official Account (@andhrapremierleague)

టాప్ హెడ్ లైన్స్

Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Virat Kohli, Rohit Sharma News: రోహిత్, విరాట్ లను టీమ్ నుంచి తీసేయడం ఇంపాజిబుల్.. మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీల‌క  వ్యాఖ్య‌లు
రోకో జోడీని టీమ్ నుంచి తీసేయడం ఇంపాజిబుల్.. మాజీ స్టార్ ఆల్ రౌండ‌ర్ కీల‌క  వ్యాఖ్య‌లు
Abishek Porel Arrest: ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
ఐపీఎల్ స్టార్ అభిషేక్ పోరెల్ కు బిగ్ షాక్.. తక్షణమే అరెస్ట్ చేయాలని కలకత్తా హైకోర్టు ఆదేశం
Gill Fitness Warning:  బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్
బౌలర్ల ప్రవర్తనపై ఫైర్ అయిన కెప్టెన్.. వరల్డ్ కప్ ముందు ప్లేయర్ల ఇంజ్యూరీ బ్రేక్‌డౌన్ పై గిల్ షాకింగ్ కామెంట్స్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Embed widget