సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం

Published by: RAMA

సాయంత్రం పూజ గదిలో లేదా తులసికోట దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఈ మంత్రం చదవాలి

Published by: RAMA

ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, సానుకూల శక్తి వెల్లివిరుస్తుందని భక్తుల నమ్మకం

Published by: RAMA

శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధన సంపదః
మమశత్రు వినాశాయ సాయం జ్యోతిర్నమోస్తుతే॥

Published by: RAMA

శుభాన్ని, కళ్యాణాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను ప్రసాదించి, చెడు ఆలోచనలు నశింపజేసే దీపజ్యోతికి నమస్కారం

Published by: RAMA

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే॥

Published by: RAMA

దీపం జ్ఞానస్వరూపుడైన పరబ్రహ్మ స్వరూపం. అజ్ఞానం అనే చీకటిని తొలగించే సంధ్యా దీపానికి నమస్కారం

Published by: RAMA

సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6 నుంచి 7 మధ్య దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం

Published by: RAMA

దీపాన్ని తూర్పు దిశగా వెలిగిస్తే ఆయుష్షు, ఉత్తర దిశగా వెలిగిస్తే ఐశ్వర్యం అని భక్తుల విశ్వాసం

Published by: RAMA