అన్వేషించండి

Asian Games 2023 : తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది !

ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు.

 Asian Games 2023 : చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. ఏకంగా జ్యోతిని డిస్ క్వాలిఫై చేసేశారు. ఇది చైనా అఫీషియల్స్ వివక్షేనంటూ సోషల్ మీడియాలో భారత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పుకుందాం. 

మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రేస్ స్టార్ట్ అవబోతోంది. పతక ఫేవరెట్లలో మన జ్యోతి కూడా ఒకరు. అయితే గన్ పేలకముందే చైనాకు చెందిన యన్నీ వూ అనే అథ్లెట్ పరిగెత్తడం మొదలుపెట్టింది. దీన్నే ఫాల్స్ స్టార్ట్ అంటారు. ఆమెను చూసి జ్యోతితో పాటు మిగతా అథ్లెట్లు కూడా పరుగు మొదలుపెట్టారు. ఫాల్స్ స్టార్ట్ చేసినందుకు ఆ చైనా అథ్లెట్ తో పాటు మన జ్యోతికి కూడా రెడ్ కార్డ్ చూపించారు. అంటే రేస్ లో పాల్గొనడానికి వీల్లేకుండా.

అఫీషియల్స్ నిర్ణయంపై జ్యోతి రూల్స్ ప్రకారమే ప్రొటెస్ట్ చేసింది.అభ్యంతరం తెలిపింది. చైనా అథ్లెట్ ఫాల్స్ స్టార్ట్ చేస్తే తానెందుకు  శిక్ష ఎదుర్కోవాలని ప్రశ్నించింది. రూల్స్ ప్రకారం ఎవరైతే ముందు ఫాల్స్ స్టార్ట్ చేస్తారో వారొక్కరే డిస్ క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మిగతా అథ్లెట్లు కూడా ఆ ఒక్కర్నే చూసి ఫాలో అయిపోతారు కాబట్టి. జ్యోతి అభ్యంతరం తెలిపిన తర్వాత అనేకసార్లు రిప్లేలు చూసిన అఫీషియల్స్, జ్యోతితో పాటు చైనా అథ్లెట్ కు కూడా రేసులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కానీ రేస్ తర్వాత వారి డిస్ క్వాలిఫికేషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. రేస్ పూర్తయింది. ఆ చైనా అథ్లెంట్ రెండో స్థానంలో, మన జ్యోతి మూడో స్థానంలో నిలిచారు. కానీ మరోసారి రీప్లేలు చూసిన అఫీషియల్స్ చైనా అథ్లెట్ యన్నీ వూను డిస్ క్వాలిఫై చేశారు. అప్పుడు ఆటోమేటిక్ గా మూడో స్థానంలో ఉన్న జ్యోతి, రెండో స్థానానికి చేరి రజత పతకం పట్టేసింది.

రేస్ ప్రారంభానికి ముందు ఈ ఇన్సిడెంట్ వల్ల జ్యోతి డిస్టర్బ్ అయిందని, లేకపోతే ఇంకా బాగా పరిగెత్తేదని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అంజు బాబీ జార్జ్ అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget