అన్వేషించండి

Mahabharata War: ఏకలవ్యుడు కౌరవుల వైపా - పాండవుల వైపా? కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడా? ఎవరి చేతిలో మరణించాడు? వాస్తవం ఏంటి?

Kurukshetra War: ఏకలవ్యుడు..మహాభారతంలో ఓ ప్రముఖ, ప్రేరణత్మక పాత్ర. ఇంతకీ ఈ ఏకలవ్యుడు మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడా? ఎప్పుడు, ఎవరి చేతిలో మరణించాడో తెలుసా?

Ekalavya Death: ఏకలవ్యుడు.. మహాభారతం మొత్తం చదివినా లేకున్నా...పురాణాలపై ఆసక్తి ఉండేవారు, పౌరాణిక సినిమాలు చూసేవారు ఈ పేరు వినిఉంటారు. చిన్నప్పటి నుంచి ధనుర్విద్యలో ఆసక్తి కలిగిన ఏకలవ్యుడు గురువు ద్రోణాచార్యుడి వద్ద శిక్షణ పొందాలనుకున్నాడు. కానీ ద్రోణాచార్యుడు తాను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తానని చెప్పి నిరాకరించారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా..ద్రోణుడినే గురువుగా భావించి తన విగ్రహం పెట్టుకుని ధనుర్విద్య నేర్చుకున్నాడు. ఏకలవ్యుడి అపారమైన సాధన, ఏకాగ్రత వల్ల అసాధారణమైన ధనుర్విద్యాపారంగుతుడిగా నిలిచాడు. ఓసారి ద్రోణుడు..కౌరవ-పాండులను తీసుకుని అడవికి వెళ్లగా అక్కడ ఓ కుక్కపై ఏకలవ్యుడు ప్రయోగించిన బాణాలను చూసి నివ్వెరపోయారు ద్రోణాచార్యులు. అయితే తనను గురువుగా పెట్టుకుని అభ్యాసం చేసినందుకు గురదక్షిణ సమర్పించాలని కోరారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుడిచేయి బొటనవేలు తీసి గురుదక్షిణగా సమర్పించాడు ఏకలవ్యుడు. 

Mahabharata War: ఏకలవ్యుడు కౌరవుల వైపా - పాండవుల వైపా? కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడా? ఎవరి చేతిలో మరణించాడు? వాస్తవం ఏంటి?

 మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?

ఈ కథ చాలామందికి తెలుసు...మరి ఆ తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?

మహాభారత యుద్ధంలో పాల్గొన్నాడా?

ఏకలవ్యుడు.. పాండవులు - కౌరవులు ఎవరివైపు?

ఏకలవ్యుడు ఎప్పుడు, ఎవరి చేతిలో మరణించాడు?

ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడుంది....

అసలు విషయం ఏంటంటే ఏకలవ్యుడు కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు..ఎందుకంటే మహాభారత యుద్ధానికి ముందే ఏకలవ్యుడు మరణించాడు. 


Mahabharata War: ఏకలవ్యుడు కౌరవుల వైపా - పాండవుల వైపా? కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నాడా? ఎవరి చేతిలో మరణించాడు? వాస్తవం ఏంటి?
  
ద్రోణుడికి తన బొటనవేలు గురుదక్షిణగా ఇచ్చిన తర్వాత కూడా ఏకలవ్యుడు పుట్టుదలతో అభ్యాసం కొనసాగించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మగధ రాజ్యాధినేత అయిన జరాసంధుడికి మిత్రుడు అయ్యాడు. జరాసంధుడు శ్రీ కృష్ణుడికి శత్రువు.  
 
యాదవులకు - జరాసంధుడి సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో ఏకలవ్యుడు జరాసంధుడికి అండగా నిలిచి శ్రీ కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. తన అసాధారణ యుద్ధ నైపుణ్యాన్ని చూసిన శ్రీ కృష్ణుడు భవిష్యత్ లో ధర్మ విరుద్ధంగా పాండవులకు వ్యతిరేకంగా నిలబడతాడని గ్రహించి.. ఏకలవ్యుడిని సంహరించాడు కృష్ణుడు. ఈ సంఘటన ఉద్యోగపర్వం/ ద్రోణపర్వంలో ఉంది

కురుక్షేత్ర యుద్ధం సమయంలో కృష్ణుడు అర్జునుడితో ఓ సందర్భంలో ఇలా చెప్పాడు. ఓ అర్జునా..నీ మేలు కోరి నేను ముందుగానే జరాసంధుడు, శిశుపాలుడు, ఏకలవ్యుడిని అంతం చేశాను. ఏకలవ్యుడు జీవించి ఉంటే కౌరవుల పక్షాన యుద్ధం చేసేవాడు. బొటలవేలు లేకపోయినా యుద్ధంలో ఏకలవ్యుడు అజేయుడిగా నిలిచేవాడు, తనని జయించడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదని చెప్పాడు. అయితే ఏకలవ్యుడి కుమారుడు యుద్ధంలో పాల్గొనకపోయినా తన కుమారుడు కేతుమాన్ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాటం చేసి భీముడి చేతిలో మరణించాడు. 

ఏకలవ్యుడు విలువిద్యా ప్రదర్శనలో అర్జునుడి కన్నా గొప్పవాడు..యుద్ధ సమయంలో అధర్మం వైపు నిలబడతాడు అనే ఉద్దేశంతోనే శ్రీ కృష్ణుడు యుద్ధానికి ముందే అంతం చేశాడని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

దేవుళ్ల ఫొటోల్లో ఒళ్లంతా బంగారమే! వాళ్లకు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయ్? మనకు ఎప్పటి నుంచి అలవాటైంది?

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
03-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
మీన రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: ప్రేమ, కెరీర్, ఆర్థిక విజయాలు మీ సొంతం!
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
కుంభ రాశి ఆగస్టు 2-8 వారఫలాలు: అద్భుత అవకాశాలు, ఆర్థిక వృద్ధి
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
మకర రాశి: ఆగస్టు 2-8 వారం - మీ జీవితంలో స్థిరత్వం, ఎదుగుదలకు ఇదే సమయం!
Advertisement

వీడియోలు

Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
Embed widget