అన్వేషించండి

మనిషి ప్రవర్తన ఒక్కోరోజు ఒక్కోలా ఉంటుంది ఎందుకు? శాస్త్రం , సైన్స్ ఏం చెబుతున్నాయ్?

Science and Spirituality: మనిషి ప్రవర్తన ఒక్కోరోజు ఒక్కోలా ఎందుకు మారుతుంది? మనస్తత్వ శాస్త్రం, న్యూరోసైన్స్ - ఆధ్యాత్మిక గ్రంథాలు ఏం చెబుతున్నాయ్? మూడ్ స్వింగ్స్ వెనుకున్న కారణాలేంటి?  

Spiritual News

ఓ రోజు మంచిగా..

మరో రోజు చికాకుగా..

ఎందుకిలా?

మనసు మార్పులకు కారణం ఏంటి?

సైన్స్ ఏం చెబుతోంది? వేదాలు ఏం చెప్పాయ్?  

మనిషి ప్రవర్తన రోజుకోలా మారడం గురించి శాస్త్రం, సైన్స్ లో ఏముందంటే.. మనసు ఎప్పుడూ స్థిరమైనది కాదు. ఇందుకు ప్రధానంగా 7 కారణాలు చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు..ఏ కారణంతో ఎప్పుడు ఎలా మనసు మారుతుందో వివరిస్తున్నారు. ఆ ఏడు కారాణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భగవద్గీత ప్రకారం మనలో సత్వ, రజో, తమో గుణాలుంటాయి. అవి ఎప్పుడూ మారుతుంటాయి. సత్వ గుణం అంటే శాంతం, రజో గుణం అంటో కోపం, తమస్సు అంటే సోమరితనం ఉంటుంది. మీలో ఏ గుణం ఉంటే మీ ప్రవర్తన అలా మారిపోతుంది

మనసు కోతిలాంటిది..ఎప్పుడూ ఓ కొమ్మ మీద ఉండిపోదు. ప్రతి క్షణం ఆలోచన మారుతుంది. రోజు వరకూ ఎందుకు కొద్దిసేపటికే ప్రవర్తన మారిపోతుంది కొందరిలో..

సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, బాధలో కష్టంలో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు - లేనప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు ప్రవర్తనలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది
 
ఆరోగ్య స్థితి, ఆహారం, ఆకలి, నిద్రలేమి...ఇవన్నీ కూడా మీ ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి
 
ముఖ్యంగా సాంగత్య దోషం అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఎలాంటివారితో స్నేహం చేస్తే అలాంటి ఆలోచనలే మీక్కూడా వస్తాయ్, మీ ప్రవర్తన కూడా అలా మారిపోతుంది. కర్ణుడిలో అంత విద్య ఉన్నప్పటికీ కేవలం దుర్యోధనుడితో స్నేహం కారణంగానే తన ప్రతిభకు తగిన గుర్తింపు పొందలేకపోయాడు. 

కొన్నిసార్లు పాతవాసనలు డామినేట్ చేస్తాయి. పుట్టుకతో వచ్చిన అలవాట్లు పోయేవరకూ పోవంటారు. మధ్యలో కొన్ని చెడు అలవాట్లు వదిలేశాం అని చాలామంది చెబుతుంటారు కానీ వాటి వాసనలు అలానే ఉండిపోతాయ్. అవి బయటపడిన క్షణం..మళ్లీ ప్రవర్తనలో మీరు ఊహించనంత మార్పు వస్తుంది
 
నాది నేను అనే అహం దెబ్బతిన్నప్పుడు మీకు తెలియకుండానే ప్రవర్తన మారిపోతుంది. పొగిడితే పొంగిపోవడం, విమర్శిస్తే కుంగిపోవడం ఇవన్నీ కూడా ప్రవర్తనలో మార్పులకు కారణం

మనసు మారడం గురించి రమణ మహర్షి చెప్పిన సమాధానం

మనసు గురించి ఓ భక్తుడు..రమణ మహర్షి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు. స్వామీ... నా మనసు నిలకడగా ఉండడం లేదు, ఈ రోజు పూజ చేస్తాను, రేపు బద్ధకంగా ఉంటోందని. చిన్నగా నవ్విన రమణ మహర్షి.. మనసు అంటేనే ఆలోచనల సమూహం, ఆలోచన మారినప్పుడు మనసు మారుతుంది కానీ నువ్వు మారవు. సముద్రంపై అలలు వస్తుంటాయ్, పోతుంటాయ్ కానీ సముద్రం అలానే ఉంటుంది. అలలను చూసి సముద్రం మారిందనడం ఎంత తప్పో, ఆలోచనలు మారితే ‘నేను మారిపోయాను’ అనుకోవడం కూడా అంతే తప్పు. అలలు - సముద్రం మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే నీ ప్రవర్తన ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టదు అని సెలవిచ్చారు రమణ మహర్షి.

మరి మనుసుని స్థిరంగా ఎలా ఉంచుకోవాలి?

ఇందుకోసం 3 ముఖ్యసూత్రాలు సూచించారు ఆధ్యాత్మికవేత్తలు
 
రోజుకి 5 నిముషాల పాటు కళ్లు మూసుకుని ఈ రోజు నా మనసు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయని గమనించు. మార్చాలని చూడొద్దు.. గమనించు, వ్యత్యాసాన్ని తెలుసుకో.. ఇది జరిగితే సగం మార్పు సాధ్యమైనట్టే
 
5 నిముషాల ధ్యానంలో మీకున్న మంచి అలవాట్లు ఏమున్నాయో ఆలోచించి.. ఓ అలవాటుని పట్టుకుంటే చాలు..రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది
 
బాగా కోపం వచ్చినా సంతోషం వచ్చినా, చెడు జరిగినా మంచి జరిగినా కానీ..ఇదే శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో.. అప్పుడు మీ ప్రవర్తనలో వచ్చే హెచ్చుతగ్గులు మీరే గుర్తించి సరిచేసుకోగలరు

ప్రవర్తన మారడం తప్పా?

ప్రవర్తన మారడం తప్పా అని ప్రశ్నిస్తే అస్సలు కాదు.  కానీ ప్రవర్తనలో  మార్పు వచ్చిందంటే ఎదురుగా ఉన్న వ్యక్తి, సందర్భం డిమాండ్ చేయాలి. ఆంజనేయుడు సీతమ్మ ముందు వినయపూర్వకంగా ప్రవర్తిస్తే..రావణుడి ముందు రుద్రుడిలా విజృంభించాడు. ప్రవర్తన మారింది కానీ రామభక్తి అనే తన ఉద్దేశం మారలేదు. అలానే మీ ప్రవర్తనలో మార్పులు రావొచ్చు కానీ.. మూలం బలంగా ఉండాలి. అది ధర్మం, సత్యం, ప్రేమ ఏదైనా కావొచ్చు. 

ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు రావడం లేదా? ఎప్పుడైనా '8888' పద్ధతిను పాటించారా?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

దేవుళ్ల ఫొటోల్లో ఒళ్లంతా బంగారమే! వాళ్లకు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయ్? మనకు ఎప్పటి నుంచి అలవాటైంది?


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Grahan 2026: చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
చంద్ర గ్రహణం రోజు రక్షా బంధన్! పూజ చేసేందుకు సమయం, నియమాలు తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
బుధవారం ఏ దేవుడిని పూజించాలి?చదవాల్సిన శ్లోకాలు, పూజా విధానం, నైవేద్యం తెలుసుకోండి!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget