అన్వేషించండి

Easter: ఈస్టర్ అంటే ఏమిటి? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?

ఈస్టర్ మరణాన్ని జయించడానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. కాలక్రమేణా ఈస్టర్ ఉత్సవాలు రూపం మార్చుకున్నాయి.

ఈస్టర్ క్రిష్టియన్లకు ముఖ్యమైన రోజుల్లో ఒకటి. శిలువ వెయ్యడం వల్ల మరణించిన ఏసు క్రీస్తు మూడవ రోజున పునరుత్తానాన్ని ఈస్టర్ గా క్రిష్టియన్లు జరుపుకుంటారు.

మరణానంతరం మూడోరోజున ఏసుక్రీస్తు పునరుత్తానం అనేది మరణాన్ని జయించడానికి ప్రతీక మాత్రమే కాదు, పాపం నుంచి విముక్తిగా కూడా పరిగణిస్తారు. ఈస్టర్ తో క్రైస్తవులు లెంట్ సీజన్ కు ఒక సంతోషకరమైన ముగింపును ఇస్తారు. ఈ సమయంలో ప్రార్థనలు, ఉపవాసం చెయ్యడం, పాపానికి పాశ్చాత్తాపం వంటి వాటికోసం కేటాయించిన సమయం.

ఏసుక్రీస్తు పునరుత్తానం జ్ఞాపకార్థం జరుపుకునే క్రైస్తవ పండుగ ఈస్టర్. వసంతం మొదలైన తర్వాత మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నాడు ఈస్టర్ జరుపుకుంటారు.  కొన్ని పాశ్చత్య చర్చిల్లో, గ్రగేరియన్ క్యాలెండర్ ను అనుసరించి, సంప్రదాయ చర్చిల్లో జూలియన్ క్యాలెండర్ ను అనుసరించి ఈరోజును లెక్కించి నిర్ణయిస్తారు.

ఈస్టర్ అనే పదం మూలం గురించి కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. బైబిల్ నిఘంటువును అనుసరించి ఈస్టర్ అనే పదం ఈస్ట్రే అనే పదం నుంచి వచ్చింది. నిజానికి ఇది సక్సన్ పదం. సాక్సన్ దేవతను సూచించే పదం. ఈ దేవత ఆరాధన కోసం పూర్వకాలంలో బలులు ఇచ్చే సంప్రదాయం ఉండేదట.

ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి రావడమే ఈస్టర్. ఆయన పునరుత్తానం అంటే అతడి మీద విశ్వాసం ఉన్న వారందరికి కూడా చిరాయువు ప్రసాదించబడుతుందని నమ్మకం. తన మూడు సంవత్సరాల బోధనలన్నింటికి పూర్తి దృవీకరణ ఈస్టర్ ముఖ్య ఉద్దేశ్యం. ఆయన పునరుత్తనం చెంది ఉండకపోతే మరొక బోధకుడు లేదా ప్రవక్తగా మిగిలిపోయే వాడు. కానీ అతడి పునరుత్తానం అతడు దైవకుమారుడని, మరణానికి అతీతుడని తిరస్కరించలేని రుజువును చూపుతుందని క్రైస్తవుల నమ్మకం.

ఏసు పునరుత్తానం నజరేతుకు చెందిన ఏసును ఇజ్రాయెల్ లో ప్రవచించిన మెస్సియగా, జెరూసలేం కు కొత్త రాజు లేదా ప్రభువుగా దృవీకరించింది. ఇది కొత్త రాజ్యానికి కొత్త స్వర్గం గా బైబిల్ చెబుతోంది. క్రీస్తు పునరుత్తానం ఒక్కటే కాదు ఈస్టర్ అంటే అందుకు భిన్నమైన ఉద్దేశాలు కూడా ఉన్నాయి. ఈస్టర్ విందు వసంతకాల ఆగమనానికి స్వాగతంగానూ సక్సన్ దేవత ఈస్ట్రేను ఆరాధించే రోజుగా కూడా చెబుతారు. ఈ రోజుల్లోనే క్రీస్తు పునరుత్తానం జరిగినట్టుగా చెబుతారు.

యూదు సంప్రదాయం ప్రకారం ఈజిప్ట్ నుంచి యూదులు బానిసత్వం నుంచి లభించిన విముక్తికి గుర్తుగా యూదుల హాలీడేగా ఈస్టర్ విందులు జరుపుకుంటారు.

ఈ ఏడాది ఎప్పుడు?

ఈ సంవత్సరం ఏప్రిల్ 09, 2023న ఆదివారం నాడు జరుపుకుంటున్నారు. క్రిస్మస్ లా ఇది ఒక నిర్ణీత తేదిన జరుపుకునే పండుగ కాదు. ప్రతి సంవత్సరం ఈస్టర్ తేది మారుతుంది. మూన్ సైకిల్స్ ను అనుసరించి ఈ తేదీని నిర్ణయిస్తారు. ఈ పండుగ ప్రతి ఏటా ఆదివారం జరుపుకునే పండుగ.

ఈస్టర్ బన్నీ, బాస్కెట్ ఆఫ్ క్యాండీ, ఈస్టర్ ఎగ్ హంట్స్ వంటి అనేక కొత్త సంప్రదాయాలు కూడా ఉన్నాయి.

సన్ రైజ్ సర్వీసెస్ – రక్షకుడు ఉదయించడానడానికి గుర్తుగా చాలా చర్చిల్లో ఉదయం సూర్యోదయ సేవలు అని ప్రత్యేక ప్రార్థనలు జరుపుతాయి.

రీసరెక్షన్ రోల్స్ – ఏసు ఖాళీ సమాది గురించి పిల్లలకు తెలియజేసేందుకు ఇది ఒక మంచి మార్గం. పెద్ద మార్ష్ మాల్లో లోపల కూరిన రీసరెక్షన్ రోల్స్ ను బేక్ చేసినపుడు మార్ష్ మాల్లో లోపలే మాయం అవుతాయి. ఇవి ఏసు ఖాళీ సమాధిని సూచిస్తాయి.

ఏసు క్రీస్తు త్యాగానికి, స్వచ్ఛతకు గుర్తుగా ఈస్టర్ లిల్లిలతో చర్చిలు, ఇళ్లను అలంకరిస్తారు. ఈస్టర్ ఇంకా ఎన్నో వేడుకలకు ప్రారంభంగా ఉంటుంది. ఆష్ వెడ్నెస్ డే (ఫస్ట్ డే ఆప్ లెంట్) గా పిలిచే మొదటి బుధవారం అంటే క్రీస్తు ఎడారిలో చేసిన 40 రోజుల ఉపవాసదీక్షకు గుర్తుగా ఈ 40 రోజుల పాటు తమకు చాలా ఇష్టమైన ఒక పదార్థాన్ని విడిచి పెట్టడం సంప్రదాయంగా సాగుతోంది. పామ్ సండే అంటే ఏసు జెరుసలేంలోకి ప్రయాణించిన మెస్సియగా మారిన రోజు. గుడ్ ఫ్రైడే అనేది ఏసు శిలువ వేయబడిన రోజు. ఇలా అనేక పండుగలు ఈస్టర్ కు అనుంధానంగా జరుపుకుంటారు.

Also Read: అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా… దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Election 2024 Updates: అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
అమెరికా అధ్యక్ష పదవికి చేరువలో డొనాల్డ్ ట్రంప్‌- 200పైగా ఎలక్టోరల్స్‌లో విజయం
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
RRB: ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో ఒకటే గ్రామీణ బ్యాంక్‌ - స్పెషల్‌ కేస్‌గా తెలంగాణ
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Embed widget