అన్వేషించండి

మరణించిన వ్యక్తి భౌతిక కాయాన్ని ఒంటరిగా ఉంచకూడదా? శాస్త్రం ఏం చెబుతోంది?

మరణం తర్వాత వెంటనే అంత్యక్రియలు జరిపే అవకాశం లేనపుడు ఆ శవాన్ని ఒంటిరిగా వదిలి పెట్టరు. ఎందుకు?

భగవద్గీతలో చెప్పినదాన్ని బట్టి మరణాలు నిశ్చితాలు, హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించి మరణంతో అంతం కాదు. ఆత్మకు మరణం లేదు. మరణంతో కేవలం దేహం నశిస్తుంది. ఆత్మ మరో శరీర ధారణ చేస్తుంది. అందుకే హిందూ ధర్మంలో మరణం తర్వాత కర్మకాండలు నిర్వహిస్తారు. మరణించిన వారి కుటుంబ సభ్యులు చాలా నియమాలను పాటించాల్సి ఉంటుంది. మరణం తర్వాత వెంటనే అంత్యక్రియలు జరిపే అవకాశం లేనపుడు ఆ శవాన్ని ఒంటిరిగా వదిలి పెట్టరు. ఎందుకంటే...

సాధారంణంగా మరణం తర్వాత ఒకరోజు లోపు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహా శవాన్ని అంతకు మించిన సమయం పాటు ఉండనివ్వరు. శవానికి నిర్వహించాల్సిన అంతిమ సపర్యలను చేస్తారు. స్నానం చేయించడం, మంచి దుస్తులు, పువ్వులతో అలంకరిండం, కడసారిగా తిలకం దిద్దడం వంటివన్నీ చేసి సగౌరవంగా ఊరేగింపుగా అయిన వారంతా కలిసి అంతిమ యాత్రలో పాల్గొంటారు. అంతిమ సంస్కారం తర్వాత చనిపోయిన వ్యక్తి జ్ఞాపకార్థం అందరూ తలరా స్నానం కూడా చేస్తారు.

తర్వాత 10 నుంచి 12 రోజుల పాటు సంతాప దినాలుగా రకరకాల దిన, వార, కర్మలు నిర్వహిస్తారు. వారి జ్ఞాపకార్థం, వారికి సద్గతులు కలగాలనే ఆశయంతో అనేక రకాల దానధర్మాలు కూడా చేస్తారు. ఇదంతా కూడా దేహాన్ని విడిచిన ఆత్మ సద్గతులు పొందేందుకు చేసే తంతుగా సనాతన ధర్మం చెబుతుంది. దీనిని నమ్మని వారు హిందూవుల్లో దాదాపుగా ఎవరూ ఉండరు. దేవుడి నమ్మని వారు సైతం కొండకచో అంతిమ సంస్కారాలు మాత్రం కచ్చితంగా చేస్తారు. మరణానికి శాస్త్రంలో అంత ప్రాధాన్యత ఉంది. అంతిమ సంస్కారాలలో చాలా నియమాలు ఉంటాయి. నియమాలు పాటించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని గరుఢ పురాణం చెబుతోంది. అందులో ఒకటి శవాన్ని ఒంటరిగా వదల కూడదు. కచ్చితంగా శవం దగ్గర ఎవరో ఒకరు శవజాగారం చెయ్యాల్సి ఉంటుంది.

శాస్త్రాన్ని అనుసరించి సూర్యాస్తమయం తర్వాత అంతిమ సంస్కాలు చెయ్యకూడదు. గరుఢ పురాణాన్ని అనుసరించి శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని నుంచి దుర్వాసన వస్తుంది. అదే పురాణంలో ఒంటరిగా ఉండే శవంలో ప్రేతాత్మలు వచ్చి చేరే ప్రమాదం ఉంటుందని రాసి ఉంది. అందుకే అంతిమ సంస్కారాల వరకు శవాన్ని ఒంటరిగా వదిలి పెట్టరు.

మరణానంతరం వెంటనే ఎందుకు అంతిమసంస్కారాలు జరపరు?

వ్యక్తి మరణించినట్టు ప్రకటించిన తర్వాత అతడి శరీరం పూర్తిగా శాంతించే వరకు దహన సంస్కారాలు జరపరాదు. అదీ కాకుండా అతడిని కడసారిగా అతడి ప్రియమైన వారు ఒకసారి చూసేందుకు అవకాశం కూడా కల్పించాలి. కనుక వెంటనే అంతిమ సంస్కారాలు చెయ్యరు.

బంధుమిత్రుల సందర్శనార్థం కొంత సమయం పాటు శవాన్ని ఉంచినపుడు శవం దగ్గర తప్పకుండా మనుషులు ఎవరో ఒకరు ఉండాలి. అలా ఉండకపోతే గరుఢ పురాణాన్ని అనుసరించి ఆ శరీరంలోకి చెడు ఆత్మలు ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అది ఆ శరీరానికి, కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదకరం కావచ్చు. కనుక శవం దగ్గర కచ్చితంగా ఎవరైనా ఉండాలి. అదీ కాక బ్యాక్టీరియా చేరి శరీరం కుళ్లిపోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకు శవం దగ్గర ధూపం వేసేందుకు కచ్చితంగా ఎవరైనా ఉండడం అవసరం.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan Tour: సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Delhi Fire Accident: ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
Upasana: ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Attack on Pulivarthi Nani | Tirupati |  చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి | ABP DesamPalnadu Fight Between ysrcp and tdp | పల్నాడులో ఆగని హింస.. వైసీపీ కార్యకర్తలపై దాడులు  | ABP DesamAttack on Pulivarthi Nani | Tirupati |  చంద్రగరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి | ABP DesamPM Modi Files Nomination From Varanasi | ఎన్డీయే మిత్రపక్షాలతో మోదీ..ఘనంగా నామినేషన్ కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan Tour: సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ విదేశీ టూర్‌కు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Delhi Fire Accident: ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
ఢిల్లీలోని ఐటీవోలో ఘోర అగ్నిప్రమాదం, మంటల్ని ఆర్పుతున్న 21 ఫైరింజన్లు
Upasana: ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని - క్లింకారను ఒంటరిగా వదిలి వెళ్లేటప్పుడు తనకంటే ఎక్కువ ఏడుస్తాం..
Pulivarthi Nani: టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, కారు ధ్వంసం - గాల్లోకి కాల్పులు!
టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, కారు ధ్వంసం - గాల్లోకి కాల్పులు!
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Embed widget